కోట్లు విలువ చేసే కార్లు అమ్ముకుంటూ జీతాలివ్వడానికి డబ్బుల్లేవా.. 7500మంది కార్మికుల పొట్ట కొట్టిన కంపెనీ

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి(Audi) ఇండియా మార్కెట్లో మంచి ఆదరణ కలిగిన కంపెనీ. చాలా కాలాంగా లేటెస్ట్ ఫీచర్స్‎ను కలిగిన మోడల్స్‎ను రిలీజ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లు కస్టమర్లను ఆకట్టుకునే కార్ మోడల్స్‎ను లాంచ్ చేయడంలో ఆడి ఇండియా బాగా పాపులర్ చెందిన సంస్థ.

ఆడి కార్లకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ కారు కావాలంటే కొన్ని నెలల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మెర్సిడెస్, బిఎమ్‌డబ్ల్యూ తర్వాత ఇండియాలో ఆడి అతిపెద్ద లగ్జరీ కార్ల విక్రయదారు ఆడి. ఇండియాలో అభివృద్ధి చెందుతున్న కంపెనీ అయినప్పటికీ, ఆడి ప్రపంచవ్యాప్తంగా అనేక ఎదురుదెబ్బలను ఎదుర్కొంది.

Audi Company

ముఖ్యంగా యూరప్‌లో ఆడి కార్ల అమ్మకాలు వివిధ అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. దీని కారణంగా ఆడి త్వరలో కఠినమైన చర్యలు తీసుకోనుంది. వాటిలో ముఖ్యంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించబోతుంది. సాధారణంగా ప్రైవేట్ కంపెనీలు నష్టాల్లోకి వెళ్తుంటే ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా పరిస్థితిని కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నిస్తాయి.

అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోయే సరికి పూర్తిగా మూతపడిన కంపెనీలు చాలా ఉన్నాయి. అందుకే ఆ పరిస్థితి ఆడి తన కంపెనీకి రాకూడదని నిర్ణయించుకుని.. ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరిచేందుకు నిర్దిష్ట సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఆడి ఇప్పటికే ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది.

Audi Bookings

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2029 నాటికి మొత్తం 7,500 మంది ఉద్యోగులను తొలగించాలని ఆడి కంపెనీ యోచిస్తోంది. వాస్తవానికి జర్మనీతో సహా యూరోపియన్ ఖండంలోని అనేక ప్రాంతాలలో ప్రజల ఆర్థిక పరిస్థితి గత కొన్నేళ్లుగా దిగజారింది. ఫలితంగా, యూరోపియన్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా, యూరప్ అంతటా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పడిపోయింది.

ఎలక్ట్రిక్ వాహనాల ఆధారంగా తమ ఫ్యూచర్ బలంగా నిర్మించుకోవాలని యోచిస్తున్న ఆడి వంటి ఆటోమొబైల్ కంపెనీలకు ఇది పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతుండగా చైనా నుండి అనేక ఎలక్ట్రిక్ కార్ కంపెనీలు యూరప్‌లోకి ఎంట్రీ ఇవ్వడం అక్కడి కంపెనీలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి.

Audi Price

అంటే అసలే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య తగ్గుతున్న తరుణంలోనే చైనా ఎలక్ట్రిక్ కారు కంపెనీలు యూరప్‎లోకి ఎంట్రీ ఇచ్చి ఆ కొద్ది మందిని కూడా లాక్కొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవన్నీ కలిసి 2029 నాటికి జర్మనీలో 7,500మంది ఉద్యోగులను ఆడి తొలగించాల్సి వచ్చింది. ఈ చర్య జర్మనీలో మాత్రమే ప్రవేశపెడుతున్నారని, ఇతర దేశాల్లో ఎటువంటి సమస్య లేదని కంపెనీ తెలిపింది.

ప్రపంచంలోని ఆటోమొబైల్ జన్మస్థలంగా జర్మనీని పరిగణిస్తారు. ఆడికి మాత్రమే కాకుండా దిగ్గజం వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌ కూడా ఆ దేశానికి చెందినదే. అందువల్ల తన దేశంలో ఉద్యోగులను తొలగించే కంపెనీ పొరుగు దేశంలో పనిచేసే ఉద్యోగులను తొలగించేందుకు వెనుకాడదు.

Take a Poll

జర్మనీ ఆడికి అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో ఒకటి. ఆడి తన గ్లోబల్ నెట్ వర్క్ తో జర్మనీలో 7,500 మందిని మాత్రమే తొలగిస్తుంది. కానీ ఈ 7,500 మంది ప్రపంచ వ్యాప్తంగా ఆడి కంపెనీలో పని చేస్తున్న వారి పరంగా చూస్తే ఇది దాదాపు 8శాతానికి సమానం.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 18, 2025, 14:30 [IST]
English summary
Audi to lay off 7 500 employees by 2029 amid struggling sales in europe
Read more on: #audi #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+