ఆస్టన్ మార్టిన్ వల్కన్ టీజర్ వీడియో
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ త్వరలో మరో సరికొత్త లగ్జరీ కారును ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఆ కొత్త ఆస్టన్ మార్టిన్ కారు పేరు 'వల్కన్' (Vulcan). బహుశా అగ్నిపర్వతం నుంచి స్ఫూర్తి పొంది ఆ పేరు పెట్టారేమో తెలియదు, ఈ టీజర్ వీడియోలో మాత్రం సదరు కారు నిప్పులు కక్కుతూ కినిపిస్తుంది.
మార్చ్ 3, 2015వ తేది నుంచి ప్రారంభం కానున్న జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో ఆస్టన్ మార్టిన్ తమ కొత్త కారు పరదాలను తొలగించే ఆస్కారం ఉంది. అప్పుడే ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. మరి ఈ లోపుగా ఆస్టన్ మార్టిన్ వల్కన్ సూపర్‌కారుకు టీజర్ వీడియోని చూసి ఎంజాయ్ చేసేద్దాం రండి..!
ఆస్టన్ మార్టిన్ వల్కన్ సూపర్‌కారు టీజర్ వీడియో:
<center></center>


Click it and Unblock the Notifications








