కంటైనర్ పడటంతో అప్పడమైన కారు, ప్రయాణికులు సేఫ్

By Ravi

ప్రపంచంలో ఏదో ఒక మూల నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అదృష్టం బాగున్న వాళ్లు ఈ ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడుతుంటారు. మరికొందరు ప్రమాదపు అంచుల వరకు వెళ్లి, చిన్నపాటి గాయాలతో ప్రమాదాలను తప్పించుకుంటుంటారు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఓ విచిత్రమైన యాక్సిడెంట్ గురించి.. ఇదిగో ఈ ఫొటోలను చూడండి.. వీటిని చూస్తుంటే, ఈ ప్రమాదంలో కారులో ఉండే ఏ ఒక్కరు కూడా బ్రతికి బట్టకట్టే ఆస్కారం కనిపించడం లేదు కదూ..! కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్, కో ప్యాసింజర్ ఇద్దరు కూడా చిన్నపాటి గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు.

ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కంటైనర్ పడటంతో అప్పడమైన కారు, ప్రయాణికులు సేఫ్

ఈ యాక్సిడెంట్ చైనా దేశంలో జరిగింది. చైనాలోని ఓ షిప్పింగ్ హార్బర్‌లో కంటైనర్లను లోడ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ ఈ భారీ కంటైనర్ క్రేన్ నుంచి జారిపోయి, కంటైనర్ క్రింద రోడ్డుపై వెళ్తున్న ఓ ఆడి కారుపై పడింది.

కంటైనర్ పడటంతో అప్పడమైన కారు, ప్రయాణికులు సేఫ్

ఆ సమయంలో ఆడి కారులో ఓ డ్రైవర్, కో ప్యాసింజ్ ఉన్నారు. ఒక్కసారిగా ఈ కంటైనర్ కారుపై పడటంతో కారు అప్పడంలా అణిగిపోయింది. ఆ సమయంలో అక్కడున్న వారంతో కారులోని ఇద్దరు బ్రతికే అవకాశం లేదని కంగారుపడిపోయారు.

కంటైనర్ పడటంతో అప్పడమైన కారు, ప్రయాణికులు సేఫ్

అయితే, అదృష్టవశాత్తు ఆ ఇద్దరు చిన్నపాటి గాయాలతో బ్రతికి బయటపడటం చూసి అక్కడున్న వాళ్లంతా అవాక్కయారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లి గాయాలకు చికిత్స చేయించారు.

కంటైనర్ పడటంతో అప్పడమైన కారు, ప్రయాణికులు సేఫ్

వారికి తగిలిన గాయాలు కూడా ప్రాణాలకు హాని కలిగించేవి కావని, అతి కొద్ది రోజుల్లోనే ఇవి నయమవుతాయని అక్కడున్న వైద్యులు స్థానిక మీడియాకు తెలిపారు.

కంటైనర్ పడటంతో అప్పడమైన కారు, ప్రయాణికులు సేఫ్

కానీ ఈ ప్రమాదంలో ఆడి లగ్జరీ కారు మాత్రం నుజ్జు నుజ్జుయిపోయింది. కంటైనర్ పడటంతోనే అప్రమత్తమైన కారులోని ఇద్దరు కారు అడుగు భాగానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అందుకే వారు చిన్నపాటి గాయాలతో బయటపడగలిగారు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 5, 2013, 16:41 [IST]
English summary
A falling container from a crane severely crushed and flattened an Audi car in Quanzhou and, amazingly, the two passengers inside survived. Check out the damage.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+