అగ్ని ప్రమాదాలలో చురుగ్గా స్పందించే రోబో వాహనం
రోబో సినిమా గుర్తుందాం ? అందులో రోబో రూపంలో ఉన్న రజనీకాంత్ అగ్ని ప్రమాదంలో ఉన్న ఒక బిల్డింగ్‌లో ఉన్న వారిని ఎలా రక్షించాడో గుర్తుకు వచ్చిందా? ఇది సినిమా అయినప్పటికి అదే నిజం అయితే ఎంత బాగుటుందో కదా. దీని వలన ఎంతో మంది రక్షించ వచ్చు కూడా. ఈ అభివృద్ది చెందిన ఆధునిక ప్రపంచంలో ఇలాంటి రూపొందించడం ఒక లెక్క కాదు.
అగ్ని ప్రమాదాలు జరిగినపుడు వారిని రక్షించడానికి వెళ్లే వారు కూడా మనుషులే కాదా? దీని వలన వృత్తిలో భాగంగా ఎంతో మంది ఉద్యోగులు గాయపడిన సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. దీని కోసం ఏం చేయాలా అని ఆస్ట్రేలియాకు చెందిన ఒక సంస్థ అగ్ని ప్రమాదాలలో సహాయక చర్యలు అందించే రోబో వాహనాలను రూపొందించడం ప్రారంభించింది. ఈ రోబో వాహనాలకు చెందిన మరిన్ని విశయాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

అగ్ని మాపక విధులు నిర్వర్తించే వారు, వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కర్తవ్యం నిర్వర్తిస్తారు. ఇది వారి ప్రాణాలకు ఎంతో ముప్పు అంతే కాకుండా ఎక్కువం మందిని ప్రమాదాల నుండి రక్షించడానికి కూడా వీలుపడదు. ప్రత్యేకంగా దీనిని దృష్టిలో వీటిని రూపొందించారు.

ఈ రోబో వాహనాలను అగ్ని నిరోధక పదార్థాలతో తయారు చేశారు. అగ్ని ప్రమాదాలను నిలువరించడానికి ఈ రోబో వాహనాలు నిప్పుకు అతి సమీపంగా వెళ్లినప్పటికి ఏమాత్రం అగ్నికి ఆహుతి కావు.

ఈ రోబోలు 295 అడుగుల ఎత్తు గల మేడలలోని అగ్నిుప్రమాదాలను నివారించగలవు మరియు 197 అడుగుల దూరం వరకు ఫోమ్‌ను వెదజల్లగలవు. దీని కోసం ఈ రోబో వాహనాలలో ప్రత్యేకమైన కంప్రెసర్లను ఏర్పాటు చేశారు.

రోబో ను టర్బైన్ మీదు టర్బైన్ ఫ్యాన్‌కు అనుసంధానంతో అమర్చారు. అగ్ని అర్పే పదార్థాలను నిలువ చేసుకోవడానికి ప్రత్యేకమైన స్టోరేజ్ గదిని ఏర్పాటు చేశారు.

పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు దట్టమైన పొగలు కమ్ముకుంటాయి. ఈ వాయువులు పాయిజన్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ పొగ వలన మరణం సంభవించే అవకాశాలు కూడా ఎక్కువే. ఈ రోబో వాహనం అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో కమ్ముకున్న పొగను బయటికి నెట్టేయగలదు.

దీనిని పూర్తిగా రిమోట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. దాదాపుగా 500 మీటర్ల దూరం నుండి ఈ రోబో వాహనాన్ని నియంత్రించవచ్చు. తద్వారా అక్కడికి దగ్గరలో ఎవయినా పెద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటే దీనిని ఆపరేట్ వ్యక్తికి ఏమి జరగకుండా ఉంటుంది.

ఆస్ట్రేలియాలోని సౌత్ వేల్స్‌కు చెందిన ఫైర్ డిపార్ట్‌మెంట్ వారి కథనం ప్రకారం, అగ్ని మాపక శాఖ వారికి అతి కష్టతరమైన పని అగ్ని ప్రమాదాలలో సేవలు అందించటం. కారణం అత్యంత భయంకరమైన మంటల నుండి తమను తాము కాపాడుకుంటూ ఇతరులను కాపాడాల్సి ఉంటుందని తెలిపారు.

మీరు ఈ రోబో వాహనాన్ని గమనించిట్లయితే దీనికి ముందు భాగం డోజర్ బ్లేడ్‌ను అమర్చారు. ప్రమాద స్థలిలో ప్రేలుడు పదార్థావను ప్రక్కకు నెట్టుకుంటు ముందుకు వెళ్తుంది.

ఈ రోబోలో దాదాపుగా 75 లీటర్ల కెపాసిటి గల డీజల్ ట్యాంక్ గలదు. ఇది 30 డిగ్రీల వాలు తలంలో కూడా సమాతరంగా ప్రయాణించి సహాయక చర్యలలో పాల్గొంటుంది. ఇక 3.7-టన్నుల బరువున్న దీనిని పూర్తిగా రిమోటా ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

ఇది చీకటి లో కూడా ఎంతో చక్కగా విధులు నిర్వర్తిస్తుంది. ఎందుకంటే ఇది నాలుగు హెడ్‌లైట్లను, రెండు స్పాట్ లైట్లు, వార్నింగ్ లైట్లు వంటివి ఇందులో ఉన్నాయి.

దీని ఖరీదు ఎంతో తెలుసా ? దాదాపుగా 3.10 డాలర్లు దీని మీద పెట్డుబడి పెట్టినట్లు తెలిసింది.

- 7000 కార్లను కలిగి ఉన్న అత్యంత సంపన్నుడు సుల్తాన్ ఆఫ్ బ్రునెయి
- కారు డెలివరీ తీసుకునేప్పుడు ఇవి చెక్ చేయండి
- టాప్ 10 ఫ్యూచర్ మోటార్‌సైకిల్స్


Click it and Unblock the Notifications








