నేటి వీడియో: చావు తప్పి కన్ను లొట్ట పోవటం అంటే ఇదే

By Ravi

డ్రైవింగ్ పాఠాల్లో నేర్చుకోవాల్సిన వాటిళ్లో ముఖ్యమైన అంశం, పార్కింగ్ ఎలా చేయాలో తెలుసుకోవటం. కారును ఆఫ్ చేసిన తర్వాత లేదా పార్కింగ్ చేసిన తర్వాత, సదరు కారు ముందుకు లేదా వెనుక కదలకుండా ఉండేలా హ్యాండ్ బ్రేక్/లేదా పార్కింగ్ బ్రేక్‌ను తప్పనిసరిగా ఉపయోగించారు. మరింత సేఫ్టీ కోసం కారును గేరులో (మ్యాన్యువల్ గేర్ బాక్స్ కలిగిన కార్లలో కారును గేరులో ఉంచాలి, ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన కార్లలో గేరును 'పి' మోడ్‌లో ఉంచాలి) ఉంచినా మంచిదే.

ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఒక్కోసారి పెను ప్రమాదాలకు కారణం కావచ్చు. అసలు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, రష్యాలోని ఓ వ్యక్తి ఇలానే కారును పార్కింగ్ మోడ్‌లో ఉంచకపోవటం వలన (లేదా హ్యాండ్/పార్కింగ్ బ్రేక్ అప్లయ్ చేయకుండా) ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం రండి.

రష్యాలోని ఓ వ్యక్తి ఆడి ఏ3 కారును పై అంతస్థులో పార్క్ చేసేందుకు పార్కింగ్ లిఫ్ట్‌ పైకి ఎక్కించాడు. కానీ, ఆ సమయంలో అతను హ్యాండ్/పార్కింగ్ బ్రేక్‌ను అప్లయ్ చేయటం మర్చిపోయి, కారును న్యూట్రల్‌లో ఉంచేశాడు. పార్కింగ్ లిఫ్ట్ దాదాపు 5-6 అడుగులు ఎత్తు పైకి వెళ్లగానే, పార్కింగ్ లిఫ్ట్‌పై ఉన్న కారు ఒక్కసారిగా ముందుకు దొర్లిపోయింది. ముందుకు దొర్లుతున్న ఆ కారును సదరు వ్యక్తి తన చేతుల్తో ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే, ఒక్కసారిగా వేగంగా క్రింది దూసుకువచ్చింది.

అప్పటికే అప్రమత్తమైన సదరు వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి దూకేశాడు. దీంతో కారు పడాల్సిన అతను కొంచెం వెనుకగా పడ్డాడు. అదే సమయంలో దొర్లిన కారు కూడా దాదాపు అతని కాళ్లకు సమీపంలో పడి, కారు ముందు భాగం దెబ్బతింది. ఈ సంఘటనలో అతను ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ కారు క్రింద పడి ప్రాణాలు కోల్పోయి ఉండే వాడు. కాబట్టి, పాఠకులారా.. వాహనాన్ని పార్క్ చేసిన తర్వాత హ్యాండ్ బ్రేక్ లేదా పార్కింగ్ బ్రేక్‌లను ఉపయోగించడం మర్చిపోకండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/ZL_if7FAzV4?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Tuesday, November 26, 2013, 9:21 [IST]
English summary
What you see him do in the video below is trying to park an Audi A3 by loading it on to a parking lift. Unfortunately, for him and the owner of the car the handbrake was not pulled. The end result is when the lift slants the car weighing more than a ton comes rolling forward.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+