కోవిడ్-19 వాక్సిన్​పై అవగాహన కోసం కొత్త ఐడియా.. సూపర్ కదా

భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో వ్యాపించి ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిందో అందరికి తెలుసు. కరోనా సెకండ్ వేవ్ అధికంగా వ్యాపించిన సమయంలో భారతదేశంలో రోజుకి 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా విధించిన కరోనా లాక్ డౌన్ వల్ల ఇప్పుడు పరిస్థితి కొంత కుదుటపడింది.

కోవిడ్-19 వాక్సిన్​పై అవగాహన కోసం కొత్త ఐడియా.. సూపర్ కదా

ప్రస్తుతం కరోనా కేసులు భారీగా తగ్గినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. కరోనా నివారణకోసం పాటు పడుతున్న ప్రభుత్వంతో ఎంతో మంది ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి రోగులకు సేవ చేసారు. ఇప్పుడు కరోనా తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి.

కోవిడ్-19 వాక్సిన్​పై అవగాహన కోసం కొత్త ఐడియా.. సూపర్ కదా

ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలకు వ్యాక్సిన్ మీద సరైన అవగాహన లేదు, కావున ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహనా కల్పించడానికి చెన్నైకి చెందిన ఒక కళాకారుడు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. వ్యాక్సిన్ తప్పకుండా అందరూ వేసుకోవాలని తెలియజేయడానికి ఒక ఆటో రిక్షాకి వాక్సిన్ రూపాలను అంటించాడు. దీనికి సంబంధించిన పోటోలను మీరు ఇక్కడ గమనించవచ్చు.

కోవిడ్-19 వాక్సిన్​పై అవగాహన కోసం కొత్త ఐడియా.. సూపర్ కదా

నివేదికల ప్రకారం, ఈ ఆటో రిక్షాను ఆర్ట్ కింగ్ డమ్ వ్యవస్థాపకుడు గౌతమ్ రూపొందించారు. ఈ ఆటో రిక్షాను వ్యర్థ పదార్థాలైన వేస్ట్ పైప్, పాత ప్లాస్టిక్ బాటిల్ మరియు ప్లైవుడ్ వంటి వాటితో రూపొందించారు. ఇది చూడటానికి కొంత విచిత్రంగా ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంది.

కోవిడ్-19 వాక్సిన్​పై అవగాహన కోసం కొత్త ఐడియా.. సూపర్ కదా

ఆటో రిక్షాకి పై నుండి క్రింది వరకు బ్లూ కలర్ పెయింట్ వేయబడింది. దీనికి పెద్ద పెద్ద సిరంజిలు మరియు వ్యాక్సిన్ బాటిల్స్ ఏర్పాటు చేసాడు. కోవిడ్ 19 వ్యాక్సిన్ల యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి, వ్యాక్సిన్ బాటిల్ యొక్క ప్రతిరూపాలు ఆటో రిక్షా పైకప్పుపై ఉంచబడ్డాయి.

కోవిడ్-19 వాక్సిన్​పై అవగాహన కోసం కొత్త ఐడియా.. సూపర్ కదా

ఈ ఆటో రిక్షా యొక్క హెడ్ లైట్ మీద కూడా మీరు మరొక చిన్న వ్యాక్సిన్ బాటిల్ లాంటి ప్రతిరూపాన్ని చూడవచ్చు. ఇవి మాత్రమే కాకుండా, ఆటో రిక్షా యొక్క రెండు వైపులా పెద్ద సిరంజి లాంటి ప్రతిరూపాలను వ్యవస్థాపిన్చటం జరిగింది.

కోవిడ్-19 వాక్సిన్​పై అవగాహన కోసం కొత్త ఐడియా.. సూపర్ కదా

బి.గౌతమ్ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌తో చేతులు కలిపి ఈ కరోనా వ్యాక్సిన్ ఆటో రిక్షాను డిజైన్ చేశారు. దీని గురించి మాట్లాడుతూ, రెండు నెలల క్రితం ఈ ఆటో డిజైన్ గురించి చెన్నై కార్పొరేషన్‌కు చెప్పాను. ఆ సమయంలో చెన్నై కార్పొరేషన్ నుండి తనకు సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు.

కోవిడ్-19 వాక్సిన్​పై అవగాహన కోసం కొత్త ఐడియా.. సూపర్ కదా

ఆటో రిక్షాను పూర్తిగా రూపొందించడానికి పది రోజుల సమయం పట్టిందని ఆయన అన్నారు. గౌతమ్ రూపొందించిన ఈ ఆటో రిక్షా మరొక ఆటో డ్రైవర్‌కు చెందినది. ఈ ఆటో రిక్షాకు వ్యాక్సిన్ ఆటో అని పేరు పెట్టారు. ఈ ఆటో రిక్షాను 15 ప్రాంతాలలో టీకాలు వేయమని ప్రజలను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ చర్యను చెన్నై ప్రజలు సానుకూలంగా స్వీకరించారు.

కోవిడ్-19 వాక్సిన్​పై అవగాహన కోసం కొత్త ఐడియా.. సూపర్ కదా

ఆటోలు నగరంలో ఎలాంటి ప్రదేశాల్లో అయినా తిరగడానికి అనుకూలంగా ఉంటాయి. కావున అందరికి వ్యాక్సిన్ పై అవగాహన ఈ విధంగా కల్పించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఈ ఆటో రిక్షా చాలా ఆకర్షణీయంగా కలర్ పుల్ గా తయారుచేసి ప్రజల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తున్నారు.

Image Courtesy: B Gowtham

Most Read Articles

English summary
Chennai Man Designs Auto Rickshaw Depicting Covid-19 Vaccines. Read in Telugu.
Story first published: Tuesday, June 29, 2021, 9:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X