ASKA A5 ఎగిరే కారు.. ప్రపంచంలోనే లైసెన్స్ పొందిన తొలి కారుగా రికార్డు..!!
విమానాలు, హెలికాప్టర్లు జాబితాలో ఇక నుంచి కార్లు కూడా ఉండనున్నాయి. అవును త్వరలో ఎగిరే కార్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఎగిరే కార్లు గురించి వింటున్నాం. అతి త్వరలోనే ఈ కల నెరవేరనుంది. అయితే ప్రస్తుతానికి కొన్ని సంస్థలకు మాత్రమే ఇందుకు అనుమతి లభించినట్లు తెలుస్తోంది. టెస్ట్ డ్రైవ్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.
ASKA A5 ఎగిరే కారును పబ్లిక్ రోడ్లపై నడిపేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆమోదం పొందింది. మరియి ఎయిర్ వర్త్‌నెస్ సర్టిఫికేట్‌ను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎగిరే కారు పబ్లిక్ రోడ్లపై నడపడానికి లైసెన్స్ పొందిన ప్రపంచంలోనే మొదటి కారుగా గుర్తింపు పొందింది. వాణిజ్య విక్రయాలపై ప్రస్తుతం ఎటువంటి అనుమతులు రాలేదని తెలుస్తోంది. ఈ ఎగిరే కారుకు పరీక్షలు, అభివృద్ధి కోసం మాత్రమే అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది.

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్ (DMV) ద్వారా ASKA A5 ఏరో డైనమిక్, 4 సీటర్ డ్రైవ్ మరియు ప్లై eVTOL ( వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ ) అనుమతులు పొందింది. DMV నంబర్ ప్లేట్ ద్వారా సిలికాన్ వ్యాలీ చుట్టు 480 కిలోమీటర్లకు పైగా రహదారి పరీక్షలు ఇప్పటికే విజయవంతంగా పరీక్షించినట్లు సంస్థ తెలిపింది.
కాలిఫోర్నియాలోని స్థానిక రోడ్లపై డ్రైవింగ్ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసినట్లు సంస్థ తెలిపింది. పబ్లిక్ రోడ్లపై పరీక్షలు పూర్తిచేసిన తొలి కారుగా రికార్డు నమోదు చేసిందని న్యూ అట్లాస్ సంస్థ ప్రెసిడెంట్, COO మకి కప్లిన్స్కీ వెల్లడించారు. ఆన్ రోడ్ భద్రతకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే 60 కంటే ఎక్కువ ప్రీ ఆర్డర్‌ల ద్వారా సంస్థ ఇప్పటికే $50 మిలియన్ల డిపాజిట్లు పొందినట్లు సంస్థ చెప్పారు. ఆ సంస్థ వెబ్‌సైట్ ఆధారంగా సర్టిఫికేషన్ ఆమోదాలకు అనుగుణంగా 2026 సంవత్సరాన్ని వాణిజ్య అవసరాల కోసం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
పబ్లిక్ రోడ్లపై డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు SUV క్రూయిజ్‌ల మారుతుంది. వాస్తవానికి SUV లాంటి డ్రైవింగ్ పొజిషన్‌ను కూడా అందిస్తుందని సంస్థ చెబుతోంది. డ్రైవర్‌కు మెరుగైన విజిబిలిటీ కలిగి ఉండేందుకు అనుమతిస్తుంది. మరియు షార్ట్ టేకాఫ్, ల్యాండింగ్ కోసం మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ప్రపంచంలో కొన్ని ఎగిరే కార్ల సంస్థలు ఇప్పటికే కొన్ని రకాల పరీక్షలు నిర్వహించాయి. త్వరలో అవి కూడా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది.

ఇటీవలే చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎక్స్‌పెంగ్ తన ఎలక్ట్రిక్ ఎగిరే కారు తొలి పబ్లిక్ టెస్ట్‌ను సమర్థవంతంగా పూర్తిచేసింది. ప్రపంచంలోని అనేక ప్రముఖ సంస్థలు, స్టార్టప్‌లు ప్రస్తుతం ఎగిరే కార్లను అభివృద్ధి చేస్తున్నాయి. 4-5 సంవత్సరాల్లో ఎగిరే కార్లు రోడ్లపైకి రానున్నాయి. అయితే వీటి ధర మాత్రం భారీగా ఉండే అవకాశం ఉంది. సాధారణ కార్ల ధర కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








