ఆసియా రిచెస్ట్ మ్యాన్ అత్యంత ఖరీదైన కారును చూస్తే మతిపోవాల్సిందే..! దీని రేట్ ఎంతో తెలుసా..?

ఆసియాలో అత్యంత ధనవంతుడు అయినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గురించి తెలియని వారు ఉండరు. దాదాపు అన్ని రంగాల్లో కూడా వ్యాపారాలు కలిగి విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచిన ఆయన సంపద దాదాపు 100 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. ఇంత ధనవంతుడు అయినటువంటి ముఖేష్ అంబానీ లైఫ్‌స్టైల్ గురించి అందరికి తెలిసిందే. ముంబైలో ఆయన ఉంటున్న ఇంటి విలువే దాదాపు రూ.200 కోట్ల వరకు ఉంటుంది. ఇది ఒక భూలోక స్వర్గంగా ఉంటుంది. ప్రపంచంలోనే ఖరీదైన ఇళ్ల జాబితాలో ఇది కూడా ఉంది. దీనిలో అన్ని లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి. ముఖ్యంగా కార్ల గ్యారేజీ చాలా పెద్దదిగా ఉంటుంది. ముఖేష్ అంబానీ వద్ద కోట్ల విలువ చేసే ప్రపంచంలోనే అత్యంత తోపు కార్లు ఉన్నాయి. సాధారణంగా ఆయన సాదాసీదా మనిషి లాగా కనిపిస్తుంటారు. కానీ కార్లు అంటే ఆయనకు చాలా ఇష్టం.

అంబానీ వద్ద ఎన్నో కార్లు ఉన్నాయి. ఇవన్నీ టాప్ బ్రాండ్‌లకు చెందినవే. ఇదిలా ఉంటే ఇటీవల ఆయన తన గ్యారేజీకి కొత్త కారును చేర్చారు. ప్రపంచంలో టాప్ బ్రాండ్ అయినటువంటి రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. ఈ మోడల్ పేరు స్పెక్టర్ EV. డజన్ల కొద్ది కార్లను కలిగిన అంబానీ ఇప్పుడు రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీతో రోడ్లపై తిరుగుతున్నారు. ఇటీవల ఈ కారు ముంబై రోడ్లపై కనిపించింది.

Mukesh Ambani Rolls Royce Spectre Ev

దీనికి సంబంధించిన ఫోటోను ఎవరో క్లిక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫోటోను చూసినట్లయితే కారు వైట్ కలర్‌లో ఉంది. అలాగే ఇది పెట్రోల్, డీజిల్ కార్ కాదు. పూర్తి ఎలక్ట్రిక్ వేరియంట్ అని తెలుస్తుంది. నెంబర్‌ ప్లేట్‌ను గమనించినట్లయితే MH అని మొదలై 0001 ఉంది. ఇది VIP నెంబర్. ఇలాంటి నెంబర్ కావాలంటే ఎక్కువ ఖర్చు పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఆయన వద్ద ఉన్న కార్లకు VIP నంబర్‌లే ఉంటాయి. అంతకుముందు 2022లో కల్లినన్ (Cullinan) కారును కొనుగోలు చేయగా, దీనికి MH 1 EB 1 ఫ్యాన్సీ నంబర్‌‌‌ను తీసుకున్నారు. దీనికి కొన్ని లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండోసారి కొనుగోలు చేసిన కల్లినన్ కారుకు MH 1 DG 1 నెంబర్‌ను తీసుకున్నారు.మరోవైపు రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీ క్లాసిక్ డిజైన్‌తో వచ్చింది.

Mukesh Ambani Cars

ఈ లగ్జరీ కారు రోడ్లపై ఎలాంటి సౌండ్ చేయకుండా సైలెంట్‌గా ప్రయాణిస్తుంది. స్పెక్టర్ EVని కంపెనీ ఇండియా మార్కెట్లో జనవరి 2024లో విడుదల చేసింది. దీని ధర రూ.7.5 కోట్లు (ఎక్స్ షోరూమ్)కు అందుబాటులో ఉంది. ఇండియాలో అమ్మకానికి ఉన్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారుగా ఇది నిలుస్తుంది. ఈ లగ్జరీ కారును మొత్తం అల్యూమినియం స్పేస్‌ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారు చేశారు.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీ 102kWh బ్యాటరీ ఆప్షన్‌తో వచ్చింది. ఇది సింగిల్ ఛార్జింగ్‌తో 520 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని చేరుకుంటుంది. మోటార్ దాదాపు 585hp పవర్, 900 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. దీనిలో అందించిన బ్యాటరీని 50 kW DC ఛార్జర్‌ ఉపయోగించి 95 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు.

అదే 200 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని వాడినట్లయితే ఇంతకంటే ఛార్జ్ అవుతుంది. దీంతో కేవలం 34 నిమిషాల్లో బ్యాటరీ 10-80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇదిలా ఉంటే, ముఖేష్ అంబానీ వద్ద ఇప్పటికే అధునాతన కార్లు ఉన్నాయి. రోల్స్ రాయిస్ ఫాంటమ్ EWB, లంబోర్ఘిని ఉరుస్,బెంట్లీ బెంటాయిగా, మెర్సిడెస్-మేబ్యాక్ S680 గార్డ్, ఫెరారీ SF90, మెర్సిడెస్-బెంజిగ్ వంటి ఇతర కార్లు ఆయన గ్యారేజీలో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 17, 2024, 12:05 [IST]
English summary
Asia richest man mukesh ambani buys new rolls royce spectre ev
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+