ర్యాష్ డ్రైవింగ్ కేసులో జాన్ అబ్రహామ్ అరెస్ట్, విడుదల!
బాలీవుడ్ హంక్‌గా చెప్పుకునే కండల వీరుడు జాన్ అబ్రహామ్ జైలుపాలయ్యాడు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఈ సినీ నుటుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఖర్ దందా ప్రాంతంలో 2006లో బైక్ మీద వెళుతూ పాదచారులను ఢీకొట్టిన కేసులో జాన్‌కు 15 రోజుల జైలు శిక్షను బాంద్రా కోర్టు విధించింది. 2006 సంవత్సరంలో జాన్ అబ్రహామ్ బైక్‌ను ర్యాష్‌గా నడిపి రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని గాయపరిచాడు.
ఇదే కేసులో అక్టోబర్ 2010లో కూడా బాంద్రా మొట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 15 రోజుల జైలు విధించగా దీన్ని బాంద్రా కోర్టు ధ్రువ పరిచింది. అయితే, జాన్ అబ్రహామ్ రూ.20,000 జరిమానా కట్టి జైలు శిక్ష నుండి తప్పించుకున్నాడు. జాన్ అబ్రహామ్‌కు స్పీడ్‌గా వెళ్లే మోటార్‌బైక్‌లంటే మహా ఇష్టం. జాన్ వద్ద యమహా సూపర్‌బైక్ వీ-మ్యాక్స్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications









