ఇంజన్ ఆయిల్ మార్చకుండా 80,000 మైళ్లు నడిపాడు...

By Staff

ఏకమొత్తంలో కారును కొనగానే మన పని అయిపోదు, క్రమం తప్పకుండా మెయింటినెన్స్ రూపంలో ఎంతో కొంత కారు కోసం వెచ్చించాల్సి ఉంటుంది. కారు మెయింటినెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, ఆ తర్వాత తలెత్తే మరమ్మత్తులకు అయ్యే ఖర్చు తలకు మించిన భారంగా మారుతుంది.

ఇంజన్ ఆయిల్ మార్చకుండా నడిపితే..

అందుకే, చాలా మంది కార్ యూజర్లు తమ కారు మెయింటినెన్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంటారు. కారు ఇంజన్‌లో అత్యంత కీలకమైనది ఇంజన్ ఆయిల్. దీనిని క్రమం తప్పకుండా సర్వీస్ ఇంజనీర్ లేదా యూజర్ మ్యాన్యువల్‌లో తెలిపిన ప్రకారం లేదా అవసరమైనప్పుడల్లా మార్చుకుంటూ ఉండాలి.

Recommended Video

Horrifying Footage Of A Cargo Truck Going In Reverse, Without A Driver - DriveSpark
ఇంజన్ ఆయిల్ మార్చకుండా నడిపితే..

లేకపోతే, ఇదిగో ఈ ఫొటోలో చూపినట్లుగా ఇంజన్ కాలి మాడిపోతుంది. కారు సర్వీస్ విషయంలో నిర్లక్ష్యం వహించిన ఓ ఆడి టిటి స్పోర్ట్స్ కార్ డ్రైవర్ ఏకంగా 80,000 మైళ్లు (1,33,575 కిలోమీటర్లు) ఇంజన్ ఆయిల్ మార్చకుండా తిప్పాడట. అంత తిరిగాక ఇంజన్ పనికొస్తుందా.. ఇదిగో ఈ ఫొటో చూడండి.

ఇంజన్ ఆయిల్ మార్చకుండా నడిపితే..

ఈ సంఘటన ఎక్కడిన జరిగిన వివరాలు తెలియరాలేదు కానీ, ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంత ఖరీదైన కారు ఇంజన్ విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సదరు కారు యజమాని భారీ మూల్యాన్నే చెల్లించి ఉంటాడమో.

ఇంజన్ ఆయిల్ మార్చకుండా నడిపితే..

నల్లగా కాలి బొగ్గయినట్లుగా కనిపిస్తున్న ఈ ఇంజన్‌ను చూస్తుంటే, ఇందులో పూర్తిగా ఇంజన్‌ను మార్చడమా లేక ఇంజన్‌ను రీబిల్డ్ చేయటమో చేయాలి. కాబట్టి, మిత్రులారా.. కారు ఇంజన్ ఆయిల్‌పై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచండి.

Trending On DriveSpark Telugu:

ప్రేయసి కోసం 50 బైకులు దొంగలించాడు

అద్బుతం: లీటర్ నీటితో 300 మైళ్ల మైలేజ్ బైక్

కార్లపై యాంగ్రీ హనుమాన్ స్టిక్కర్ అంటించడం వెనకున్న మిస్టరీ!

భారతీయులను కించపరిస్తే ఎంతటి దిగ్గజాలకైనా ఇదే పరిస్థితి

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Buying a car is just one part of the expense. The other part is shelling out money for maintenance. Oil change costs the most during service. A regular service and an oil change will keep the car's engine in a good shape, that in return will give you better performance and good fuel economy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X