వాహనాలపై అదృష్ట సంఖ్యలు నిజంగా లక్‌ను ఇస్తాయా..!

వాహన ప్రియులు ఎక్కువగా ఇష్టపడే సంఖ్య 9. సాధారణంగా చాలా మంది తొమ్మిది అంకె ఉండే నంబర్ కోసం ప్రయత్నిస్తారు, అది దొరకనప్పుడు అన్ని నంబర్లు కలిపితే 9 సంఖ్య వచ్చే నంబర్‌ను ఎన్నుకుంటుంటారు. తమ అదృష్ట సంఖ్య తమ వాహనంపై ఉంటే అంతా మంచి జరుగుతుందని చాలా మంది అభిప్రాయం. ఈ సెంటిమెంట్‌ను మీడియేటర్లు, బ్రోకర్లు బాగానే క్యాష్ చేసుకునేవారు. మొదట్లో ఫ్యాన్సీ నంబర్ కావాలంటే బ్రోకర్ల ద్వారానే ఆ పని సాధ్యమయ్యేది. అయితే ఇప్పుడు ఆ బాధ లేదు, ఏపి రవాణా అధికారిక వెబ్‌సైట్‌లో ఫ్యాన్సీ నంబర్ల జాబితాను చూడొచ్చు.
ఫ్యాన్సీ నంబర్లలో ఎక్కువగా.. 1, 2, 5, 9 లతో పాటు 999, 555, 9999 వంటి నంబర్లకు మంచి గిరాకీ ఉంటుంది. గతేడాది కూడా ఇలా ఫ్యాన్సీ నంబర్ కోసం జరిపిన ఓ వేలంలో 'AP 09 CA 9999' నంబర్ 9.6 లక్షలు పలికింది. ఈ డబ్బుతో రెండు చిన్న కార్లను కానీ లేదా ఓ ప్రిమీయం కారుని కానీ కొనుక్కోవచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన 70 లక్షల రూపాయల బిఎమ్‌డబ్ల్యూ కారు కోసం ఈ నంబర్‌ను వేలం పాటలో గెలుచుకున్నారు.


Click it and Unblock the Notifications








