ఆటో ఇండస్ట్రీ : 5 మంది టాప్ లెవల్ ఎక్సిక్యూటివ్స్
ఆటో ఇండస్ట్రీలోని ప్రముఖ కంపెనీలు తమ ఉన్నత స్థాయి సిబ్బందిని మార్పు చేస్తూఉంది.
కొన్ని కారణాల వల్ల కొంత కాలంగా చాలా మంది టాప్ లెవల్ ఎక్సిక్యూటివ్స్ కొత్తగా చేరడం లేదా ఉన్నత స్థాయికి చేరడం జరిగింది.
ఆటో ఇండస్ట్రీ లోని 5 మంది టాప్ లెవల్ ఎక్సిక్యూటివ్స్ గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం.....

1. షిగేరు హయకవ, టయోటా :
షిగేరు హయకవ టయోటాలో 1977 నుంచి పనిచేస్తున్నారు. ఈయన యాఎస్ ఆపరేషన్స్‌తో మంచి సంభందాలు కలిగి ఉన్నారు. ఇటీవల జూలి హాంప్ డ్రగ్స్ కేసులో అరెస్టుకావడంతో ఆ పదివిని ఈయనకు అప్పగించారు.

2. కహెర్ ఖాజీం, జనరల్ మోటార్స్ :
కహెర్ ఖాజీం జనరల్ మోటార్స్ ఇండియా ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించబడ్డారు. ఖాజీం ఇంతకు ముందు హోల్డెన్‍లో ఇంజనీర్‍గా పనిచేశారు. ఖాజీం ప్రస్తుతం జనరల్ మోటార్స్ ఉబేకిస్తాన్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన ముంబైలోని టలిగాన్ దభాదే ప్లాంట్‌కు మారనున్నారు.

3. అరుణ్ సారిన్, ఓలా :
అరుణ్ సారిన్ ప్రముఖ క్యాబ్ ఓలాకు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించబడ్డారు. ఈయన ఇంతకు ముందు వొడాఫోన్ సంస్థల సీఈవోగా పనిచేశారు.

4. హర్‌దీప్ సింగ్ బ్రార్, జనరల్ మోటార్స్ :
హర్‌దీప్ సింగ్ బ్రార్, జనరల్ మోటార్స్ ఇండియాకు సేల్స్ ఉపాధ్యక్షులుగా నియమించబడ్డారు. ఈయన ఇంతకు ముందు ఫోక్స్‌వ్యాగన్ సంస్థలకు ఎక్సిక్యూటివ్‌గా పనిచేశారు.

5. జాక్ ఉప్పల్, జనరల్ మోటార్స్ :
జాక్ ఉప్పల్, జనరల్ మోటార్స్ ఇండియా మార్కెటింగ్ మరియు కస్టమర్ ఎక్స్ పీరియన్స్ ఉపాధ్యక్షులుగా నియమించబడ్డారు. ఈయన ఆగస్టు 1 నుంచి భాద్యతలు చేపట్టనున్నారు.
Also read : మరిన్ని ఆసక్తికరమైన విషయాలు


Click it and Unblock the Notifications








