రెప్పపాటులో ప్రాణం తీసిన ఆడి కార్ మెరుపు వేగం[వీడియో]

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం లక్షకు పైగా ఉంది. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు నిరంతరం రోడ్డుపై నిలబడి విధినిర్వహణలో మునిగిపోతున్నారు. అంతే కాదు రోడ్డుపై ఎక్కడ చూసిన సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఇవన్నీ ప్రమాదాల నుంచి రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డాయి.

ప్రాణం తీసిన ఆడి కార్ మెరుపు వేగం [వీడియో]

అయితే ఇన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో రోడ్డు ప్రమాదాలను, ఈ ప్రమాదాల్లో మరణించే వారిని నిలువరించలేకపోతున్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫి రూల్స్ పాటించకపోవడం, మద్యం తాగి వాహనాన్ని డ్రైవ్ చేయడం మరియు మితిమీరిన వేగం.

ప్రాణం తీసిన ఆడి కార్ మెరుపు వేగం [వీడియో]

ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే నిజంగా ఒక్క సారిగా భయాందోళన కలుగుతుంది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ఒక వ్యక్తి మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయాల పాలైనట్లు తెలిసింది. ఇంతటి భీకర రోడ్డు ప్రమాదానికి కారణం మితిమీరిన వేగం అని పోలీసులు తెలిపారు.

ప్రాణం తీసిన ఆడి కార్ మెరుపు వేగం [వీడియో]

నివేదికల ప్రకారం, ఈ రోడ్డు ప్రమాదంలో గత అదివారం రాత్రి 'ఇనార్బిట్ మాల్' దగ్గర జరిగినట్లు తెలిసింది. ఈ ఘటన జరిగిన సమయంలో వాన కురుస్తోంది. ఆ సమయంలో రోడ్డుపై ఒక ఆటో వెళ్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

ప్రాణం తీసిన ఆడి కార్ మెరుపు వేగం [వీడియో]

అదే సమయంలో అధిక వేగంతో వస్తున్న కారు ఆటోని డీ కొట్టింది. అంత వేగంతో ఆటోని డీ కొట్టడంతో ఆటో రోడ్డుపై ఒక్కసారిగా గిరగిరాలు తిరుక్కుంటూ దాదాపు 70 అడుగుల దూరం జారింది. ఇందులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, ఆటో డ్రైవ్ మాత్రం గాయాలతో బయటపడినట్లు తెలిసింది.

ప్రాణం తీసిన ఆడి కార్ మెరుపు వేగం [వీడియో]

సంఘటనలో మరణించిన వ్యక్తి ప్రిజ్మ్ పబ్‌లో 'ఉమేష్' గా గుర్తించారు. ఉమేష్ తన డ్యూటీ ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భయానకమైన ప్రమాదానికి కారణమైన కారు ఆడి కంపెనీకి చెందినదిగా గుర్తించారు.

పోలీసుల కథనం మేరకు ఆటోని ఢీ కొట్టిన ఆడి కారులోని వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వ్యక్తులు కారుని అక్కడే వదిలి వెళ్లిపోయారని అందులో మద్యం సీసాలు లభ్యమయ్యాయని తెలిపారు. అతిగా మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు.

ప్రాణం తీసిన ఆడి కార్ మెరుపు వేగం [వీడియో]

ఈ ప్రమాదానికి కారణమైన సుజిత్ రెడ్డి, ఆషిష్‌లను అదుపులోకి తీసుకున్నారు. కారు ఉప్పల్‌లోని సృజనా హైస్కూల్ ఓనర్ రఘునాథ్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రర్ అయినట్లు తెలిసింది. అయితే రఘునాథ్ రెడ్డి పోలీసులకు తన డ్రైవర్‌ ప్రభాకర్‌ను ఈ ప్రమాదానికి కారణం అని అప్పగించాడు. డ్రైవర్ కూడా ఈ ఆక్సిడెంట్ చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. కానీ పోలీసులు తమదైన రీతిలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Most Read Articles

English summary
Over speeding Audi Car Hits Auto From Behind Near Inorbit Mall Cyberabad. Read in Telugu.
Story first published: Tuesday, June 29, 2021, 19:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X