రెండు స్కూటర్ల కలయికతో ఏర్పడిన స్కూటర్.. సూపర్ కదా: వీడియో చూడండి

మనం నిత్యజీవితంలో ఎన్నెన్నో వింత సంఘటనలు చూస్తూ ఉంటాము. ఇలాంటి వింత సంఘటనలు మనల్ని ఎంతగానో అబ్బురపరుస్తాయి. ఇలాంటి కొత్త వింతలను సృష్టించేది శాస్త్రవేత్తల్లో లేక ఇతర మేధావులో కాదు, మనలో ఒకటిగా ఉంటున్న సామాన్య ప్రజలే. ఇప్పటికే మనం దేశంలో ఎన్నో సంఘటనలను చూసి ఉంటాము, ఇలాంటి మరో ఆసక్తికరమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రెండు స్కూటర్ల కలయికతో ఏర్పడిన స్కూటర్.. సూపర్ కదా వీడియో చూడండి

నివేదికల ప్రకారం ఒక సామాన్య వ్యక్తి ఒక అరుదైన మరియు చూడగానే ఆశ్చర్యాన్ని కలిగించే ఒక స్కూటర్ తయారుచేసాడు. ఈ స్కూటర్ తయారుచేసిన వ్యక్తి అస్సాం ప్రాంతానికి చెందినట్లుగా తెలిసింది. ఈ స్కూటర్ చూడటానికి చాలా చమత్కారంగా ఉంటుంది. దీనిని వారు స్కూటర్ లిమోలిన్ అని పిలుస్తున్నారు.

రెండు స్కూటర్ల కలయికతో ఏర్పడిన స్కూటర్.. సూపర్ కదా వీడియో చూడండి

అస్సాంకు చెందిన వ్యక్తి నలుగులు ఒకేసారి ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఒక స్కూటర్ తయారు చేసి అందరిని అబ్బురపరుస్తున్నాడు. ఈ స్కూటర్ కి సంబంధించిన ఒక వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ స్కూటర్ ని మీరు ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ వింతగా కనిపించే స్కూటర్ తయారు చేసిన వ్యక్తి ఎడి ఆటోమొబైల్ వర్క్‌షాప్ యజమాని 'అతుల్ దాస్' అని తెలిసింది. కొన్ని వారాల క్రితమే ఈ స్కూటర్‌ను డెవలప్ చేసినట్లు అతడు చెప్పారు. ఈ స్కూటర్ తయారు చేయడానికి అతుల్ దాస్ రెండు స్కూటర్లను కొని వాటిని ఒకదానితో ఒకటి జతకట్టే విధంగా రూపొందించారు.

రెండు స్కూటర్ల కలయికతో ఏర్పడిన స్కూటర్.. సూపర్ కదా వీడియో చూడండి

ఈ స్కూటర్ తయారుచేయడం వల్ల అతని కుటుంబంలోని నలుగురు వ్యక్తులూ ఒకేసారి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఇందులో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. తన కుటుంబం కోసమే ఈ స్కూటర్ ని ప్రత్యేకంగా రూపొందించుకోవడం జరిగింది అని ఆయన అన్నారు.

రెండు స్కూటర్ల కలయికతో ఏర్పడిన స్కూటర్.. సూపర్ కదా వీడియో చూడండి

ఈ స్కూటర్ తయారు చేయడం గురించి, అతుల్ దాస్ మాట్లాడుతూ, ఈ స్కూటర్‌ను తయారు చేయాలనేది నా కల, ఆ కల ఇప్పుడు నిజమయ్యింది. ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అయితే ఇప్పుడు మరొక వాహనం తాయారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు.

తాను మూడేళ్ల క్రితం ఈ పనిని ప్రారంభించినట్లు చెబుతూ ఇప్పటికి నా కల నిజమైంది అని చెప్పారు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ స్కూటర్ తయారు చేయడానికి నాకు 30,000 రూపాయలు ఖర్చు అయ్యాయని అతడు చెప్పాడు. అతను తన భార్య, కుమార్తె మరియు కొడుకుతో కలిసి నగరంలోని అనేక ప్రాంతాలను ఈ స్కూటర్ పై సందర్శించినట్లు కూడా పేర్కొన్నాడు.

రెండు స్కూటర్ల కలయికతో ఏర్పడిన స్కూటర్.. సూపర్ కదా వీడియో చూడండి

సాధారణంగా మోటార్ వాహన చట్టం ప్రకారం, చట్టబద్దం కాని వాహనాలు ప్రజా రహదారులపైన నడపడం చట్ట విరుద్ధం. ఇది కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. చట్టబద్దం కానీ చాలా వాహనాలపైన చర్యలు తీసుకున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అలంటి సంఘటనల గురించి ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం.

ఇలాంటి వాహనాలు పోలీసుల దృష్టిలోపడితే వాటిని తప్పకుండా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి నిర్మాణాత్మక మార్పులు భారతదేశంలో చట్టబద్ధం కాదు. భారత సర్వోన్నత న్యాయస్థానం మరియు మోటారు వాహనాల చట్టం అటువంటి సవరణలను పబ్లిక్ రోడ్లపై నడపడాన్ని ఇప్పటికే నిషేధించాయి.

ఇటువంటి వాహనాలు చాలా మంది వ్యక్తుల ప్రాజెక్టులు కావచ్చు, కానీ వాటిని రేసింగ్ ట్రాక్ లేదా ఫామ్‌హౌస్ వంటి వ్యక్తిగత పరిసరాలలో మాత్రమే ఉపయోగించాలి. పోలీసులు ఇలాంటి వాహనాలపైన చాలా కఠినంగా చర్యలు తీసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వెహికల్ మోడిఫికేషన్ భారతదేశంలో చట్ట విరుద్ధం.

రెండు స్కూటర్ల కలయికతో ఏర్పడిన స్కూటర్.. సూపర్ కదా వీడియో చూడండి

వాహన తయారీ సంస్థలు తయారుచేసే వాహనాలు చాలా సార్లు పరీక్షించి ఆ తరువాత ప్రజలలోకి తీసుకువస్తుంది. కానీ ఈ విధంగా తయారుచేయబడిన వాహనాలు సరిగ్గా నిర్మాణం జరగని పరిస్థిలో రోడ్డులో ఆగిపోయే అవకాశం ఉంటుంది, కావున ఊహకందని ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్ల దేశంలో మోడిఫైడ్ వాహనాలు చట్ట విరుద్ధం.

భారతదేశంలో వెహికల్ మాడిఫికేషన్ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. ఈ సమయంలో ఎక్కువ సంఖ్యలో మాడిఫైడ్ వాహనాలు పుట్టుకొస్తున్నాయి, ఇవన్నీ కూడా మోటార్ వాహన చట్టం పరిధిలో ఉండాలి. ఆలా ఉన్నట్లతేనే అవి ప్రజారహాదారులపైన నడపడానికి అనుమతించబడతాయి. మోటార్ వాహన చట్టానికి విరుద్ధంగా ఉంటే అవి ప్రజా రహదారిపైన నడపడానికి అనుమతించబడవు. మోడిఫైడ్ వాహనదారులు దీనిని తప్పకుండా గుర్తుంచుకోవాలి.లేకుంటే మీరు తప్పకుండా కఠిన చర్యలకు లోనుకావాల్సి ఉంటుంది.

Most Read Articles

English summary
Asam man modified his scooter for accommodate four people details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X