అంబాసిడర్ కారు వద్దని బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారును ఎంచుకున్న వాజ్‌పేయి

వాజ్‌పేయి గారిని స్మరించుకుని ఇవాళ్టి కథనంలో ఆయన ఉపయోగించిన కార్ల గురించి మరియు వాజ్‌పేయి గారి జీవితంలో కొన్ని సంఘటనలను తెలుసుకుందాం రండి...

By Anil Kumar

మాజీ ప్రధాని మరియు భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం విషమించి బుధవారం సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే. సుధీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి, దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషించారు. వరుసగా మూడు పర్యాయాలు భారత ప్రధానిగా పదవి చేపట్టిన వాజ్‌పేయి గారు భవిష్యత్ రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడు.

వాజ్‌పేయి గారిని స్మరించుకుని ఇవాళ్టి కథనంలో ఆయన ఉపయోగించిన కార్ల గురించి మరియు వాజ్‌పేయి గారి జీవితంలో కొన్ని సంఘటనలను తెలుసుకుందాం రండి...

ఆ రోజు కారులో ఇరుక్కుపోయిన వాజ్‌పేయి

హిందుస్తాన్ అంబాసిడర్ కారును పక్కన పెట్టి, అత్యంత సురక్షితమైన, విలాసవంతమైన బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ సెక్యురిటీ ఎడిషన్ కారును మొట్టమొదటిసారిగా ఉపయోగించిన భారత ప్రధాని వాజ్‌పేయి.

ఆ రోజు కారులో ఇరుక్కుపోయిన వాజ్‌పేయి

వాజ్‌పేయి గారి ప్రధాని సగంలో ఉన్నపుడు, భారతదేశపు వీవీఐపి భద్రతను పరిరక్షించే ప్రత్యేక భద్రతా సిబ్బంది (SPG) సూచనల మేరకు హై ఎండ్ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ సెక్యురిటీ గార్డ్ కారును ఎంచుకున్నారు. దీనికి ముందు ప్రధాని ఉపయోగించిన హిందుస్తాన్ అంబాసిడర్ బుల్లెట్ ప్రూఫ్ కారు.

ఆ రోజు కారులో ఇరుక్కుపోయిన వాజ్‌పేయి

అంబాసిడర్‌ను పక్కనపెట్టి బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఎందుకు..?

2001లో సాయుధ ఇస్లామిక తీవ్రవాదులు ఢిల్లీలో ఉన్న భారత పార్లమెంట్ భవనం మీద దాడి చేసారు. దీంతో రాజకీయ నాయకులు మరియు వారి భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

ఆ రోజు కారులో ఇరుక్కుపోయిన వాజ్‌పేయి

ప్రధాని భద్రతకు హాని ఉందని భావించి, ప్రధాన మంత్రి రవాణా అవసరాలకు నాలుగు ధృడమైన మరియు టెర్రరిస్టుల దాడులను ఎదుర్కోగలిగే బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ సెలూన్ కార్లను కొనుగోలు చేశారు.

ఆ రోజు కారులో ఇరుక్కుపోయిన వాజ్‌పేయి

ఈ నాలుగు కార్లలో ఒక దానిని స్పేర్‌ వెహికల్‌‌గా పక్కన ఉంచారు. రెండింటిని రాష్ట్రపతి మరియు ప్రధాన మంత్రి రవాణా అవసరాల కోసం కేటాయించారు. ఇందులో భాగంగానే అంతకు హిందుస్తాన్ అంబాసిడర్ కారును ఉపయోగిస్తున్న ప్రధాని వాజ్‌పేయి, తన అధికారిక కాన్వాయ్ కోసం బిఎమ్‌డబ్ల్యూ 740 ఎల్ఐ వేరియంట్ కారును ఎంచుకున్నారు.

ఆ రోజు కారులో ఇరుక్కుపోయిన వాజ్‌పేయి

వాజ్‌పేయికి ముందు లగ్జరీ కార్లను ఉపయోగించిన ప్రధానులు ఉన్నారా..?

అంబాసిడర్ తర్వాత బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారులో ప్రయాణించిన భారత తొలి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అన్నాము కదా, అయితే వాజ్‌పేయి కంటే ముందే విలాసవంతమైన కార్లను ఉపయోగించిన ప్రధానులు ఉన్నారా అంటే అవుననే చెప్పాలి.

ఆ రోజు కారులో ఇరుక్కుపోయిన వాజ్‌పేయి

1984 నుండి 1989 మధ్య కాలంలో భారత ప్రధానిగా ఉన్న స్వర్గీయ రాజీవ్ గాంధీ మారుతి 1000 సెడాన్, మెర్సిడెస్ బెంజ్ 500 ఎస్ఇఎల్ మరియు రేంజ్ రోవర్ వంటి కార్లను ఉపయోగించారు. అయితే వీటిలో మెర్సిడెస్ మరియు రేంజ్ రోవర్ కార్లను అప్పటి జోర్డాన్ రాజు నుండి రాజీవ్ గాంధీ బహుమానంగా పొందారు.

ఆ రోజు కారులో ఇరుక్కుపోయిన వాజ్‌పేయి

రాజీవ్ గాంధీ ఆ తర్వాత వచ్చిన ఎందరో ప్రధాన మంత్రులు వరుసగా హిందుస్తాన్ అంబాసిడర్ కారును ఉపయోగించారు. అయితే, వాజ్‌పేయి గారితో ప్రధాని అధికారిక వాహనం అబాసిడర్ నుండి బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్‌కు మారిపోయింది.

ఆ రోజు కారులో ఇరుక్కుపోయిన వాజ్‌పేయి

కారులో ఇరుక్కుపోయిన వాజ్‌పేయి

2004లో ప్రధాని వాజ్‌పేయి పదవిని కోల్పోయిన తర్వాత, హిందుస్తాన్ అంబాసిడర్ కారులో ఇంటికి వెళ్లాడు. ఎనభై పదుల వయస్సులో ఉన్న మాజీ ప్రధాని హిందుస్తాన్ అంబాసిడర్ కారులో ఇరుక్కుపోయాడు. అంబాసిడర్ డోర్లు జాయ్ అయిపోవడంతో రెండు సీట్ల మధ్యలో ఉన్న ఇరుకైన సందులో ముందువైపుకొచ్చి డ్రైవర్ సైడ్ డోరు తెరుచుకుని బయటికొచ్చాడు.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న యూపీఏ ప్రధాని మన్నోహన్ సింగ్ నాలుగు బిఎమ్‌డబ్ల్యూ కార్లలో ఒక కారును మాజీ ప్రధాని వాజ్‌పేయి కోసం పంపించారు.

Most Read Articles

English summary
Read In Telugu: Atal Behari Vajpayee: India’s first PM to use BMW 7-Series after dumping Hindustan Ambassador
Story first published: Saturday, August 18, 2018, 18:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X