కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 'పెమాఖాండు' ఇటీవల ఒక కొత్త రికార్డ్ సృష్టించారు. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి కూడా వెళ్ళని తన రాష్ట్రంలోని మారుమూల కొండ ప్రాంతానికి ఆయన వెళ్లి అందరి మన్ననలు పొందాడు. పెమాఖాండు దాదాపు రెండురోజుల పాటు 157 కిలోమీటర్లు ప్రయాణించి చాంగ్ లాంగ్ జిల్లాలోని మయన్మార్ సరిహద్దు ప్రాంతం విజయనగర్ చేరుకున్నారు.

 కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పెమాఖండు. అడవులు, కొండలు కొనల మార్గంలో బురద, మట్టిరోడ్డుపై స్వయంగా కారు నడిపారు. దీనికోసం మహీంద్రా కంపెనీ యొక్క ప్రముఖ ఆఫ్ రోడర్ మహీంద్రా థార్ ని ఎంచుకున్నారు. రాత్రివేళ అడవిలో చెట్ల కిందే సెక్యూరిటీతో కలిసి విశ్రాంతి తీసుకున్నారు.

 కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

ఇప్పటి వరకు ఏ సీఎం సాహసం చేసిన పెమాఖాండు ని అందరూ ప్రశంసిస్తున్నారు. సీఎం జర్నీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు మార్గం ద్వారా చాంగ్లాంగ్ జిల్లాలోని విజయనగర్ చేరుకున్న మొదటి సిఎంగా పెమాఖండు.

MOST READ:2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఇప్పుడు కొత్త కలర్‌లో.. అదే ఫీచర్స్.. అదే పర్ఫెమెన్స్

 కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

ఒక సీఎం అనుకుంటే హెలికాప్టర్ ద్వారా ప్రయాణించవచ్చు, కానీ ఆటోమొబైల్ వాహనాలపై ఆసక్తి ఉన్నందున, అతను మహీంద్రా థార్ ద్వారా ప్రయాణించాడు. మహీంద్రా థార్ ఎస్‌యూవీలో ఆయన ప్రయాణిస్తున్న వీడియోను శాంతోనిల్ నాగ్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు.

 కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ఆ ప్రాంతం రహదారులు ఎంత దీనమైన అద్వాన్న స్థితిలో ఉన్నాయో చూడవచ్చు. ఈ రహదారులు చాలా కఠినంగా ఉండటమే కాకుండా అంత బురదతో నిండి ఉంది. ఈ రహదారిపై వెళ్ళడానికి మహీంద్రా థార్ అనువైనది అనే కారణంతో ఈ కారును పెమాఖాండు ఎంచుకున్నారు.

MOST READ:యజమానిని రక్షించడానికి రోడ్డుపై వాహనాన్ని ఆపిన కుక్క.. ఇదేంటనుకుంటున్నారా వీడియో చూడండి

 కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

ఈ ప్రయాణంలో ఆయన చాలా ప్రదేశాలను సందర్శించారు. మియావో నుంచి విజయనగరానికి మరపురాని యాత్ర అని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అక్కడకు వెళ్లిన పెమాఖాండు ప్రజలకు వరాల జల్లు కురిపించారు.

కొనసాగుతున్న రహదారి పనులు మార్చి 2022 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. రహదారి పనులు పూర్తయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.

MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న డార్లింగ్ ప్రభాస్; దీని ధర ఎన్ని కొట్లో తెలుసా?

 కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

తమ ఆఫ్-రోడ్ ట్రిప్ కోసం పెమాఖాండు ఎంచుకున్న మహీంద్రా థార్ ఎస్‌యూవీని గత ఏడాది అక్టోబర్‌లో మహీంద్రా కంపెనీ ఆవిష్కరించింది. లాంచ్ అయినా అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణతో ఎక్కువ అమ్మకాలను చేపట్టింది. కొత్త తరం మహీంద్రా థార్ ఎస్‌యూవీ ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 10 లక్షల నుంచి రూ. 14.15 లక్షల వరకు ఉంది.

Source: Shantonil Nag/YouTube

Most Read Articles

English summary
Arunachal Pradesh Chief Minister Travels In Mahindra Thar SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X