బర్త్‌డే గిఫ్ట్‌గా జర్మన్ బ్రాండ్ కారు సొంతం చేసుకున్న జూనియర్ సమంత 'ఆషు రెడ్డి'.. పూర్తి వివరాలు
సోషల్ మీడియా యూజర్లకు మరియు బుల్లితెర ప్రేక్షకులకు 'జూనియర్ సమంత' గా పేమస్ అయిన 'ఆషు రెడ్డి' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బిగ్ బాస్ షోతో అమాంతం పాలోయింగ్ పెంచేసుకుంది. అంతే కాకుండా 'చల్ మోహన్ రంగ' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షలకులకు మరింత దగ్గరైపోయింది.
Recommended Video
అయితే సెప్టెంబర్ 15 'ఆషు రెడ్డి' బర్తడే సందర్భంగా తన తండ్రి ఒక ఖరీదైన కారుని గిఫ్ట్‌గా అందించారు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఎప్పటికప్పుడు కుర్రకారుని ఫిదా చేసే మన జూనియర్ సమంత ఇప్పుడు ఒక లగ్జరీ కారుకి ఓనర్ అయిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో 'ఆషు రెడ్డి' తన తండ్రితో కలిసి కారుని తీసుకోవడం కూడా చూడవచ్చు.

'ఆషు రెడ్డి' సొంతం చేసుకున్న ఈ ఖరీదైన కారు జర్మన్ బ్రాండ్ కి చెందిన 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) కంపెనీ యొక్క జిఎల్‌సి కూపే అయిన 'సి300డి' (C300D) అని తెలిసింది. దీని ధర సుమారు రూ. 70 లక్షల వరకు ఉంటుంది. ఇంత ఖరీదైన లగ్జరీ కారు సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి అని 'అషు రెడ్డి' తెలిపింది. మొత్తానికి మెర్సిడెస్ బెంజ్ కారుని 'అషు రెడ్డి' తన గ్యారేజిలో చేర్చుకుంది.

అంతే కాకుండా ఆషురెడ్డి ఈ సంవత్సరం ఖరీదైన కారుని పొందటం కూడా ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆమె తన తండ్రితో కలిసి మెర్సిడెస్ బెంజ్ కారుని ముందు దిగిన ఫోటోలను సోషల్ కూడా ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో 'క్షమించు అమ్మ.. షాకవ్వకు.. ఇది నాన్న గిఫ్ట్' అంటూ ఫొటోలకు క్యాప్షన్ కూడా ఇచ్చేసింది.

ఈ పోస్ట్ కి గాను యాంకర్ శిల్పాచక్రవర్తి కంగ్రాట్స్ బేబీ అంటూ కామెంట్ చేసింది. అదే సమయంలో అరియానా గ్లోరీ కూడా 'అదే చేతులతో కారుని ఒక రౌండ్ ఇస్తవా నేను డ్రైవ్ చేస్తా' అంటూ కామెంట్ చేసింది.

ఇక మెర్సిడెస్ బెంజ్ సి300డి విషయానికి వస్తే, ఇది దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న జర్మన్ లగ్జరీ కార్లలో ఒకటి. కావున ఇది ఆధునిక డిజైన్ మరియు పరికరాలను పొందుతుంది. ఈ ఆధునిక లగ్జరీ కారులో ఎల్ఈడీ హెడ్లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఎల్ఈడి డిఆర్ఎల్ మరియు ఎల్ఈడీ ఫాగ్ లైట్ వంటివి ఉంటాయి.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 11.9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా ఇందులో సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కావున ఇది వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇందులో 1993 సిసి 4 సిలిండర్ ఇన్లైన్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది ఇది, 4,200 ఆర్‌పిఎమ్ వద్ద 261 బిహెచ్‌పి పవర్ మరియు 1,800 ఆర్‌పిఎమ్ వద్ద 550 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఒక 20.3 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
దేశీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో ఒకటి 'మెర్సిడెస్ బెంజ్ సి300డి'. అయితే సాధారణంగా ఇది వరకు ఇలాంటి ఖరీదైన కార్లను టాప్ సెలబ్రెటీలు కొనుగోలు చేసినట్లు తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ మరియు జూనియర్ సమంత అయిన ఆషు రెడ్డి కూడా సొంతం చేసుకుంది. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని విషయాలు మాత్రమే కాకుండా కొత్త బైకులు మరియు కార్లను గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








