అయ్యయ్యో ఇలా జరిగిందేంటి!.. గోడెక్కిన ఆడి - వైరల్ వీడియో

ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి. రోడ్డు జరగడానికి వివిధ కారణాలు ఉండవచ్చు. కారణం ఏదైనా డ్రైవర్ లేదా వాహన వినియోగదారుడు జాగరూకగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో ఓ ఖరీదైన ఆడి (Audi) కారు రోడ్డు పక్కన నిర్మించిన ఓ చిన్న గోడమీదికి దూసుకెళ్ళుంది. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఈ ఘటనలో ఎవరికైనా హాని జరిగిందా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం ఈ ఘటన గోవా సమీపంలోని తిల్లారి ఘాట్‌లో జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో గమనించినట్లయితే ఆడి ఏ4 కారు రోడ్డు పక్కనే ఉన్న రిటైనింగ్ వాల్ మీదకు చేరింది. ఒక అడుగు దూరం ముందుకు కదిలి ఉన్నా.. కారు అటువైపు పడిపోయిన ఉండేది. అదృష్టవశాత్తు కారు అక్కడే ఆగిపోయింది. కాబట్టి ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.

Audi A4 Car Stuck On Goa Tilari Ghat

నిజానికి సాధారణ స్ట్రెయిట్ హైవేలపై డ్రైవింగ్ చేయడం లేదా సిటీ రోడ్లపై డ్రైవింగ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. అయితే ఘాట్‌ రోడ్లపై డ్రైవింగ్‌ చేసే సమయంలో డ్రైవర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తీవ్రమైన మలుపులు, వాలుగా ఉండే రోడ్డు మీద ప్రయాణం కొంత కఠినంగానే ఉంటుంది. ఆదమరిస్తే.. రెప్పపాటు కాలంలో ప్రమాదం జరిగిపోతుంది. అదే జరిగితే ప్రాణాలే పోవొచ్చు కూడా.

ఘాట్ రోడ్డు మీద ఆడి కారు డ్రైవర్ వేగంగా ప్రయాణించడం వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోని చాలా ఘాట్ రోడ్ల మీద వేగపరిమితులకు కొన్ని షరతులు ఉన్నాయి. నిర్దిష్ట వేగాన్ని దాటకూడదని పేర్కొని ఉంటారు. అయినప్పటికీ.. కొందరు వాటిని పెడచెవిన పెట్టడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతాయి. అయితే ఆడి కారు రోడ్డుపక్కన ఉన్న గోడమీదకు చేరటానికి గల కారణం ఖచ్చితంగా వెల్లడి కాలేదు.

కారు డ్రైవర్ కారును కంట్రోల్ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అని కొందరు భావిస్తున్నారు. ఆడి ఏ4 కారు మొదటి రిటైనింగ్ వాల్ ఢీ కొట్టిన తరువాత పూర్తిగా ఆగిపోవడానికి ముందు దానిపైకి వెళ్లినట్లు కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ప్రమాదం జరగలేదు. అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఎందుకంటే కారుకు కూడా తీవ్ర స్థాయిలో డ్యామేజ్ కాలేదు.

భారతదేశంలోని ఘాట్ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే చాలా అనుభవం ఉండాలి. ఎందుకంటే ఘాట్ రోడ్డు.. హైవే మాదిరిగా ఉండదు. ఏటవాలుగా.. పదునైన టర్నింగ్స్ చాలా ఉంటాయి. కాబట్టి వాహనాన్ని డ్రైవ్ చేసేవ్యక్తి తప్పకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. లేకుంటే వాహనాలు లోయల్లో పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఘాట్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలి.

ఘాట్ రోడ్డుమీద వాహనాన్ని డ్రైవ్ చేసే వ్యక్తి తప్పకుండా స్పీడ్ కంట్రోల్ చేయాలి. లేకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. పరిస్థితులను బట్టి డ్రైవర్ గంటకు 20 నుంచి 40 కిమీ వేగంతో వెళ్లడం ఉత్తమం. బ్రేకింగ్ టెక్నీక్స్ గురించి కూడా డ్రైవర్లకు పూర్తి అవగాహన ఉండాలి. అత్యవసర సమయంలో బ్రేకింగ్ వేయాలంటే ముందుగానే అవన్నీ సరిగ్గా పనిచేస్తాయా లేదా అనేది తెలుసుకుని ఉండాలి.

అంతే కాకుండా డ్రైవర్ రహదారి పరిస్థితులను అంచనా వేయాలి.. వాటికి అనుగుణంగా డ్రైవ్ చేయాలి. కొండా చరియలు, పొగ మంచు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. రోడ్డుపై వాహనాన్ని నడిపే సమయంలో హార్న్ మరియు లైట్స్ ఉపయోగించాలి. ఇది ఎదుటి వారికి మనం ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తుంది. ఘాట్ రోడ్డు మీద డ్రైవింగ్ చేయాలంటే తప్పకుండా సహనం చాలా అవసరం.

More from DriveSpark

Article Published On: Monday, June 17, 2024, 8:06 [IST]
English summary
Audi a4 car stuck on goa tilari ghat wall check the details here
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+