మూత్రం నుండి కాఫీ : ఏడాది తరువాత అంతరిక్షం నుండి వచ్చిన వారి అనుభవాలు

By Anil

అమెరికాకు చెందిన స్కాట్ కెల్లీ, ఇతను ఏడాది కాలం పాటు అంతరిక్షంలో ఉండి సురక్షితంగా ఈ వారంలో భూ మండళాన్ని చేరుకున్నాడు. దాదాపుగా 365 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన స్కాట్ కెల్లీ వ్యోమగామి తిరిగి భూమిని చేరుకున్నందుకు ఎంతో ఆనందంగా మరియు గర్వంగా ఉందని తెలిపాడు. అంతే కాకుండా అంతరిక్షంలో ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చాడు.

వ్యోమగాములు ఇంత కాలం పాటు అంతరిక్షంలో గడపడానికి కారణాలు, అంతరిక్షంలో చోటు చేసుకున్న సన్నివేశాలు మరియు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే పోటోలు వంటివి ఎన్నో క్రింది స్లైడర్లలో దాగున్నాయి.

ముఖ్య ఉద్దేశ్యం

ముఖ్య ఉద్దేశ్యం

అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్ర నాసా ముఖ్యంగా వీరిని అంతరిక్షంలోకి ఏడాది కాలంపాటు పంపడానికి ముఖ్య కారణం. అంతరిక్షంలో ఉన్నపుడు మానవ శరీరంలో కలిగే మార్పులను పరీక్షించడానికి అని తెలిసింది. నాసా తొలిసారిగా మానవ శరీరం గురించి చేపట్టిన ప్రాజెక్ట్ కూడా ఇదే.

సుధూర ప్రయాణం

సుధూర ప్రయాణం

340 రోజుల సుదూర ప్రయాణంలో స్కాట్ కెల్లీ తో పాటు ఇతని బృందం కార్నియాన్‌కోవమ్ మైకేల్, సెర్జారీ వాల్కూ కోయుస్ ఉన్నారు. వీరు ప్రయాణాన్ని పూర్తి చేసుకుని రెండు రోజుల క్రితం భూమిని చేరుకున్నారు.

 పరివర్తనాలు (ట్రాన్సిషన్స్)

పరివర్తనాలు (ట్రాన్సిషన్స్)

అంతరిక్షంలో భూమ్యాకర్షణ శక్తి లేకపోవడం మానవ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని వీరి ప్రయాణంలో వెల్లడైందని తెలిపారు. మానసికంగా మరియు శారీరకంగా గురుత్వాకర్షణ శక్తి ఎంతో ప్రభావాన్ని చూపుతుంది, ఇందులో ముఖ్యంగా శరీరంలో రక్తం సరఫరా, ఎముకలు మరియు కండరాలకు చెందిన సమస్యలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరి బృందంలో స్కాట్ కెల్లీ నాసా వెల్లడించాడు.

రసాయనిక ప్రయత్నాలు

రసాయనిక ప్రయత్నాలు

ఏడాది పాటు అంతరిక్షంలో ఉండి వచ్చిన స్కాట్ కెల్లీకి నాసా చాలా రకాల రసాయన పరీక్షలు జరిపింది. మరొ సంవత్సరం పాటు నాసా స్కాట్ కెల్లీని తన పర్యవేక్షణలో ఉంచుకుని కెల్లీ శరీరంలోని మార్పులను గమనించనుంది.

కవలలు

కవలలు

నాసా స్కాట్ కెల్లీని అంతరిక్షానికి పంపడం వెనుకున్న కారణ స్కాట్ కెల్లీ కవలలు, కెల్లీ సోదరుడు మార్క్ కెల్లీ ఇతను కూడా వ్యోమగామే.

కణజాల వ్యవస్థ

కణజాల వ్యవస్థ

కణజాల వ్యవస్థ ప్రకారం స్కాట్ మరియు మార్క్ ఇద్దరికీ ఒకే విధంగా ఉంటుంది. అయితే స్కాట్ కెల్లీ అంతరిక్షం నుండి నేలకు తిరిగి వచ్చిన తరువాత స్కాట్ కెల్లీ శరీరంలోని కణజాలంలో మార్పులను నాసా గమనించింది.

శారీరక ధృడము

శారీరక ధృడము

అయితే అంతరిక్ష ప్రయాణం తరువాత వచ్చిన స్కాట్ కెల్లీ శరీరంలో బరువు మరియు ఎముక సాంధ్రతలో మార్పులు చోటు చేసుకున్నట్లు వెల్లడైంది. దీనికి కారణం అంతరక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వలన రోజుకు రెండున్నరల గంటల పాటు వ్యాయామం చేయాల్సి వచ్చేది. లేదంటే ఎక్కువ మోతాదులో మాసం తీసుకోవాల్సి వచ్చేది.

ప్రమాదంతో కూడుకున్నది

ప్రమాదంతో కూడుకున్నది

వ్యోమగాములు అంతరిక్షం నుండి భూ కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత అనేకస ఆరోగ్యపరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అందులో రక్తం సరిగా సరఫరా జరగకపోవడం, వాంతులు మరియు కళ్లు తిరగడం వంటివి జరుగుతాయి. అందుకోసం వీరు కొన్ని రకాల మెడిసిన్స్‌ను కూడా వారి వెంట తీసుకెళతారు మరియు వీరు నేలను చేరుకున్న తరువాత సరిగా నడవలేరు అందుకోసం అక్కడ ప్రత్యేకంగా డాక్టర్లను అందుబాటులో ఉంచుతారు. దీనంతటికి కారణం ఒక్క సారిగా గురుత్వాకర్షణ శక్తిని పొందడం. అయితే ఒక సారి ఇది ప్రాణాపాయం కూడా.

ఆశ్చర్యకరం

ఆశ్చర్యకరం

వీరి మూత్రాన్ని తీసుకుని దానిని శుద్దపరిచి కాఫీ చేసుకునే వారమని మరియు ఖాలీ సమయంలో తోటి వ్యామగాములతో ఆడుకునేవారమని స్కాట్ కెల్లీ తెలిపాడు.

కీలక పాత్ర

కీలక పాత్ర

భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాలకు చెందిన పరీక్షలకు మరియు అంతరిక్ష పరిశోధనలలో స్కాట్ కీలక పాత్ర పోషించనున్నారు.

ఫోటోలు

ఫోటోలు

స్కాట్ కెల్లీ అంతరిక్షంలో ఎంతో శ్రమతో కూడిన ప్రయాణాన్ని పూర్తి చేశాడు. అతని అనుభవంలో కొన్ని అరుదైన ఫోటోలు మరియు వాటికి చెందిన సమాచారం తరువాత స్లైడర్ల నుండి తెలుసుకోగలరు

జూన్ 22, 2015

జూన్ 22, 2015

స్కాట్ తన 87వ రోజున ప్రయాణంలో ఒక ధృువ కోణం (Polar Angle) నుండి తీసిన చిత్రం ఇది.

ఏడాది తరువాత అంతరిక్షం నుండి వచ్చిన వారి అనుభవాలు

స్కాట్ నేల మీద ఉన్న మధ్యదరా సముద్రాన్ని తన కెమెరాలో బంధించిన చిత్రం

ఆగష్టు 15, 2015

ఆగష్టు 15, 2015

కాంతి యొక్క ధృువ కోణం ద్వారా కాంతులీనుతున్న చిత్రాన్ని స్కాట్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశాడు

 ఆగష్టు 29, 2015

ఆగష్టు 29, 2015

తూర్పు ఫసిపిక్ మహాసముద్రంలో తుఫాన్ సంభవించినపుడు కిమియా అను వ్యోమగామి ఈ చిత్రాన్ని తీసి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.

 శుభరాత్రి

శుభరాత్రి

206 వ రోజున ఈ బృందం తీసిన ఫోటో ఇది. చీకటిలో మెరుస్తున్న తారలు ఆరాధనకు గుర్తులను తెలుపుతూ పింపిన ఫోటో ఇది.

సూర్యోదయం

సూర్యోదయం

సూర్యోదయాన్ని పూర్తిగా అంతరిక్షం నుండే కాకుండా భూమికి దగ్గరగా ఒక ప్రత్యేక కోణంలో సూర్యోధయాన్ని తీసిన ఫోటో

 సురక్షితంగా పుట్టినింటికి

సురక్షితంగా పుట్టినింటికి

స్కాట్ కెల్లీ కజకిస్థాన్ నుండి ప్లేన్ ద్వారా సురక్షితంగా తన సొంత ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే కెల్లీ జీవితంలో ఈ యాత్ర ఎంతో క్లిష్టమైనదని నిర్ణయించవచ్చు.

మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.......
  1. 170 ఇండియన్ రైల్వే చరిత్రలో 49 ఆసక్తికరమైన విషయాలు
  2. పైలట్లు మరియు విమానం సిబ్బంది చాటుగా చేసే 20 రహస్య పనులు
  3. భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

More from DriveSpark

Article Published On: Friday, March 4, 2016, 17:19 [IST]
English summary
Astronaut Scott Kelly Returns Safely Earth After One Year Mis
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+