గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన చెన్నై ఆటో రాజా: ఎందుకని ?
ఎందోరో ఆటో డ్రైవర్లు ఉంటారు. కాని కొంత మంది మాత్రమే ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. అందులో చెన్నైకి చెందిన వ్యక్తి జగతీష్ యమ్ ఒకడు. ఇతను అందరిలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావిస్తాడు.
అందులో భాగంగానే తన మూడు చక్రాల ఆటోను కేవలం రెండు చక్రాల మీద మాత్రమే నడిపి ప్రపంచ రికార్డును నెలకొల్పి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్నాడు.

ఈ యువ ఆటో డ్రైవర్ సాధించిన ఘనత గురించి తరువాత స్లైడర్ ద్వారా తెలుసుకోండి. చివరి స్లైడర్‌లో ఈ రికార్డుకు చెందిన వీడియో ఉంది.

ఈ యువ ఆటో డ్రైవర్ తమిళ రాష్ట్రానికి చెందిన చెన్నై వాసి

జగతీష్ కు చిన్నప్పటి నుండి బైక్ రైడింగ్స్ అంటే అమితాబిమానం ఉండేది.

వృత్తి రీత్యా ఇతను ఆటో నడపడం వలన ఈ ఆటోను కాస్త కొత్తగా నడపడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగానే ఈ రికార్డును నెలకొల్పాడు.

మామూలుగా మూడు చక్రాల ఆటోను రెండు చక్రాల మీద ఒక కిలో మీటర్ వరకు నడపావలనేది రూల్ అయితే ఇతను 2.2 కిలోమీటర్లు సునాయాసంగా నడిపాడు.

జగతీష్ యమ్ వయస్సు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే.

జగతీష్ ఈ మూడు చక్రాల ఆటోను గంటకు 80 కిలో మీటర్లు అంటే గంటకు 50 మైళ్ళ వేగంతో కేవలం రెండు చక్రాల మీద నడిపి ఔరా అనిపించుకున్నాడు.

ఈ ఛాలెంజ్‌ను జగతీష్ ముంబాయ్ లోని జుహు ఏరోడ్రోమ్ లో స్వీకరించాడు.

ఇక్కడ ఉన్న ఫోటోను గమనించండి. తన బరువుతో ఆటోను బ్యాలెన్స్ చేస్తూ ఎలా ఫోజ్ ఇస్తున్నాడో.
ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి జగతీష్ చేసిన సాహసాన్ని తిలకించండి. మన భారతీయుల గొప్ప తనాన్ని చాటిన ఈ కుర్రాడికి హ్యాట్సాఫ్ చెప్పండి.

- పార్కింగ్ ఫీజులతో హడలెత్తిపోతున్న ఢిల్లీ నగర వాసులు...


Click it and Unblock the Notifications