సూపర్ హీరో చిత్రాల్లో సందడి చేసే ఆడి సూపర్ కార్లు

By Ravi

జేమ్స్ బాండ్ సినిమాల్లో బ్రిటీష్ 'ఆస్టన్ మార్టిన్' లగ్జరీ కార్లు పాపులర్ అయినట్లుగా, తాజాగా సూపర్ హీరోల చిత్రాల్లో జర్మన్ 'ఆడి' లగ్జరీ కార్లు పాపులర్ అవుతున్నాయి. ఇటీవలే విడుదలైన 'ఐరన్ మ్యాన్ 3' సూపర్ హీరో చిత్రంలో కనిపించిన ఆడి సూపర్ కారు తాజాగా మరొక హాలీవుడ్ చిత్రంలో దర్శనమిచ్చింది.

ఆస్ట్రేలియన్ నటుడు హుగ్ జాక్‌మ్యాన్ నటించిన మార్వెల్ సూపర్ హీరో చిత్రం 'ది వోల్వెరైన్' (The Wolverine)లో కూడా ఆడి సూపర్ కారు దర్శనమివ్వనుంది. ఈ మేరకు ఆడి కంపెనీ చిత్ర బృందంతో ఓ ప్రత్యేక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఈ చిత్రంలో ఆడి ఆర్8 వి10 స్పైడర్ (ఇది భారత మార్కెట్లో కూడా లభ్యమవుతోంది) కారును చూడొచ్చు.

ఈ చిత్రంలో వోల్వెరైన్ పాత్ర పోషించిన నడుటు ఆడి ఆర్8 వి10 స్పైడర్ ఓపెన్ టాప్ స్పోర్ట్స్ కారులో యుకియో (రిలా ఫుకుషిమా) చుట్టూ చక్కర్లు కొట్టడాన్ని చూడొచ్చు. ఐరన్ మ్యాన్ 3 చిత్రం ప్రిమీయర్ సందర్భంగా ఆడి కంపెనీ చిత్రం బృందంతో పాటు తమ స్పోర్ట్స్ కారును కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చూపిన సంగతి తెలిసిందే. తాజాగా, ది వోల్వెరైన్ చిత్ర ప్రీమియర్‌లో కూడా ఆడి ఇదే స్ట్రాటజీని పాటించింది.

Audi R8 At Hugh Jackman’s Wolverine Movie Premiere

ది వోల్వెరైన్ చిత్ర ప్రీమియర్‌కు విచ్చేసిన నటీమణులు టావో ఓకామోటో, రిలా ఫుకుషిమాలతో హాలీవుడ్ నటుడు హుగ్ జ్యాక్‌మ్యాన్. బ్యాగ్రౌండ్‌లో ఆడి ఆర్8 కూపే కారును చూడొచ్చు.

Audi R8 At Hugh Jackman’s Wolverine Movie Premiere

ఈ చిత్రం బృందం, డైరెక్టర్ జేమ్స్ మ్యాన్‌గోల్డ్ అందరు కూడా ఆడి వాహనాలలో ఈ ప్రీమియర్‌కు విచ్చేశారు. లండన్‌లోని లీసెస్టర్ స్కేర్‌లో ది వోల్వెరైన్ ప్రీమియర్ జరిగింది.

Audi R8 At Hugh Jackman’s Wolverine Movie Premiere

హుగ్ జ్యాక్‌మ్యాన్ ఆడి బ్రాండ్‌కు ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్)గా కూడా వ్యవహరిస్తున్నాడు. (ఆడి ఆర్8 వి10 స్పైడర్ కారుతో ఫొటోలకు ఫోజిలిస్తున్న హుగ్ జ్యాక్‌మ్యాన్).

Hugh Jackman’s Wolverine Movie Premiere

ఈ చిత్రంలో ఆడి కార్లతో పాటుగా డ్యుకాటి బైక్‌‌లను కూడా చూడొచ్చు. ఇందులో పాపులర్ డ్యుకాటి డావియేల్ క్రూయిజర్ బైక్‌ను ఉపయోగించారు. (డ్యుకాటి బ్రాండ్‌ను ఇటీవలే ఆడి సొంతం చేసుకున్న సంగతి తెలిసినదే).

వీడియో

More from DriveSpark

Article Published On: Thursday, July 18, 2013, 13:00 [IST]
English summary
Audi and its association with superhero movies apparently did not end with Iron Man as the German automaker has teamed up with yet another Marvel superhero movie The Wolverine, starring Australian actor Hugh Jackman.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+