చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

టయోటా కంపెనీ యొక్క ఫార్చ్యూనర్ అత్యంత ప్రసిద్ధి చెందిన ఎస్‌యూవీ, ఈ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి మంచి ప్రజాదరణ పొందింది, ఈ కారణంగానే కంపెనీ కూడా ఈ ఎస్‌యూవీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే వచ్చింది. 2021 ఏడాది మొదట నెలల్లో కంపెనీ తన ప్రసిద్ధ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ యొక్క 2021 వెర్షన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.

చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

ఇటీవల కాలంలో టయోటా కంపెనీ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి చెందిన లెజెండర్ మోడల్ విడుదల చేసింది. ఇది విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందింది. ఫార్చ్యూనర్ ఎస్‌యూవీతో పోలిస్తే లెజెండరీ వెర్షన్ కొంత కఠినమైన రూపాన్ని కలిగి ఉంది.

చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

ఈ కొత్త లెజండర్ ఎస్‌యూవీలో అనేక అప్డేట్ ఫీచర్స్ ఉన్నాయి. కావున మునుపటికంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో అదనపు ప్రీమియం భాగాలు చేర్చబడ్డాయి. లెజండర్ మార్కెట్లో ఎక్కువమంది అభిమానులు కూడా ఉన్నారు.

MOST READ:మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు

చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

ఇటీవల ఒక కళాకారుడు టయోటా ఫార్చ్యూనర్ లెజెండరీ ఎస్‌యూవీని కేవలం చెక్కతో అద్భుతంగా తయారుచేసి ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నాడు. చెక్కతో నిర్మించిన ఈ లెజెండర్ ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం వుడ్ వర్కింగ్ ఆర్ట్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది.

చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

చెక్క ఫార్చ్యూనర్ లెజెండర్ కారుని ఈ వీడియోలో గమనించవచ్చు, ఈ వీడియో యొక్క విడి భాగాలూ తయారుచేయడం గమనించవచ్చు. వీడియో మొదట్లో కారు యొక్క ముందు, వెనుక భాగంలో మరియు సైడ్ ప్రొఫైల్ కి సంబంధించి మూడు చెక్క ముక్కలను కత్తిరించారు.

MOST READ:కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

కారు సైడ్ ప్రొఫైల్ కి అవసరమైనంత చెక్కను కత్తిరించారు. తర్వాత కారు యొక్క ముందు భాగం మరియు డోస్ కూడా తయారుచేయబడింది. ఈ చెక్క టయోటా ఫార్చ్యూనర్ కారు యొక్క చక్రాలు కూడా చెక్కతోనే తయారుచేశారు.

చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

ఈ అద్భుతమైన చెక్క కారుని తయారుచేసిన ఈ ఆర్టిస్ట్ కకారు వెలుపలి భాగాన్ని రూపొందించడానికి కొన్ని సాధనాలను ఉపయోగించాడు, కాని కారు లోపలి భాగం మొత్తం చేతితో చెక్కబడింది. ఇంటీరియర్ పనులు పూర్తయిన తర్వాత రూప్ కూడా నిర్మించబడింది.

MOST READ:మహీంద్రా బొలెరో యాక్ససరీస్ వచ్చేశాయ్.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

ఈ చెక్క ఫార్చ్యూనర్ లో డోర్, బోనెట్ మరియు బూట్ స్థలాన్ని తయారు చేయడానికి కారు రూపకల్పనలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. ఇక్కడ కనిపించే వుడ్ టయోటా లెజెండర్ మరియు సాధారణ లెజెండర్ కి పెద్దగా తేడాలు లేవని గుర్తించవచ్చు.

చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

ఈ చెక్క టయోటా ఫార్చ్యూనర్ లో విండోస్ మీద గాజులా కనిపించేలా బ్లాక్ కలర్ పెయింట్ వేయబడింది. అంతే కాకుండా ఇందులో హెడ్ లైట్స్ మరియు టైల్ లైట్స్ కి కూడా సరిపోయే విధమైన కలర్స్ ఉపయోగించారు. కారు యొక్క ఫ్రంట్ బంపర్, హెడ్‌ల్యాంప్, గ్రిల్ మరియు ఇంజిన్ భాగాన్ని కూడా చెక్కతో చెక్కారు.

MOST READ:భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

ఇక్కడ మనం ఈ కారులో గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇందులో చక్రాలు కూడా చెక్కతో తయారు చేయబడటం గమనార్హం. టైర్ల కోసం ఉపరితలం మీద గుండ్రని గ్రిడ్లుగా విభజించబడింది. ఈ కళాకారులు లెజెండర్ ఎస్‌యూవీలో ఉన్న మాదిరిగానే అల్లాయ్ వీల్స్‌ను రూపొందించారు.

చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

సస్పెన్షన్ సిస్టమ్ లెజెండ్ లెజెండరీ ఎస్‌యూవీ యొక్క ముందు మరియు వెనుక భాగంలో ఉన్నట్లే తయారుచేయబడింది. చెక్క లెజెండరీ ఎస్‌యూవీ లోపలి భాగంలో మూడు వరుసల సీట్లు ఉన్నాయి. ఏది ఏమైనా చెక్కతో ఇంతటి అద్భుతమైన కళాఖండం తయారుచేయడం ప్రశంసించదగ్గ విషయమే అని చెప్పాలి.

Image Courtesy: Woodworking Art

Most Read Articles

English summary
Artist Carves Wooden Toyota Fortuner Legender. Read in Telugu.
Story first published: Monday, April 19, 2021, 15:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X