Dog Stuck in Traffic ట్రాఫిక్‌లో ఆటోలో కుక్క హల్‌చల్‌.. వీడియోకు లక్షల్లో వ్యూస్‌..

మెట్రో పాలిటన్‌ నగరాల్లో ట్రాఫిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆఫీసులకు వెళ్లేవారు ఓ గంట ముందుగా ఇంటి నుంచి బయలు దేరితేనే సమయానికి చేరుకోగలం. లేదంటే రోడ్డుపై కిక్కిరిసిన వాహనాల మధ్య హారన్‌లు కొట్టుకుంటూ ట్రాఫిక్‌ క్లియర్‌ అయ్యేదాక ఎదురుచూడక తప్పదు.

ఇక బెంగళూరులో అయితే ట్రాఫిక్‌ను అధిగమించడం ఓ పెద్ద సాహసమే. ఆ సమయాల్లో ట్రాఫిక్‌ చిరాకు నుంచి బయటపడటానికి ఫోన్‌లో నిమగ్నమవడమో లేదా.. ఇష్టమైన పాటలు వింటూనో లేదా ఆఫీసు వర్క్‌ చేసుకుంటూనో సమయం గడిపేస్తారు. తాజాగా బెంగళూరు నగరంలోని ఓ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించినప్పుడు చోటు చేసుకున్న ఓ ఘటన నెటిజన్లను కదిలించింది.

dog stuck in traffic

బెంగళూరులో ఇటీవల ఓ రోజు ట్రాఫిక్‌లో ఆటో డ్రైవర్‌ కుక్కతో కనిపించిన వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. శునకాన్ని తన ఒడిలో పెట్టుకుని ట్రాఫిక్‌ జామ్‌లో వేచి ఉన్న దృశ్యాన్ని కొందరు తమ చరవాణీలలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

ఆటో డ్రైవర్‌ ఆ కుక్కను ఎలాంటి ఆటపట్టించకుండా చంటి పిల్లను చూసుకున్నట్లుగా ఎంతో గారాబంగా చూసుకోవడం చూపరులను కదిలించింది. ఈ వీడియోలో ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మనసుకు హత్తుకుంటుంది. ఎండ వేడిమి వల్ల అలిసిన ఆ శునకం ముఖాన్ని గుడ్డతో తుడిచి ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. ఈ దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ వీడియో లక్షల కొద్దీ వ్యూస్‌తో పాటు ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. అల్కా ఇటిస్‌ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్‌ చేశారు. బెంగళూరులో ఓ సాధారణ రోజు అని క్యాప్షన్‌ జత చేశారు. కాగా మండుటెండలలో మూగజీవులను ఇలా బయటకు తీసుకెళ్లడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు.

వీడియోను చూస్తే ఆటో డ్రైవర్ కాలక్షేపం కోసం కుక్కను బయటకు తీసుకువస్తున్నట్లుగా అనిపించడం లేదు. దాని పరిస్థితి చూస్తుంటే ఏదో అనారోగ్య సమస్యతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. కుక్కను ఆ డ్రైవర్‌ లాలన చేస్తున్న తీరు చూస్తుంటే బహుశా ఆస్పత్రికి తీసుకువెళ్తున్నారో అని సందేహాన్ని నెటిజన్లు వ్యక్తం చేశారు. లేదంటే ఈ మండుటెండలో ఎవరూ అలా బయటకు తీసుకురారు.

సాధారణంగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శునకాలు బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌, ఎక్కువ సేపు ఇలా ఎండలో ఉండటం వల్ల కూడా అది నీరసపడిపోయి ఉండొచ్చని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు అన్ని రకాల వాతావరణాలను తట్టుకునే సామర్థ్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఏది ఏమైనా ఆటో రంగానికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ముంబై రైలులో కుక్క ప్రయాణిస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. ఇది ఉదయం ఒక రైలులో ప్రయాణించి సాయంత్రం మరొక రైలులో స్టేషన్‌కు తిరిగి వచ్చేది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ కూడా వచ్చాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, May 27, 2023, 15:10 [IST]
English summary
Auto driver with dog got stuck in traffic jam in bangalore video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+