ADAS దుర్వినియోగం.. కదులుతున్న కారు కిటికీ వద్ద నిల్చొని డేంజరస్ స్టంట్లు... వీడియో వైరల్..!!
మహీంద్రా సంస్థ 2021 ఆగస్టులో XUV700 SUVని ADAS ఫీచర్‌తో (అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) విడుదల చేసింది. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈ సేఫ్టీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్‌ను అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.
టెక్నాలజీ దుర్వినియోగం : తాజాగా అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. ADAS టెక్నాలజీని కొందరు విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సాంకేతికత ద్వారా కారును డ్రైవింగ్ చేస్తూ.. ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోను నిఖిల్‌రానా తన యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో అస్సాంలోని గౌహతికి చెందినదని చెప్పడం వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియోలో ఉన్న విద్యార్థులు ఓ యూనివర్సిటీకి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా తెలుస్తోంది. ఓ ప్లైఓవర్‌పై ఈ ప్రమాదకర విన్యాసాలు చేశారు.
ఈ వీడియో ఆధారంగా 18-19 సంవత్సరాల వయసున్న విద్యార్థి ADAS టెక్నాలజీ ద్వారా కారును డ్రైవింగ్ చేస్తున్నారు. అంతలో కారు విండో నుంచి బయటవైపునకు నిల్చొని ప్రమాదక విన్యాసాలు చేశారు. కారు ఫ్రంట్ సీట్‌లో ఉన్న మరో వ్యక్తి ఈ వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అతని మరొక చేయి స్టీరింగ్ వీల్‌పై ఉండడాన్ని గమనించవచ్చు. వీరితోపాటు మరికొంత మంది విద్యార్థులు XUV700 సన్‌రూఫ్ ద్వారా నిల్చోవడాన్ని వీడియోలో గమనించవచ్చు.

అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి వస్తే : సోషల్ మీడియా క్రేజీ సహా ఇతర కారణాలతో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ఏదైనా అకస్మాత్తుగా ఈ వాహనానికి బ్రేక్ వేయాల్సి వస్తే కిటికీ వద్ద నిల్చొన్న వ్యక్తి విరిసివేయబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలపై అవగాహన ఉండే అవకాశం ఉన్న విద్యార్థులు కూడా డేంజరస్ స్టంట్లు చేస్తున్నారు.
ADAS తో అనేక సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీపింగ్ అసిస్టెన్స్, కొలిజన్ వార్నింగ్ సిస్టమ్ వంటి కీలక ఫీచర్లు ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుతాయి. అయితే ఈ ఫీచర్లను అదనుగా భావించి కొందరు యధేచ్చగా వీటి దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.

అయితే ఇలాంటి ప్రమాదకర విన్యాసాల కారణంగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరితో పాటు ఎదురుగా వస్తున్న వాహనదారులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలపై పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. ఎక్కడో చోట ఇలాంటి డేంజరస్ స్టంట్‌లకు పాల్పడుతున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








