ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

కరోనా లాక్ డౌన్ కాలంలో చాలామంది వారిలో ఉన్న ట్యాలెంట్ బయట పెడుతున్నారు. ఈ నేపథ్యంలో భాగగంగానే కెఎస్‌ఆర్‌టిసి బస్సుల నమూనాను కుందపూర్‌కు చెందిన ప్రశాంత్ తయారు చేశారు. అతను నిర్మించిన కెఎస్‌ఆర్‌టిసి బస్సుల నమూనా చిత్రాలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో చాలా వైరల్ అయ్యాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

కరోనావైరస్ సంక్రమణను నివారించడానికి సామాజిక దూరాన్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ లో చాలామంది ఖాళీగా సమయం గడిపారు. చాలామంది ఇంటి నుండి వర్క్ చేయడం కొనసాగించారు, ఎందుకంటే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అప్సన్ ఉంది. ఈ సమయంలో చాలామంది ఆర్టిస్టులు తమ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శిస్తూ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పాపులర్ అయ్యారు.

ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

అదేవిధంగా ఇప్పుడు కుందపూర్‌కు చెందిన ప్రశాంత్ కూడా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ గా మారాడు. ఆర్టిస్ట్ ప్రశాంత్ అచార్ చేసిన కెఎస్‌ఆర్‌టిసి బస్సుల చిత్రాలు అసలు బస్సులాగా కనిపిస్తాయి. సాధారణ విండోస్, మిర్రర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్, టైర్ మరియు డిజైన్ అసలు కెఎస్‌ఆర్‌టిసి బస్సుల మాదిరిగానే ఉంటాయి.

MOST READ:బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న బిఆర్ శెట్టి లగ్జరీ కార్స్.. చూసారా !

ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

అతడు ఫోమ్ షీట్స్ ఉపయోగించి కెఎస్‌ఆర్‌టిసి బస్ మోడళ్లను తయారు చేస్తారు. అంతే కాకుండా ఈ ఫోమ్ షీట్స్ ఉపయోగించి బస్సు బాడీని కూడా నిర్మించాడు.

ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

బస్సులో హెడ్‌లైట్, ఇండికేటర్, ఫాగ్ లాంప్, గ్రిల్ మరియు ఇండోర్ సీట్లు ఐరన్ తో చాలా బాగా నిర్మించబడ్డాయి. రాత్రి వేళల్లో అత్యంత వేగవంతమైన బస్సు హెడ్‌లైట్ మరియు ఇండోర్ లైట్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

MOST READ:20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో-కార్టింగ్‌ సరదా.. ఎలాగో తెలుసా ?

ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

ప్రశాంత్ తయారుచేసిన బస్సుల చిత్రాలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో వైరల్ అయ్యాయి. కెఎస్‌ఆర్‌టిసి బస్సు నమూనాలతో ఆర్టిస్ట్ ప్రశాంత్ ఆచర్ ఇటీవల శాంతినగర్ లోని ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. వారు తయారుచేసిన బస్సు మోడల్‌ను ఆయన వారికి చూపించారు. బస్ మోడళ్లను చూపాడు. అంతే కాకుండా ఇలాంటి 10 బస్ మోడళ్లను వారు ఆర్డర్ చేశారు.

ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

ప్రశాంత్ ఆచార్ తయారుచేసిన బస్ మోడళ్లను ఉన్నత వర్గాలకు బహుమతిగా కెఎస్‌ఆర్‌టిసి ఉపయోగిస్తుంది. ప్రశాంత్ ఆచార్ తయారుచేసిన ప్రతి బస్ మోడల్‌కు రూ. 8 వేలు ఇస్తామని కెఎస్‌ఆర్‌టిసి తెలిపింది. దీనిని ఆర్టిస్ట్ ప్రశాంత్ అచార్ సంతోషంగా అంగీకరించారు. ఏది ఏమైనా ఆర్టిస్టుల యొక్క కళా సృష్టి నిజంగా చాలా అద్భుతమైనదనే చెప్పాలి.

Image Courtesy: Krishnamohana Thalengala

Source: The Hindu

MOST READ:ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న హోండా హై‌నెస్ సిబి 350 బైక్ ఫస్ట్ లుక్

Most Read Articles

English summary
Udupi artist’s KSTRC bus model rewarded. Read In Kananda. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X