భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; కఠినమైన రూల్స్, వీటికి మాత్రమే మినహాయింపు

భారతదేశంలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఢిల్లీ, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో కట్టుదిట్టమైన చర్యల నడుమ ఒక వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించబడింది.

భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; వీటికి మాత్రమే మినహాయింపు

ఢిల్లీ నగరంలో కరోనా లాక్ డౌన్ ఏప్రిల్ 19 ఉదయం 10 నుండి ఏప్రిల్ 26 ఉదయం 5 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ఢిల్లీలో ప్రబలంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా నివారణలో భాగంగా ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ అమలుచేయడం జరిగిందన్నారు.

భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; వీటికి మాత్రమే మినహాయింపు

కరోనా మహమ్మారిని దాదాపుగా నివారించడానికి లాక్ డౌన్ ప్రధాన మార్గమని ఆయన అన్నారు. అందుకే ప్రస్తుతం వరం రోజులు లాక్ డౌన్ విధించబడింది. ఈ లాక్ డౌన్ సమయంలో అత్యవసర సమయంలో తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.

MOST READ:మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; వీటికి మాత్రమే మినహాయింపు

ఢిల్లీ ప్రభుత్వం నిర్దేశించిన రూల్స్ ప్రకారం కరోనా లాక్ డౌన్ సమయంలో అవసరమైన సర్వీస్ అందించే వారికి మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతి ఉందన్నారు. అత్యవసర సర్వీస్ అందించేవారు తప్పకుండా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది.

భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; వీటికి మాత్రమే మినహాయింపు

ఢిల్లీ ప్రభుత్వం కట్రోనా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దాదాపు అన్ని స్కూల్స్, కాలేజీలు, షాపులు, మాల్స్, సినిమా హాళ్ళు మరియు బహిరంగ ప్రదేశాలు మొత్తం మూసివేయబడ్డాయి. ఢిల్లీ ప్రభుత్వం ఈ వారం లాక్ డౌన్ సమయంలో ఏ నియమాలు వర్తిస్తాయి మరియు ఏ సేవలు ఉచితం అనే దానిపై కూడా మార్గదర్శకాన్ని జారీ చేసింది.

MOST READ:భారత మార్కెట్లో పవర్‌పుల్ ఎస్‌యూవీ; 2021 టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ వీడియో

భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; వీటికి మాత్రమే మినహాయింపు

కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పనిచేసే అధికారులు మరియు సిబ్బంది లాక్ డౌన్ సమయంలో బయటకు వెళ్ళడానికి అనుమతించారు. వారు బయట తిరిగేటప్పుడు కూడా ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా వారి వద్దనే ఉంచుకోవాలి. అప్పుడే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ప్రయాణించవచ్చు అన్నారు.

భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; వీటికి మాత్రమే మినహాయింపు

ఆరోగ్యం, పోలీసులు, హౌస్ కీపింగ్, సివిల్ డిఫెన్స్, ఫైర్ సర్వీస్, నీరు, పారిశుధ్యం, ప్రజా రవాణా మరియు కరోనా సంబంధిత కార్యకలాపాలలో పాల్గొన్న వారు లాక్ డౌన్ సమయంలో కూడా ప్రయాణానికి అనుమతించబడతారు. వీరితో పాటు జడ్జిలు, లాయర్లు మరియు కోర్టులో పనిచేసే వారందరికీ కూడా లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేసే వైద్యులు, నర్సులు, హాస్పిటల్స్, లాబరేటరీస్, మెడికల్ ఆక్సిజన్ ప్రొవైడర్లకు కూడా మినహాయింపు ఉంది.

MOST READ:అదిరిపోయే లుక్‌లో ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్; వివరాలు

భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; వీటికి మాత్రమే మినహాయింపు

కొరోనరీ స్క్రీనింగ్ మరియు టీకా చేయించుకున్న వారికి లాక్డౌన్ నిబంధనలు కూడా మినహాయింపు. ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ ఉద్యోగులకు మినహాయింపు ఉంది. అంతే కాకుండా మీడియాకి కూడా ఈ లాక్ డౌన్ లో అనుమతించబడింది. అయితే వీలైనంత వరకు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; వీటికి మాత్రమే మినహాయింపు

లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉన్న ఫీల్డ్స్:

లాక్ డౌన్ నుంచి కొన్ని అత్యవసర విభాగాలకు మినహాయింపు లభించింది. ఇందులో కూరగాయలు, పండ్లు, పచారీ వస్తువులు, పాలు, మాంసం, ఔషదాలు, ఇంటర్నెట్ నెట్, కేబుల్ సర్వీస్, ఐటి, బ్యాంక్, ఎటిఎంలు ఓపెన్ లో ఉంటాయి. అంతే కాకుండా ఈ-కామర్స్ డెలివరీలు కూడా కొనసాగుతాయి.

MOST READ:ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు భారత్‌లో; ధర & వివరాలు

భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; వీటికి మాత్రమే మినహాయింపు

పెట్రోల్ బంక్, ఎల్‌పిజి, సిఎన్‌జి స్టేషన్లు కూడా ఈ లాక్ డౌన్ సమయంలో అందుబాటులో ఉంటాయి. వాటర్, విద్యుత్ సరఫరా, ఆహార పంపిణీ కొనసాగుతుంది. అయితే హోటల్స్ మరియు రెస్టారెంట్లలో తినడం మాత్రం నిషేధించబడింది.

భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; వీటికి మాత్రమే మినహాయింపు

పబ్లిక్ ట్రాన్స్పోర్ట్:

కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రయాణనైకి సంబంధించి, ఢిల్లీ మెట్రోలో 50% మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించనున్నారు. ప్రభుత్వ బస్సులు, ఆటో మరియు ఇ-రిక్షాలు 50% ప్రయాణీకులతో పనిచేసే అవకాశాన్ని కల్పించడం జరిగింది. వీటితోపాటు క్యాబ్ మరియు టాక్సీ సరీసులు కొనసాగుతాయి. కానీ రోజుకు రెండు ట్రిప్పులు మాత్రమే ఇవి పరిమితం చేయబడ్డాయి. ఢిల్లీలో ప్రజలు ఎలాంటి పాస్ పొందాలనుకున్నా www.delhi.gov.in వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు.

Most Read Articles

English summary
Arvind Kejriwal Announces Lockdown For A Week In Delhi To Curb Covid 19 Cases. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X