సల్లు భాయ్‌కి క్యూ7 ఎస్‌యూవీని కానుకగా ఇచ్చి ఆడి

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం "బాడీగార్డ్" సూపర్ డూపర్ హిట్ కావడంతో, సల్లు భాయ్‌కి జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా ఓ అద్దిరిపోయే కానుకను ఇచ్చింది. దేశీయ విపణిలో ఆడి ఇండియా అందిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) 'ఆడి క్యూ5'ను సల్మాన్ ఖాన్‌కు ఆడి బహుమతిగా ఇచ్చింది.

బాడీగార్డ్ సక్సెస్‌ను ఆడి క్యూ7 ఎస్‌యూవీలో ఎంజాయ్ చేస్తున్న సల్మాన్ ఖాన్

బాడీగార్డ్ సినిమా సక్సెస్ కావడానికి, ఆడి ఇండియా గిఫ్ట్ ఇవ్వడానికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. మరేం లేదండీ.. బాడీగార్డ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఎక్కువగా ఆడి క్యూ7 కారును ఉపయోగించారు కదా, దీంతో ఇండియాలో ఆడి కార్లకు ఫ్రీ పబ్లిసిటీ లభించినట్లు కావడంతో సల్మాన్ ఖాన్‌కు ఆడి ఈ బహుమతిని ఇచ్చినట్లు తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ ఆడి క్యూ7 బహుమతి

ప్రస్తుతం బాడీగాడ్ చిత్రాన్ని టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు. కాగా.. క్యూ7 ఎస్‌యూవీ ఆడి నుండి అత్యధికంగా అమ్ముడువుతున్న ప్రీమియం కారు. ఎక్కువ మంది సెలబ్రిటీలు ఈ కారును ప్రిఫర్ చేస్తుంటారు. ఇటు విలాసంతో పాటు అటు శక్తివంతమైన పెర్ఫామెన్స్‌ను అందించగలగడం ఆడి క్యూ7 ఎస్‌యూవీ సొంతం. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఇక దీని ధర విషయానికి వస్తే ఇది రూ.55 లక్షల నుండి రూ.75 లక్షల మధ్యలో ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 8, 2011, 15:31 [IST]
English summary
It is no secret that Bollywood and luxury cars go hand in hand. Premium car brands try to associate themselves with Bollywood celebrities and even films to promote their brand image. Here is yet another story where an automotive brand has boosted its image through a Bollywood Film. Audi India, the German premium carmaker is now celebrating the success of Salman Khan's recent blockbuster Bodyguard.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+