ఆసియాలోనే అత్యంత పొడవైన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌; మనదేశంలో ప్రారంభం

భారతదేశంలో తయారైన కార్లను పరీక్షించేందుకు ఇకపై మనం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆసియాలోనే అత్యంత పొడవైన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌ మనదేశంలోనే ప్రారంభించబడింది. ఇండోర్‌లోని పితాంపూర్‌లో ఏర్పాటు చేసిన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌ను భారీ పరిశ్రమల మంత్రి ప్రకాష్ జవదేకర్ వర్చువల్‌గా ప్రారంభించారు.

ఆసియాలోనే అత్యంత పొడవైన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌; మనదేశంలో ప్రారంభం

ఈ టెస్ట్ ట్రాక్‌ను నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ (NATRAX) అభివృద్ధి చేసింది. ఇకపై మనదేశంలో తయారయ్యే అన్ని రకాల వాహనాలను పరీక్షించేందుకు ఈ టెస్ట్ ట్రాక్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ హై స్పీడ్ టెస్ట్ ట్రాక్‌లో అన్ని రకాల వాహనాలను పరీక్షించడానికి అనువైన ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించబడ్డాయి.

ఆసియాలోనే అత్యంత పొడవైన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌; మనదేశంలో ప్రారంభం

కొత్త హై-స్పీడ్ టెస్ట్ ట్రాక్ 11.3 కిలోమీటర్ల పొడవు మరియు 16 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లను కలిగి ఉంటుంది. ఈ ట్రాక్ ఆసియాలో అత్యంత పొడవైన ట్రాక్ మరియు ప్రపంచంలో కెల్లా ఐదవ అతిపొడవై ట్రాక్. భారతదేశంలోని ఆటోమొబైల్ తయారీ కంపెనీలు ఉత్పత్తి చేసే వాహనాలను పరీక్షించడానికి అన్ని సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ టెస్ట్ ట్రాక్ నిర్మించబడింది.

ఆసియాలోనే అత్యంత పొడవైన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌; మనదేశంలో ప్రారంభం

ఈ టెస్ట్ ట్రాక్ ప్రారంభంతో, ఇప్పుడు భారత ఆటోమొబైల్ కంపెనీలు, మనదేశంలో తయారు చేసిన వాహనాలకు ఇక్కడే ప్రపంచ స్థాయి పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ టెస్ట్ ట్రాక్‌లో గంటకు 250 కిలోమీటర్ల తటస్థ వేగంతో మరియు కర్బ్ ప్యాచ్‌లో గంటకు 375 కిలోమీటర్ల వేగంతో వాహనాలను పరీక్షించవచ్చు.

ఆసియాలోనే అత్యంత పొడవైన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌; మనదేశంలో ప్రారంభం

స్ట్రెయిట్ ట్రాక్‌లో గరిష్ట వేగ పరిమితి లేదు. ట్రాక్ సున్నా శాతం రేఖాంశ వాలును కలిగి ఉంటుది, ఇది వాహనాల ఖచ్చితమైన పరీక్షకు అనుకూలంగా ఉంటుంది. ఈ హై స్పీడ్ టెస్ట్ ట్రాక్‌లో వాహన గరిష్ట వేగం, త్వరణం (యాక్సిలరేషన్), ఇంధన వినియోగం, హై స్పీడ్ హ్యాండ్లింగ్, కంట్రోల్స్ మరియు కోస్ట్ డౌన్ వంటి పరీక్షలు చేయవచ్చు.

ఆసియాలోనే అత్యంత పొడవైన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌; మనదేశంలో ప్రారంభం

నాట్రాక్స్ హై స్పీడ్ టెస్ట్ ట్రాక్ అన్ని రకాల వాహనాల టెస్టింగ్ కోసం ఓపెన్ చేయబడింది. కొత్త వాహన లాంచ్‌లు, సూపర్ కార్ రేసింగ్ మరియు డీలర్ ఈవెంట్‌ల కోసం ఈ ట్రాక్ అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ కంపెనీలు ఈ నాట్రాక్స్ టెస్ట్ ట్రాక్ గురించి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఆసియాలోనే అత్యంత పొడవైన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌; మనదేశంలో ప్రారంభం

నాట్రాక్స్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్, ఎఫ్‌సిఏ, రెనో, ప్యుజో మరియు లంబోర్ఘిని సహా పలు ఇత ఆటోమొబైల్ తయారీదారులు ఈ హై స్పీడ్ టెస్ట్ ట్రాక్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం పట్ల తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.

ఆసియాలోనే అత్యంత పొడవైన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌; మనదేశంలో ప్రారంభం

ఈ ట్రాక్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ.. ఈ ట్రాక్ నిర్మాణం యొక్క ఉద్దేశ్యం భారతీయ కంపెనీలను వారి అవసరాలకు స్వావలంబనగా మార్చడమేనని, ఇంతకుముందు భారతీయ తయారీదారులు తమ వాహనాలను పరీక్షించడానికి యూరప్ మరియు అమెరికా వంటి దేశాలపై ఆధారపడవలసి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేదని, కంపెనీలు మన దేశంలోనే తమ వాహనాలను పరీక్షించుకోవచ్చని, ఫలితంగా కొత్త వాహనాలను అభివృద్ధి చేయడంలో సమయం కూడా ఆదా అవుతుందని అన్నారు.

ఆసియాలోనే అత్యంత పొడవైన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌; మనదేశంలో ప్రారంభం

నాట్రాక్స్ ట్రాక్ మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పితాంపూర్ వద్ద ఉంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన ఈ ట్రాక్‌ని 3 వేల ఎకరాల భూమిని అభివృద్ధి చేసి, నిర్మించారు.

Most Read Articles

English summary
Asia's Largest High Speed Automobile Testing Track Inaugurated In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X