ఒకే ఆటోలో 27 మంది ప్రయాణం.. అందులోనూ ఓవర్ స్పీడ్: చివరికి ఏమైందంటే?
సాధారణంగా బైకులో ఇద్దరు, ఆటో అయితే ముగ్గురు మరియు కారులో అయితే అందులోని సీట్లను బట్టి అంతమంది సులభంగా ప్రయాణిస్తారు. అయితే లెక్కకుమించి ఒక వాహనంలో ప్రయాణిస్తే.. అతి అత్యంత ప్రమాదానికి దారితీస్తుంది. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా జరిగాయి. అయితే అలాంటి సంఘటనే ఇప్పుడు మరొకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లోని బింద్కి కొత్వాలిలో, లాలౌలీ సర్కిల్ లో ఎక్కువ వేగంతో ఒక ఆటో వెళ్తోంది. దీనిని గమనించిన పోలీసులు ఆ ఆటోను ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఆటో డ్రైవర్ ఆపకుండా ముందుకు వెల్లిపోయాడు. అయితే పోలీసులు అంతటితో ఆగకుండా పోలీసులు ఆ ఆటోను వెంబడించి చివరికి నిలిపగలిగారు. అయితే ఆ ఆటోలో ఉన్న జనాభాను చూసి పోలీసులు ఒక్కసారిగా హవాక్కయ్యారు.

ఆ ఆటోలో ముగ్గురో, నలుగురో కాదు మొత్తం 27 మంది ఉన్నారు. పిల్లలు మరియు పెద్దలు మొత్తం 27 మంది ఒకే ఆటోలో ప్రయాణించడం చూసి పోలీసులు నిర్గాంతపోయారు. ఓవర్ స్పీడ్ మాత్రమే కాకుండా, ఓవర్ లోడ్ తో వెళ్లడం వల్ల పోలీసులు ఆ ఆటోను సీజ్ చేశారు.

బైండోవర్‌లో బక్రీద్ ప్రార్థనలు ముగించుకుని తిరుగుప్రయాణంలో వారందరూ ఒకే ఆటోలో వెళ్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో మీరు గమనించినట్లయితే, ఆటో డ్రైవర్ మరియు పెద్దవారు, వీరి మీద పిల్లలు కూర్చుని ఉన్నారు. పోలీసులు ఆపి వారందరిని దింపితే ఒకరి వెంట ఒకరు మొత్తం ఆ ఆటోలో నుంచి 27 మంది దిగారు.

ఈ వీడియోని ఇప్పటివరకు దాదాపు 30 లక్షలమంది చూసారు. అంతే కాకూండా దీనిపైనా చాలామంది కామెంట్స్ కూడా చేశారు. ఇందులో ఒకరు ఇది ఆటో కాదు 27 సీట్ల బస్సు అంటూ కామెంట్ చేశారు. మరొకరు గిన్నిస్ బుక్ రికార్డు ఇవ్వాలంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇంకొందరు ఈ ఆటోను మ్యూజియంలో పెట్టాలని కామెంట్స్ చేశారు.

పోలీసులు ఆ ఆటో డ్రైవర్ ని తీవ్రంగా మందలించారు. అయితే ప్రస్తుతానికి ఆటోని సీజ్ చేశారు. దీనిపైనా పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. ఇది నిజంగా చాలా ప్రమాదహేతువు, కావున పోలీసులు దీనిపైన తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

27 మంది ప్రయాణించే ఆటో పొరపాటున ప్రమాదానికి గురైతే, అందులో ఉన్నవారి పరిస్థితి ఏంటి? తలచుకుంటేనే ఒళ్ళు జిల్లుమంటుంది. అందులోనూ ఆ ఆటో డ్రైవర్ నిర్దిష్ట వేగముకంటే కూడా ఎక్కువ వేగంతో ప్రయాణించాడు. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయినప్పటికీ దీనిని ఎవరూ ప్రోత్సహించకూడదు.
#WATCH | Uttar Pradesh | Police seized an auto and imposed a fine of Rs 11,500 after 27 people were found traveling in it in the Bindki PS area of Fatehpur district, yesterday
— ANI UP/Uttarakhand (ANINewsUP) July 11, 2022
(Source: Viral video confirmed by police) pic.twitter.com/XeOwFcoQ0r
భారతదేశంలో రోజురోజుకి లెక్కకుమించిన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడమే. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండటానికి ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ చాలా మంది ప్రజలు వీటిని పాటించడం లేదు. ఈ కారణంగానే ప్రమాదాలు ఇప్పటికి కూడా తగ్గడం లేదు.
ఇదిలా ఉండగా యూపీలో వెలుగులోకి వచ్చిన మరో ఘటనలో ఒకే బైక్‌పై ఏడుగురు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పొలుసులు ఆ టూ వీలర్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బైక్ రైడింగ్ చేసే వ్యక్తి తప్పా మిగిలినవారు అన్దరూచిన్నపిల్లలు. బక్రీద్ సందర్భంగా పిల్లలకు ఐస్‌క్రీమ్ ఇప్పించేందుకు వెళ్తున్నట్లు, అందుకే అందరిని ఒకేసారి తీసుకెళ్తునని ఆ బైక్ రైడర్ చెప్పాడు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ఒక ఆటోలో 27 మంది ప్రయాణిస్తే ఎంతో డబ్బు మిగిల్చేస్తాము అనుకుంటారు. అయితే ఈ ప్రమాదంలో ఒక్క ప్రాణం పోయినా ఎవ్వరూ తిరిగి తీసుకురాలేదు. కావున ఇది గుర్తుంచుకొని తప్పకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక వాహనంలో ఎంతమంది వెళ్లగలరో అంతేముంది మాత్రమే వెళ్ళాలి. అప్పుడే ప్రమాదాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.ప్రజలు కూడా తప్పకుండా ట్రాఫిక్ నియమాలను పాటించాలి. అప్పుడే ఇది సాధ్యమౌతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మాత్రమే కాకుండా.. కొత్త కార్లు మరోయు కొత్త బైకులకు సంబంధించిన మరింత సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








