Video Viral వావ్‌.. ఏం ఐడియా గురూ... వేసవిలోనూ చల్లచల్లగా...!!

వేసవి కాలంలో ఎండ తీవ్రతకు భయపడి చాలా మంది తమ ప్రయాణాలు వాయిదా వేస్తుంటారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా చూసుకుంటారు. వృద్ధులు అయితే మరిన్ని జాగ్రత్తలు పడతారు. కానీ పెళ్లిళ్లు సహా ఇతర కార్యక్రమాల కోసం బయటకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

సొంత కార్లు, బైక్‌లు ఉన్న వారు ఎండ తీవ్రత పెరగక ముందే తాము వెళ్లాల్సిన చోటుకు చేరుకుంటారు. మిగిలిన వారు బస్సులు, ఆటోల్లో ప్రయాణించి వెళ్తుంటారు. అదే వేసవిలో ఆటో ప్రయాణం చేసేందుకు చాలా మంది భయపడుతుంటారు. ఎండ తీవ్రత, మరోవైపు అధిక సంఖ్యలో ప్రయాణికులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. దీంతో చాలా వరకు ఆటోలో ప్రయాణాలు చేసేందుకు ఇష్టపడరు.

auto driver fits cooler

దీనిపై ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. వేసవిలోనూ చెమట పట్టకుండా ప్రయాణించేలా తన ఆటోలో ఏర్పాట్లు చేశాడు. దీనిని చూసిన ప్రయాణికులు ఆటో డ్రైవర్‌ను మెచ్చుకుంటూనే.. అతని ఆటోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆటోకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు సదరు ఆటోడ్రైవర్‌ తెలివితేటలకు ఫిదా అవుతున్నారు. కామెంట్లలో తెగ పొగిడేస్తున్నారు. ప్రయాణికులనే కాకుండా నెటిజెన్లను ఆకట్టుకొనేలా ఆ ఆటో డ్రైవర్ ఏం చేశాడో చూద్దాం.

వేసవి కాలంలో ఆటో ప్రయాణించేందుకు చాలా మంది భయపడడాన్ని ఆటో డ్రైవర్‌ గుర్తించాడు. తన ఆటోలో ప్రయాణించేవారికి సౌకర్యవంతంగా ఉండేలా వెనుకవైపు ఓ కూలర్‌ను ఏర్పాటుచేశాడు. రోజులో ఎక్కువ ఎండ తీవ్రత ఉన్న సమయాల్లో కూలర్‌ ఆన్‌ చేసే వాడు. ఇలా తన వినూత్న ఆలోచనతో ప్రయాణికుల అవస్థలకు చెక్‌ పెట్టిన డ్రైవర్‌.. తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నాడు. నంబర్ ప్లే్ట్‌ను బట్టి ఆటో పంజాబ్‌కు చెందినదిగా తెలుస్తోంది.

ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. సుమారు కొన్ని లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. చాలా మంది వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇందులో కొన్ని సరదా వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.

'నేను ఇప్పటి వరకు ఓ తప్పుడు ఆటో డ్రైవర్‌కు డబ్బులిస్తున్నా..' అంటూ ఓ యూజర్‌ సరదాగా కామెంట్‌ చేశారు. 'ఈ ఆటో భారత్‌ దాటి బయటకు వెళ్లకూడదు' అని మరొకరు కామెంట్‌ చేశారు. 'విద్యుత్‌ కనెక్షన్‌ లేకుండా కూలర్ ఎలా అమర్చారు' అంటూ మరో ఇన్‌స్టా యూజర్‌ సందేహం వ్యక్తం చేశారు. 'కస్టమర్ల కేర్‌టేకర్‌' అంటూ మరొకరు కితాబిచ్చారు. 'కూలర్ కోసం 20 రూపాయల ఛార్జీ' అంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 6, 2023, 10:39 [IST]
English summary
Auto driver fits cooler to his vehicle video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+