షారూఖ్‌తో రూ.1100కోట్ల సినిమా.. కట్ చేస్తే ఇండియాలోనే ఫస్ట్ టైం రూ.7.50కోట్ల కారు కొన్న స్టార్ డైరెక్టర్
సెలబ్రిటీల లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రోల్స్ రాయిస్ (Rolls-Royce) కంపెనీకి చెందిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు స్పెక్టర్(Spectre)ను కొనుగోలు చేసిన భారతదేశపు మొదటి దర్శకుడు ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు.. తాను దర్శకత్వం వహించిన 5 సినిమాల్లో ఒక్క ఫ్లాప్ కూడా లేని 100% సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు, ఇటీవల షారూఖ్ ఖాన్‌తో జవాన్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసిన అట్లీ కుమార్ (Atlee Kumar). దర్శకుడు శంకర్ శిష్యుడైన అట్లీ, తన వరుస విజయాలు, పాన్-ఇండియా రేంజ్ పెరగడం వలన ఆదాయం పెరిగి, తన వాహనాన్ని కూడా లగ్జరీగా అప్‌గ్రేడ్ చేసుకున్నాడు.
వరుసగా ఐదు హిట్‌లు, అందులో జవాన్ లాంటి వరల్డ్ లెవల్ బ్లాక్‌బస్టర్‌తో దర్శకుడు అట్లీ కుమార్ భారతీయ సినిమా రంగంలో సంచలనం సృష్టించాడు. ఈ విజయంతో తన ఆదాయాన్ని అప్‌గ్రేడ్ చేసుకున్న అట్లీ ఆడంబరమైన రోల్స్ రాయిస్ బ్రాండ్‌కు చెందిన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశాడు. రోల్స్ రాయిస్ నుంచి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అయిన స్పెక్టర్‌ను కొనుగోలు చేసిన భారతదేశపు మొదటి సినీ దర్శకుడు అట్లీనే.

అట్లీ కొనుగోలు చేసిన ఈ లగ్జరీ కారు స్టాండర్డ్ మోడల్ ధర రూ.7.50 కోట్లు. ట్యాక్సులు, ఇన్సూరెన్స్‌తో కలిపి న్యూఢిల్లీలో దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.7.85 కోట్ల వరకు ఉంటుంది. (దీని బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ ధర రూ.9.50 కోట్ల నుంచి మొదలవుతుంది). అట్లీ కారు డైమండ్ బ్లాక్ రంగులో ఉంది. లోపలి భాగంలో, అతను బోల్డ్ టాంజరైన్ లెదర్, బ్లాక్ ఫినిషింగ్‌లతో ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు.
దర్శకుడు శంకర్‌కు సహాయకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన అట్లీ, రాజా రాణితో దర్శకుడిగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అతని విజయ ప్రస్థానం ఆపకుండా సాగుతోంది. అట్లీ ఇప్పటివరకు దర్శకత్వం వహించిన 5 సినిమాల్లో ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. ఇది అతనిని అత్యంత విజయవంతమైన దర్శకులలో ఒకరిగా నిలబెట్టింది.

2023లో విడుదలైన షారూఖ్ ఖాన్ జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1100+ కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం అట్లీ.. సన్ గ్రూప్‌తో కలిసి అల్లు అర్జున్ హీరోగా ఒక బిగ్ బడ్జెట్ సినిమాకు దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. రోల్స్ రాయిస్ స్పెక్టర్, ఫాంటమ్ కూపే, వ్రైత్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆధునిక ఆడంబరాన్ని, ఎలక్ట్రిక్ టెక్నాలజీని అందిస్తుంది.
ఈ కారు మెయిన్ అట్రాక్షన్ సూసైడ్ డోర్స్. ముందు భాగంలో అందమైన గ్రిల్, రోల్స్ రాయిస్ ప్రసిద్ధ స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ బొమ్మ ఉంటుంది. ఐసీఈ మోడల్స్ మాదిరిగా కాకుండా, 23-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వచ్చే మొట్టమొదటి రోల్స్ రాయిస్ మోడల్ ఇదే. దీనిలో స్టార్‌లైట్ రూఫ్, ప్రీమియం లెదర్ అప్‌హోల్‌స్టరీ, డ్యాష్‌బోర్డ్‌లో కలప, గ్లాస్ ప్యానెల్ ఇన్సర్ట్‌లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఆడంబర ఫీచర్లు ఉన్నాయి.

డ్యుయల్ మోటార్ సెటప్ (ముందు, వెనుక యాక్సిల్స్‌లో) తో పనిచేసే ఈ కారు 575 bhp పవర్, 900 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100kmph వేగాన్ని అందుకోగలదు. స్పెక్టర్ EV కి 103 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది అద్భుతమైన రేంజ్‌ను ఇస్తుంది. ఈ లగ్జరీ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు.
95 కిలోవాట్ల డీసీ ఛార్జర్ ఉపయోగించి కేవలం 34 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అంతేకాక, 9 నిమిషాలు ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించడానికి సరిపడా ఛార్జింగ్ వస్తుందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








