స్కూటర్ సీటు క్రింద బీర్ బాటిళ్లు.. కూలింగ్ కోసం ఐస్ క్యూబ్స్.. అతని తెలివికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

గతంలో ఈవీలను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోయేవారు. కానీ ప్రస్తుతం అలాంటి రోజులు పోయాయి. ఇంధన వాహనాల కంటే కూడా ఈవీలకు డిమాండ్ పెరిగింది. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విపరీతంగా పుంజుకుంటుంది. ఈవీ బైకులు ఇటీవల మార్కెట్లో ఎక్కువగా అన్ని నగరాలు, పట్టణాల్లో కనిపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు రూ.100కు పైగా ఉండటంతో అందరి చూపు వీటిపైనే ఉంది. ఈవీ వాహనాల తయారీ కంపెనీలు పోటీపడి మరి అధునాతన ఫీచర్లతో కొత్త కొత్త స్కూటర్లను తీసుకొస్తున్నాయి. కస్టమర్లను తమ వైపు తిప్పుకోవడానికి వీటిల్లో వారికి అవసరమయ్యే అన్ని ఆప్షన్లను ప్రత్యేకంగా ఇస్తున్నాయి. ప్రధానంగా పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే, ఈవీలలో సీటు క్రింది భాగంలో ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది. దీనిలో ఎక్కువ సామాను పెట్టుకోవడానికి స్థలం ఉంటుంది.

ఎక్కువ స్టోరేజ్ కోరుకునే వినియోగదారులు ఎక్కువ కావడంతో కంపెనీలు పోటా పోటీగా అధిక స్టోరేజీని అందించడానికి ప్రధానంగా దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో ప్రముఖ ఈవీ తయారీదారుగా ఉన్నటువంటి ఏథర్(Ather) కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎక్కువ సామాన్లు పెట్టడానికి స్టోరేజ్ సామర్థ్యాన్ని అధికంగా ఇస్తుంది. ముఖ్యంగా కంపెనీ తన రిజ్టా(Rizta) మోడల్‌లో 34 లీటర్ల స్టోరేజ్‌ను అందిస్తుంది.

Ather Rizta Electric Scooter Boot Space

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గత ఏడాది ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి లాంచ్ అయింది. ఇది ఒక కుటుంబ స్కూటర్‌గా పేరొందింది. సీటు క్రింది భాగంలో 34 లీటర్లు, ముందు భాగంలో 22 లీటర్ల స్టోరేజ్‌తో మొత్తంగా 56 లీటర్ల స్థలాన్ని ఏథర్ రిజ్టా కలిగి ఉంది. ఇంత స్పెస్‌తో ల్యాప్‌టాప్‌, కిరాణా సామాగ్రి వంటి వాటిని తీసుకుని వెళ్లవచ్చు. ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వారికి బెస్ట్ ఈవీ స్కూటర్‌ అవుతుంది.

సాధారణ స్కూటర్లతో పోలిస్తే రిజ్టాలో మరింత ఎక్కువ స్థలం ఉంటుంది. భారతీయ వినియోగదారులకు తమ రోజువారి సామాన్లు తీసుకెళ్ళడానికి అనువుగా ఉండే ఈ స్కూటర్ ప్టోరేజ్ గురించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఒక వ్యక్తి ఏకంగా 12 బీర్ బాటిళ్లను పెట్టిన వీడియో ఇటీవల బయటకు వచ్చింది. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఈ బాటిళ్లను సీటు క్రింద అమర్చడం.

Ather Rizta Electric Scooter

పైగా బీర్ బాటిళ్ల కూలింగ్ పోకుండా ఉండటానికి ఆ వ్యక్తి బూట్ ప్లేస్‌లో ఐస్ క్యూబ్స్ కూడా ఒక వరుసలో పేర్చడం గమనార్హం. దీంతో అవి చల్లగా ఉండటానికి కూడా ఏర్పాటు చేశాడు. అసలుకే సీటు క్రింద ఉండటంతో హీటింగ్ ఎక్కువ అయి అవి వేడిగా అవుతాయని భావించిన అతను తన తెలివితో ఐస్ క్యూబ్స్‌ను కూడా బీర్ బాటిళ్ల మధ్య ఉంచడం కొసమెరుపు.

ఈథర్ రిజ్టాలో బీర్ బాటిళ్లు ఉన్న వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇది కేరళలో జరిగింది వీడియోలో ఆ వ్యక్తి మాట్లాడుతూ, పైన 7 బాటిళ్లు ఉన్నాయి, మిగిలిన 5 క్రింది భాగంలో ఉన్నాయని చెప్పడం వినిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను చూసిన చాలా మంది అతను చేసిన పనిపై పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్కూటర్‌లో బూట్ స్పెస్ ఎక్కువగా ఉండటం బాగా కలిసి వచ్చింది.

Ather Rizta Electric Scooter 12 Beer Bottles

ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే ఏథర్ కంపెనీ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. రిజ్టా మోడల్ ప్రారంభ ధర మార్కెట్లో రూ.1.10 లక్షలుగా ఉంది. ఈవీల విభాగంలో పోటీ ఎక్కువ అయిన నేపథ్యంలో కంపెనీ తన అమ్మకాలను పెంచుకోడానికి కస్టమర్లను ఆకర్షించడానికి ఈ విధంగా ఎక్కువ స్టోరేజ్‌తో పాటు ఇంకా పలు లేటెస్ట్ ఫీచర్లను అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 25, 2024, 10:20 [IST]
English summary
Ather rizta electric scooter boot holds 12 beer bottles here video
Read more on: #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+