బెంజ్ కార్ల కోసం వేచి ఉండడు.... ఆటో రిక్షాల్లో కూడా ప్రయాణిస్తాడు: అజీమ్‌ ప్రేమ్‌జీ

By Anil

అత్యంత డబ్బున్న ధనవంతులు ఎలా ఉంటారు. అంటే ఇప్పుడు మన ఇండియన్స్ విజయ్ మాల్యాను గుర్తు చేసుకుంటారు. అతని వద్ద డబ్బున్న కాలంలో అతను బ్రతికిన తీరే వేరు. కాని ఇలాంటి వ్యక్తులకు భిన్నంగా ఎంత ఎదిగినప్పటికీ ఒదిగి ఉండే డబ్బునోళ్లు కూడా ఉన్నారు. అందులో దేశీయ అతి పెద్ద పారిశ్రామిక మరియు వ్యాపారవేత్త విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ ఒకరు.

దేశీయంగా ఉన్న కోటీశ్వరుల్లో ముఖేష్ అంబానీ ఒకడు ఇతని వద్ద సుమారుగా 130 కార్లు ఉన్నాయి. ఇలా ఇండియాలో అత్యంత ధనవంతుల జాబితాలో టాప్-10 లో ఉన్న అజీమ్‌ప్రేమ్‌జీ ఇందకు పూర్తిగా భిన్నం. దేశీయంగా సాఫ్ట్‌ వేర్ రంగాన్ని అభివృద్ది బాట పట్టించిన వారిలో ప్రేమ్‌జీ ఒకరు. సంపాదించిన సొమ్ములో ఎంతో కొంతం దానం చెయ్యంది ఉండలేని ప్రేమ్‌జీ తన వ్యక్తిగత జీవనం కోసం ఎటువంటి కార్లను కలిగి ఉన్నాడో క్రింది కథనంలో చూద్దాం రండి.

ఫోర్డ్ ఎస్కార్ట్

ఫోర్డ్ ఎస్కార్ట్

అజీమ్‌ప్రేమ్‌జీ మొదటి కారు ఫోర్డ్‌కు చెందిన ఎస్కార్ట్. దీనిని ప్రే‌మ్‌జీ తొమ్మిదేళ్ల పాటు వినియోగంచాడు.

టయోటా కర్రోలా

టయోటా కర్రోలా

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత అమ్మకులు సాధిస్తున్న ఏకైక కారు టయోటా కర్రోలా. దీనిని సుమారుగా 10 ఏళ్ల పాటు ప్రేమ్‌జీ స్వతహాగా డ్రైవ్‌చేసుకునే వాడు.

సెకండ్ హ్యాండ్‌ కారు

సెకండ్ హ్యాండ్‌ కారు

అజీమ్ ప్రేమ్‌జీ పెరిగే వయస్సుతో పాటు తన కార్లను కూడా మార్చుకుంటూ వచ్చాడు. తన సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి అమ్మకానికి పెట్టిన పాత మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కారును కొని తన టయోటా స్థానంలో ఎంచుకున్నాడు.

తక్కువ స్థాయి తరగతిలో ప్రయాణం

తక్కువ స్థాయి తరగతిలో ప్రయాణం

విమానాలలో వసతులను బట్టి రకరకాల తరగతులుగా విభజిస్తారు. కొన్ని కోట్ల రుపాయల సంపదను కలిగి ఉన్న అజీమ్‌ ప్రేమ్‌జీ ఎప్పుడు కూడా సాధారణ తరగతిలో ప్రయాణం చేసేవాడు.

ప్రజారవాణాలో భాగంగా

ప్రజారవాణాలో భాగంగా

సమయాన్ని ఖచ్చితంగా పాటించే అజీమ్‌ ప్రేమ్‌జీ ఎప్పుడు కూడా తన కారు కోసం వేచి చూసేవాడు కాదు. ప్రజారవాణాలో వినియోగించే సిటి బస్సులలో మరియు ఆటో రిక్షాలలో ప్రయాణించడం ఇతనికి షరామామూలే.

 ఇలాంటి వాటికి ప్రేమ్‌‌జీ చాలా దూరం

ఇలాంటి వాటికి ప్రేమ్‌‌జీ చాలా దూరం

ఇండియాలో డబ్బున్న వారు చేసే ప్రతి అడ్డదిడ్డమైన పనికీ వంతుపాడుతారు మన నాయకులు. సామాన్యులకు ఏ మాత్రం విలువ ఇవ్వరు. దేశీయంగా ఉన్న డబ్బున్న బడాయిల్లో మాల్యా ఒకరు. మొబైల్ ఆధారిత ట్యాక్సీ సేవలు అందించే సంస్థ ఉబెర్ మీద తీవ్ర విమర్శలు చేశాడు. అయితే ఇలాంటి వాటికి ప్రేమ్‌జీ చాలా దూరం.

ఎప్పుడూ వ్యక్తిగత విమానాల్లోనే

ఎప్పుడూ వ్యక్తిగత విమానాల్లోనే

కొన్ని వేల కోట్లను ఎగ్గొట్టి విదేశాల్లో తల దాచుకున్న మాల్యా ఇండియాలో ఉన్నన్ని రోజులు ఎక్కడికి వెళ్లాలన్నా వ్యక్తిగత విమానాలనే వినియోగించేవాడు. ఇదంతా ఒకప్పుడు.

 లక్షల కోట్లకు అధిపతి కాని ఆటోల్లో ప్రయాణిస్తాడు

కాని నేడు కోటానుకోట్ల రుపాయిలు బకాయిలు పడి అన్నింటిని కోల్పోయాడు. తాజాగా విజయ్ మాల్యా వక్తిగత విమానానికి వేలంకూడా నిర్వహించారు.

మాల్యా టైం బాగున్నపుడు

మాల్యా టైం బాగున్నపుడు

మాల్యా టైం సరిలేక ఇప్పుడు ఇలా అయిపోయాడు కాని. ఒకానొక కాలంలో విజయ్ మాల్యా తన యాచ్‌ ద్వారా సముద్రాలన్నింటిని కలియతిరిగేవాడు. 76 మంది ప్రయాణించే వీలున్న దీనిలో అన్ని కలాపాలు నిర్వహించడానికి 30 మంది వరకు సిబ్బంది అవసరమయ్యేది.

ప్రతి రోజు బెంట్లీ కారులో ప్రయాణం

ప్రతి రోజు బెంట్లీ కారులో ప్రయాణం

ఇండియన్ పీపుల్ లీగ్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు జట్టును స్పాన్సర్ చేసిన సమయంలో ప్రతి రోజు బెంగళూరు రోడ్ల మీద ఎరుపు రంగులో ఉన్న బెంట్లీ కాంటినెన్షియల్ కారులో వెళ్లే వాడు. 6.0-లీటర్ల సామర్థ్యం ఉన్న ఈ కారు ధర సుమారుగా 3.1 కోట్లుగా ఉంది.

 లక్షల కోట్లకు అధిపతి కాని ఆటోల్లో ప్రయాణిస్తాడు

రుపాయిలను నీళ్లలా ఖర్చు పెట్టే మాల్యా తన మొత్తం జీవితంలో అత్భుతమైన కార్లను ఎంచుకున్నాడు. ప్రతి కాలానికి తగ్గ ప్రత్యేకమైన అన్ని కార్లను కొనుగోలు చేశాడు. పురాతణ క్లాసిక్ కార్ల నుండి జాగ్నార్ ఇ-టైపు సిరీస్ 3 కన్వర్టిబుల్ కారు వరకు ఎన్నో కార్లు ఇతని గ్యారేజ్‌లో ఉన్నాయి.

 లక్షల కోట్లకు అధిపతి కాని ఆటోల్లో ప్రయాణిస్తాడు

బీరు, బారు, కారు అనే తీరుగా వ్యవహరించిన విజయ్ మాల్యా కార్ల సామ్రాజ్యం చూసొద్దాం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
The Car Collection Of Azim Premji - India's Under The Radar Billionaire
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X