భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

దేశీయ మార్కెట్లో ప్రముఖ కమర్షియల్ వాహనతయారీకి పేరిన్నిక గన్న అశోక్ లేలాండ్ ఇటీవల భారత సైనిక దళానికి లైట్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అందజేసింది. భారత వైమానిక దళం వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని వైమానిక దళానికి పంపిన వాహనాలన్నీ ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.

భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

అశోక్ లేలాండ్ హిందూజా గ్రూప్ యొక్క ప్రధాన సంస్థ. ఇది ప్రస్తుతం భారతదేశంలో లైట్ వెయిట్ మరియు హెవీ కమర్షియల్ వాహనతోపాటు రక్షణ పరికరాలను కూడా తయారుచేస్తుంది. ఇవి భారత సైనికదళాలకు చాలా ఉపయోగపడతాయి.

భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

అశోక్ లేలాండ్ కంపెనీ యొక్క లైట్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు లాక్హీడ్ మార్టిన్ యొక్క కామన్ వెహికల్ నెక్స్ట్ జనరేషన్ యొక్క దత్తత తీసుకున్న వెర్షన్. ఈ వాహనాల సాంకేతికత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కింద లాక్హీడ్ మార్టిన్ నుండి తీసుకోబడింది. ఈ వాహనాలు పూర్తిగా దేశీయమైనవని మరియు పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేయబడ్డాయి.

MOST READ:రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు

భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

దీని గురించి అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ 'విపిన్ సోంది' మాట్లాడుతూ, సాయుధ దళాలకు ఈ వాహనాలను సరఫరా చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉందన్నారు. మన దేశానికి సేవ చేయడానికి మా నైపుణ్యాన్ని ఉపయోగించుకునే అవకాశం మాకు లభించినందుకు చాలా అందిస్తున్నాము.

భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

ప్రస్తుతం ఈ వాహనాలు సైనిక దళాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, దీనితోపాటు క్లిష్టపరిస్థితుల్లో అవసరమైన సామర్థ్యాన్ని వీటి ద్వారా ఉపయోగించుకోవచ్చు. భారత సాయుధ దళాల విశ్వసనీయ భాగస్వామిగా ఉన్నందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఇలాంటి రక్షణ పరికరాలు, వాహనాల ద్వారా భారత్‌ మరింత బలవంతం కావాలని ఆశిస్తున్నాము.

MOST READ:మీకు తెలుసా.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 లో కనిపించే క్లాసిక్ కార్లు, ఇవే

భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

అశోక్ లేలాండ్ తయారుచేసిన ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అధిక ఆఫ్ రోడ్ సామర్థ్యంతో వస్తాయి. కావున ఇవి ఎటువంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి. అంటే మట్టి, ఇసుక, రాళ్ళతో పాటు నీటిలో వీటిని సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ వాహనాలు 6 మంది సిబ్బందిని, మిషన్ కోసం అవసరమైన పరికరాలను తీసుకెళ్లడానికి తగినంత స్థలాన్ని కలిగి ఉంటాయి.

భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

ఈ వాహనాలు లోపల కూర్చున్న సైనికులను ఎదురుదాడి నుండి రక్షించేవిధంగా తయారుచేయబడి ఉంటాయని అశోక్ లేలాండ్ తెలిపింది. ఈ వాహనాలు కేవలం బుల్లెట్లను మాత్రమే కాదు గ్రెనేడ్ దాడిని కూడా తట్టుకోగలదు. అన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, ఇది ఏ పరిస్థితిలోనైనా సైనికులకు రక్షణ కవచం లాగా ఉపయోగపడుతుంది.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

భారత సైనికదళాలకు ఈ వాహనాలు చాలా అవసరం. కావున ఇవి దేశ రక్షణ వ్యవస్థలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అశోక్ లేలాండ్ తయారుచేసిన ఈ బులెట్ ప్రూఫ్ వాహనాలు చాలా కట్టుదిట్టమైన భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయి. కావున యుద్ధ సమయంలో చాలా ఉపయోగపడతాయి.

Most Read Articles

English summary
Ashok Leyland Delivers Light Bulletproof Vehicles To Indian Air Force. Read in Telugu.
Story first published: Saturday, April 17, 2021, 12:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X