Reise Moto రీజ్ మోటో బ్రాండ్ అథ్లెట్‌గా డాకర్ రైడర్ ఆశిష్ రౌరానే.!
ప్రీమియం టూ వీలర్ టైర్ల తయారీదారు రీజ్ మోటో(Reise moto tyres) తమ సంస్థకు బ్రాండ్ అథ్లెట్‌గా డాకర్ రైడర్ ఆశిష్ రౌరానేతో ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్ల పాటు రీజ్ మోటోకు అధికారిక బ్రాండ్ అథ్లెట్‌గా ఆశిష్ రౌరానే(Ashish Raorane) వ్యవహరించనున్నారు. 2021 లో రౌరానే ప్రైవేట్‌గా డాకర్ ర్యాలీలో పాల్గొన్న మొదటి భారతీయ రైడర్‌గా నిలిచారు.
ఆరు నెలల క్రితం నవంబర్ 2022 లో భారత్‌లో మహన్సారియా గ్రూప్(Mahansaria Group) టూ వీలర్ టైర్ల కంపెనీ రీజ్ మోటో (Reise Moto)ను కొత్తగా లాంచ్ చేసింది. భారత్‌లో రైడర్లకు అంతర్జాతీయ అత్యుత్తమ టైర్లను అందించేందుకు యూరోపియన్ టైర్ల సంస్థ మిటాస్‌తో మహన్సారియా గ్రూప్ చేతులు కలిపింది. ఈ మేరకు రీజ్ మోటో.. డాకర్ రైడర్ ఆశిష్ రౌరానేను బ్రాండ్ అథ్లెట్‌గా ఎంచుకుంది.

ఆశిష్ రౌరానే దేశీయంగా మరియు అంతర్జాతీయంగా అతను పాల్గొనే అన్ని మోటార్ స్పోర్ట్ ఈవెంట్‌లలో రీజ్ మోటోకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆశిష్ డాకర్ 2024 కోసం మార్చిలో జరిగిన అబుదాబి డెసర్ట్ ఛాలెంజ్‌కు సంబంధించిన ర్యాలీ 2 విభాగంలో అతను 11 వ స్థానంలో నిలిచారు.
భారత్‌లోని ప్యాషనేట్ రైడింగ్ కమ్యూనిటీకి మద్దతిచ్చే మార్క్‌గా దాని ఇమేజ్‌కి అనుగుణంగా రౌరానే తన బ్రాండ్ అథ్లెట్‌గా సంతకం చేయాలని నిర్ణయించుకున్నట్లు రీజ్ మోటో పేర్కొంది. సంస్థ యొక్క టైర్ల శ్రేణి.. ప్రయాణికులు, ట్రైల్, ట్రాక్ రైడర్ల వరకు అనేక రకాల సేవలందిస్తుంది. రీజ్ మోటో జూన్ 2023 లో TrailR అకాడమీతో కలిసి వచ్చే నెలలో కస్టమర్‌ల కోసం ఈవెంట్‌ల క్యాలెండర్‌ను ప్రారంభించనుంది.

టైర్ మార్క్ రీజ్ మోటోతో మూడేళ్ల పాటు బ్రాండ్ అథ్లెట్‌గా సంతకం చేసిన ఆశిష్ రౌరానే.. ఈ మూడేళ్ల కాలంలో సంస్థకు సంబంధించిన కీలక విషయాలను పంచుకుంటారని సంస్థ వెల్లడించింది. ఈ ఒప్పందం రీజ్ మోటో సంస్థకు దాని తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ శ్రేణిని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని పేర్కొంది. కాంపిటీషన్-స్పెక్ ఆఫ్-రోడ్ టైర్‌లను అభివృద్ధి చేయడంలోనూ రౌరానే తన ఆలోచనలను పంచుకోనున్నారు.
బ్రాండ్ అథ్లెట్‌గా ఆశిష్ రౌరానే సంతకం చేయడంపై స్పందించిన రీజ్ మోటో వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ మహన్సారియా "ఆశిష్ రౌరానే మా బ్రాండ్ అథ్లెట్‌గా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. రేసింగ్ పట్ల అతని అనుభవం, అభిరుచి.. ప్యాషనేట్ రైడింగ్ కమ్యూనిటీకి హై-పెర్ఫార్మెన్స్ టైర్లను డెలివరీ చేయడంలో మాకు దోహదపడతాయి. ప్రీమియం టూ-వీలర్ టైర్ బ్రాండ్‌గా, రైడింగ్ కమ్యూనిటీతో పాలు పంచుకోవడం, వారి రైడింగ్ స్థాయిలను అర్థం చేసుకోవడం మా ఆకాంక్ష" అని పేర్కొన్నారు.
రీజ్ మోటోతో ఒప్పందం పట్ల స్పందించిన ఆశిష్ రౌరానే "నేను రీజ్ మోటోతో అనుబంధం కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాను. అదే విధంగా Dakar 2024 లో మంచి భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నాను. అత్యుత్సాహపూరితమైన రైడింగ్ కమ్యూనిటీకి అధిక పనితీరు కలిగిన టైర్లను అందించడంలో సంస్థ నిబద్ధత అభినందనీయం. రీజ్ మోటో బృందంతో నా సలహాలు, ఆలోచనలు పంచుకునేందుకు ఎదురుచూస్తున్నాను'. అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇటీవలే భారతీయ టైర్ మార్కెట్లోకి ప్రవేశించిన రీజ్ మోటో.. ఔత్సాహికుల్లో బెస్ట్ టైర్ మార్క్‌గా పేరు తెచ్చుకుంది. ఆశిష్ రౌరానే తమ బ్రాండ్ అథ్లెట్‌గా సంతకం చేయడం ద్వారా, సంస్థ ఔత్సాహిక కమ్యూనిటీకి ఫ్లాగ్‌షిప్ టైర్‌లను అందించే అవకాశం ఉంది. డాకర్ 2024లో పాల్గొనడంతో పాటు రీజ్ మోటోకు రౌరానే సంతకం చేయడం వల్ల ఈ బ్రాండ్‌పై ఔత్సాహిక రైడర్లను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








