Just In
- 9 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 20 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 21 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 23 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Sports
IPL 2021: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం! ఆడేది అనుమానమే!
- News
కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా
- Finance
పదింటిలో 9 కంపెనీల్లో నియామకాల జోరు, ఐటీలో అదుర్స్
- Movies
మరోసారి నందమూరి హీరోతో బోయపాటి మూవీ: యాక్షన్ స్టోరీని రెడీ చేసిన మాస్ డైరెక్టర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నడిరోడ్డుపై జరిగిన ఈ సంఘటన చూస్తే ఒళ్ళు ఝల్లుమంటుంది.. కావాలంటే ఈ వీడియో చూడండి
రోజురోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల కొన్ని వేలమంది మరణిస్తున్నారు, అంతే కాకుండా ప్రమాదాల వల్ల చాల నష్టాలను కూడా చవి చూస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. భారతీయ రోడ్లపైనా కూడా నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన విషయాలు మీరు ఇది వరకటి కథనాలతో చదివి ఉంటారు.

రోడ్లపై ఎదో ఒక రకంగా ప్రమాదాలు సంభవించడం నిత్యజీవితంలో ఒకటిగా చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం ఒకటయితే, రోజు రోజుకి పెరుగుతున్న వాహనాలు కూడా మరొక కారణం అనే చెప్పాలి. వాహన తయారీదారు రోజు రోజుకి కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం కొన్ని వేళా సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి.

ఇక విషయంలోకి వస్తే, ఇటీవల ముంబైలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై అప్పుడప్పుడు వాహనదారుల మధ్య వాదనలు, గొడవలు చూసే ఉంటాం.. కానీ నేడు వాటి సంఖ్య మరీ ఎక్కువైంది. ముంబై నగరంలో ఆటో డ్రైవర్ మరియు ద్విచక్ర వాహన డ్రైవర్ మధ్య జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఆటో డ్రైవర్ మరియు ద్విచక్ర వాహన డ్రైవర్ మధ్య జరిగిన సంఘటన మణూకు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోలో ఆటో డ్రైవర్ మరియు ద్విచక్ర వాహనం చాలా బిజీగా ఉన్న రహదారిపై తీవ్ర వాదనకు దిగడం మనం చూడవచ్చు.

కొన్ని సెకన్ల తరువాత వారిద్దరి మధ్య సమస్య పరిష్కారమైనట్లు తెలుస్తోంది. తరువాత ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లడం కూడా మనం ఇక్కడ వీడియోలో గమనించవచ్చు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ అకస్మాత్తుగా తన ఆటోతో పక్కనే వస్తున్న గొడవపడిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు.
MOST READ:ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా ఒకే రోజులో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ; ఎంతో తెలుసా ?

ఇది ఆటో డ్రైవర్ యొక్క ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్య. ఆటో ఢీ కొట్టిన వెంటనే ద్విచక్ర వాహన డ్రైవర్ కింద పడిపోయాడు. కానీ అదేమీ పట్టించుకోకుండా ఆ ఆటో డ్రైవర్ ముందుకు వెళ్ళిపోతాడు. కానీ కిందపడిన ద్విచక్ర వాహన డ్రైవర్‌ను రక్షించడానికి పరిసరాల్లోని కొంతమంది పరుగెత్తుకుంటూ వచ్చారు. ఈ సంఘటనలో ఆ ద్విచక్ర వాహన డ్రైవర్ పెద్దగా గాయాలు కాలేదు. మొత్తానికి ద్విచక్ర వాహన డ్రైవర్ అదృష్టవశాత్తు తప్పించుకోగలిగాడు.

అక్కడ జరిగిన మొత్తం సంఘటన వీడియోలో రికార్డ్ చేయబడింది. ఈ వీడియో చూస్తే మీకు కూడా షాక్ గా అనిపిస్తుంది. ఈ వీడియో పోలీసులు దర్యాప్తు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు. పోలీసులకు పట్టుబడిన ఆ ఆటో డ్రైవర్ వయసు 34 సంవత్సరాలు.
MOST READ:రెండు గంటల్లోనే రూ.29.5 లక్షల జరిమానాలు, పోలీసుల రికార్డ్

అరెస్టు చేసిన ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నంతో సహా వివిధ సెక్షన్ల కింద విచారణ జరిగే అవకాశం ఉంది. ఆటో డ్రైవర్ పై ఏ నమోదు చేయబడిందో ఖచ్చితంగా తెలియదు. కానీ యితడు చేరిన పనికి ఖచ్చితంగా శిక్షపడే అవకాశం ఉంది.
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే అనవసరంగా ప్రమాదం భారిన పడే అవకాశం ఉందని ఈ వీడియో చూస్తే మనకు స్పష్టమవుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రశాంతమైన మనస్సులో ఉండటం ముఖ్యం.
MOST READ:దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

ఇతర వాహనదారులు పట్ల కూడా కొంత ప్రేమగా వ్యవహరించాలి, ఎంతుకంటే తోటి ప్రయాణికులు కూడా మనుషులే అన్న విషయం మరచిపోకూడదు. ఒక వేళా ఏదైనా చిన్న పొరపాటు జరిగితే పెద్ద గొడవలకు దిగటం అంత సమంజసం కాదు. ఒకవేళ గొడవ తీవ్రమవుతుందనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్ ని సందర్శించడం చాలా మంచిది.