Glenn Maxwell ఆసిస్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కార్ కలెక్షన్ చూశారా.. ?
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) ఒక్కసారిగా వార్తల్లోకెక్కాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా చేజారిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించాడు. దీంతో మ్యాక్స్‌వెల్ ఒక్కసారిగా వార్తల్లో హైలెట్‌గా నిలిచాడు.
ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘాన్ జట్టు ఆస్ట్రేలియాకు 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే తొలిదశలో ఆసిస్ 18.3 ఓవర్లలో 91 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది. దీంతో ఆసిస్ ఓటమి ఖాయమని అందరూ భావించాడు. అయితే ఆ సమయంలో అద్భుతంగా రాణించిన మ్యాక్స్‌వెల్ 201 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

ఈ మ్యాచ్‌ను గెలవడంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో మ్యాక్స్‌వెల్ గురించి ఇంటర్నెట్‌లో తెగ వెతుకున్నారు. అతని భార్య, ఆస్తి, ఆదాయం సహా కార్లు ఇతర అంశాలను తెలుసుకొనేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. ఇతర క్రికెటర్లు, సెలబ్రిటీల మాదిరిగానే గ్లెన్ మాక్స్‌వెల్ కూడా ఖరీదైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. నిస్సాన్ మాక్సిమా సహా ఆడి Q7 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
నిస్సాన్ మాక్సిమా కారు (Nissan Maxima) రూ.31.12 లక్షల నుంచి 36.11 లక్షలకు విదేశీ మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కారు 3.5 లీటర్ DOHC V6 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 300hp శక్తి, 353Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. 8.5 కి.మీ -12.7 మైలేజీని ఇస్తుంది. 5 సీట్ల ఎంపికతోనూ ఈ కారు లభిస్తుంది.

ఈ కారు సిగ్నేచర్ LED DRL, ఇంటెలిజెంట్ ఆటో LED హెడ్‌లైట్, 19 అంగుళాల మెషిన్డ్ ఫినిషింగ్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్, ఇంటెలిజెంట్ అరౌండ్ వ్యూ మానిటర్, 7 అంగుళాల డ్రైవర్ అసిస్ట్ డిస్‌ప్లే, నిస్సాన్ డోర్ టూ డోర్ నావిగేషన్ వంటి అధునాతన ఫీచర్లను నిస్సాన్ మాక్సిమా కారు కలిగి ఉంది. డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్ సహా మరిన్ని కీలక ఫీచర్లను కలిగి ఉంది.
మాక్సివెల్ నిస్సాన్ కారు సహా ఆడి Q7 (Audi Q7).. భారత్ సహా విదేశీ మార్కెట్‌లో ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ కారు రూ.84.70 లక్షల నుంచి రూ.92.30 లక్షల ధరలో అందుబాటులో ఉంది. ఈ కారు 3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 340ps శక్తి, 500Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

ఆడి Q7 కారు 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, సన్‌రూఫ్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. దీంతోపాటు భద్రత కోసం 8 ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి వివిధ భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








