బరాక్ ఒబామాతో బంతి ఆడి హోండా అసిమో రోబో
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఓ రోబో బంతాట ఆడింది. జపనీస్ కంపెనీ హోండా తయారు చేసిన అత్యంత అధునాతమైన హ్యూమనాయిడ్ రోబోట్ 'అసిమో' (ASIMO) ఒబామాతో కలిసి సాకర్ ఆడింది.
ఏప్రిల్ 24, 2014వ తేదీన జపాన్ దేశాన్ని సందర్శించిన బరాక్ ఒబామాను హోండా ప్రతినిధులు సంప్రదించారు. ఈ సందర్భంగా వారు తమ రోబోట్‌ను, దాని తెలివితేటలను ఆయనకు ప్రదర్శించారు. ఈ హోండా అసినో రోబోట్ మన రజనీకాంత్ చిత్రంలోని రోబో మాదిరిగానే అనేక విన్యాసాలు చేయగలదు. మానవుని వలే హావభావాలు, రోబోలోని తెలివితేటలు ఈ అసినో సొంతం.

బరాక్ ఒబామాను చూసిన హోండా అసినో అతని ఆంగ్లంలో పలకరించింది. 'మిస్టర్ ప్రెసిడెంట్, నా పేరు అసిమో, నేనొక హ్యుమనాయిడ్ రోబోట్‌ని. మిమ్మల్ని కలుసుకోవటం నాకెంతో సంతోషంగా ఉందంటూ' ఈ రోబో ఒబామాను పలకరించింది. ఆ తర్వాత అసినో తన విన్యాసాలను, నైపుణ్యాలను ప్రెసిడెంట్ ముందు ప్రదర్శించింది. ఆ తర్వాత ఓ సాకర్ బంతిని బ్లాక్ చేయమని ప్రెసిడెంట్ వైపు తన్నింది.
హోండా అసిమో రోబోట్‌కు పరిగెత్తటం, గంతులేయటం, ఫుట్‌బాల్ ఆడటం, డ్యాన్స్ చేయటం వంటి అనేక కళలు వచ్చు. 'తాను ఏదో ఒక విషయం గురించి ప్రతిరోజు శిక్షణ పొందుతూ ఉంటానని, ఇలా చేయటం భవిష్యత్తులో ప్రజలకు తమ ఇళ్లల్లో సాయం చేయగలన'ని హోండా అసిమో ప్రెసిడెంట్ ఒబామాకు వివరించింది. మరి ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/ag2vk6coBpI" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








