చిల్లరతో స్కూటర్ కొన్న కూరగాయల వ్యాపారి.. ఎక్కడో తెలుసా?
దేశంలో ప్రతిరోజూ అనే వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అవి చూడటానికి కొంత ఆసక్తిగాను మరియు ఆశ్చర్యంగానూ ఉంటాయి. ఇలాంటి మరో సంఘటన ఇటీవల అస్సాంలో వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, అస్సాంకి చెందిన ఒక కూరగాయల వ్యాపారి స్కూటర్ కొనడానికి సిద్ధపడ్డాడు. అయితే ఈ స్కూటర్ కొనడానికి కావాల్సిన మొత్తం డబ్బుని అతడు కేవలం చిల్లర రూపంలో అందించాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఈ కూరగాయల వ్యాపారి సుజుకి బ్రాండ్ యొక్క అవెనిస్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని అనుకున్నాడు. అయితే మొత్తం డబ్బు చిల్లర నాణేల రూపంలో ఒక గోనె సంచిలో నింపుకుని డీలర్‌షిప్ వారికి ఇచ్చాడు. అయితే ఇతడు స్కూటర్ కొనాలనుకున్నాడు, కానీ దానికి కావాల్సిన డబ్బు పొదుపుచేయడానికి పూనుకున్నాడు. దీనికోసం అతడు దీనికోసం పొదుపు చేయడం ప్రారంభించాడు. మొత్తానికి అనుకున్న డబ్బును పొదుపుచేసుకున్నాడు.

చివరకు అతడు పొదుపు చేసుకున్న డబ్బుతో డీలర్‌షిప్ చేరుకున్నాడు. ఆ తర్వాత షోరూమ్ సిబ్బంది ఆ చిల్లర నాణేలను లెక్కించడం ప్రారంభించారు. చివరకు ఆ నాణేలను లెక్కించడానికి ఆ సిబ్బందికి మొత్తం మూడుగంటల సమయం పట్టింది. మొత్తం నాణేలు రూ. 22,000 ఉన్నట్లు తెలిసింది.

మొదటి నాణేలు ఉన్న గోనెసంచిని తీసుకువచ్చి అందులోని చిల్లరను బుట్టల్లోకి పోసి కౌంటింగ్ ప్రారంభించారు. ఈ సంఘటన మొత్తం వీడియోలో కూడా మీరు చూడవచ్చు. అయితే చిల్లర రూ. 22,000 పోగా మిగిలిన మొత్తం ఫైనాన్సింగ్ ద్వారా చెల్లించబడుతుంది.

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇటీవల కాలంలో కొత్త 'సుజుకి అవెనిస్ 125' ను దేశీయ మార్కెట్లో రూ. 86,700 ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. అయితే దీని యొక్క టాప్ వేరియంట్ ధర రూ. రూ. 87,000 (ఎక్స్-షోరూమ్).

సుజుకి అవెనిస్ 125 స్కూటర్ ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే / మెటాలిక్ లష్ గ్రీన్, పెర్ల్ బ్లేజ్ ఆరెంజ్ / గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ / గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, పెర్ల్ మిరాజ్ వైట్ / మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే మరియు మెటాలిక్ ట్రిటాన్ బ్లూ (రేస్ ఎడిషన్) కలర్స్.

కొత్త సుజుకి అవెనిస్ 125 స్కూటర్ బరువు 106 కేజీల వరకు ఉంటుంది. ఈ స్కూటర్ ప్రధానంగా యువ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రారంభించబడింది. ఈ కారణంగా ఇది చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. సుజుకి అవెనిస్ ఈ విభాగంలో Honda Dio, TVS Ntorq మరియు Yamaha RayZR వంటి స్పోర్టీ స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది.

సుజుకి అవెనిస్ 125 స్కూటర్ సుజుకి రైడ్ కనెక్ట్‌తో టర్న్ బై టర్న్ నావిగేషన్‌ను కలిగి ఉంది, ఇది రైడర్‌కు చాలా అద్భుతంగా సహాయపడుతుంది. దీని ఫినిషింగ్ లో, అనేక కలర్ ఆప్సన్ కనిపిస్తాయి. ఇది మొత్తానికి ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

సుజుకి అవెనిస్ అండ్రాయిడ్ మరియు యాపిల్ ఫోన్ యూజర్ల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ యాప్ ను ఆయా ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంచింది. ఈ స్కూటర్‌లో బాడీ మౌంటెడ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, స్పోర్టీ మఫ్లర్ కవర్, అల్లాయ్ వీల్స్, క్యాచీ గ్రాఫిక్స్, సైడ్ స్టాండ్ లాక్, ఇంజన్ కిల్ స్విచ్, డ్యూయల్ లగేజ్ హుక్స్, ఫ్రంట్ రాక్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్త Suzuki Avenis FI (ఫ్యూయెల్ ఇంజెక్షన్) టెక్నాలజీతో కూడిన 125 సిసి ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6750 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 పిఎస్ ల శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎమ్ఎమ్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ స్కూటర్ 5.2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. అదే విధంగా ఇది 21.8 లీటర్ల అండర్-సీట్ బూట్ స్పేస్ కూడా పొందుతుంది.

సుజుకి అవెనిస్ 125 స్కూటర్ దాని కలర్ ఆప్సన్స్ ని బట్టి ధరలు వివిధ రకాలుగా ఉంటుంది. కావున ఇందులో మెటాలిక్ మ్యాట్ ఫైబ్రిన్ గ్రే/మెటాలిక్ లష్ గ్రీన్ కలర్ ధర రూ.86,700, పెరల్ బ్లేజ్ ఆరెంజ్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ కలర్ ధర రూ.86,700 మరియు మెటాలిక్ మ్యాట్ బ్లాక్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ కలర్ ధర రూ.86,700, పెరల్ మిరాజ్ వైట్ / మెటాలిక్ మ్యాట్ ఫైబ్రిన్ గ్రే కలర్ ధర రూ. 86,700 మరియు మెటాలిక్ ట్రిటాన్ బ్లూ (రేస్ ఎడిషన్) ధర రూ. 87,000 (ఎక్స్-షోరూమ్).


Click it and Unblock the Notifications








