ఆడి కార్ ఓనర్ల జాబితాలో తాజా తార 'గుల్ పనాగ్'

భారత్‌లో ఆడి కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీ సినీ తారల జాబితాలో మరో అందాల భామ చేరింది. ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ బ్యూటీ క్వీన్ గుల్ పనాగ్ కూడా 'ఆడి క్యూ5' లగ్జరీ ఎస్‌యూవీపై మనసుపారేసుకుంది. అంతే, వెంటనే ముంబైలోని ఆడి షోరూమ్‌కు ఓ సరికొత్త ఆడి క్యూ5 ఎస్‌యూవీ తన వెంట తెచ్చుకుంది.
ఆడి ఇండియా ఛీఫ్ మైఖేల్ ప్రెస్కీ చేతుల మీదుగా గుల్ పనాగ్ ఆడి క్యూ5 ఎస్‌యూవీ తాళం చెవులను అందుకుంది. గుల్ పనాగ్ కన్నా ముందు మరో సినీ సెలబ్రిటీ, బాలీవుడ్ హంక్ జాన్ అబ్రహామ్ కూడా ఆడి క్యూ7 ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. గుల్ పనాగ్‌కు ఇప్పటికే ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా ఉంది.
ఆడి క్యూ5 విషయానికి వస్తే.. ఇది ఆడి క్యూ7 ఎస్‌యూవీ కన్నా చిన్నది మరియు ప్రపంచంలో అత్యధికంగా ప్రిఫర్ చేయబడుతున్న ప్రీమియం ఎస్‌యూవీ. ఇంజన్ విషయంలో రెండూ ఒకటే అయినప్పటికీ, సైజు పరంగా సీటీ రోడ్లకు ఆడి క్యూ5 చక్కగా సరిపోతుంది. ఆడి క్యూ5 ఎస్‌యూవీ 2-లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్, 3.0 టిడిఐ ఆయిల్ బర్నర్ డీజిల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








