కరోనా రోగులకోసం అంబులెన్సులుగా మారిన ఆటో రిక్షాలు.. ఎక్కడనుకుంటున్నారా..!

దేశవ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ చాలా వేగంగా, చాలా ఎక్కువగా వ్యాపించింది. కరోనా వైరస్ ప్రభావం వల్ల ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన ప్రజలు ఎక్కువగా శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. ప్రతిరోజూ దేశం మొత్తం దాదాపు 3,00,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువగా వుంది.

కరోనా రోగులకోసం అంబులెన్సులుగా మారిన ఆటో రిక్షాలు.. ఎక్కడనుకుంటున్నారా..!

పెరుగుతున్న రోగులకు ఆక్సిజన్ అందకపోవడంతో చాలామంది చనిపోతున్నారు. భారతదేశంలో ఇంత క్లిష్టపరిస్థితి నెలకొనడం వల్ల ఇతరదేశాల కూడా మనదేశానికి సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. భారతదేశానికి సాయం చేయడానికి చాలా దేశాలు సహకరిస్తున్నాయి. అమెరికా వంటి అగ్ర దేశాలు కూడా మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లను ఓడల్లో మరియు విమానాల ద్వారా సరఫరా చేస్తున్నాయి.

కరోనా రోగులకోసం అంబులెన్సులుగా మారిన ఆటో రిక్షాలు.. ఎక్కడనుకుంటున్నారా..!

కరోనా రోగుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న కారణంగా అంబులెన్సులు కొరత కూడా ఎక్కువగా ఉంది. భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుండి అంబులెన్సులు, హాస్పిటల్స్ లో బెడ్లు మరియు ఆక్సిజన్ వంటి వాటికి చాలా కొరత ఏర్పడింది. ఈ కొరత భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది.

MOST READ:వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

కరోనా రోగులకోసం అంబులెన్సులుగా మారిన ఆటో రిక్షాలు.. ఎక్కడనుకుంటున్నారా..!

దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొండటం వల్ల చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వాహనాలను అంబులెన్సులుగా మార్చి ప్రజలకు సాయం చేస్తున్నారు. ఇటువంటి వాహనాల్లో ఆక్సిజన్ వంటి అవసరమైన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

కరోనా రోగులకోసం అంబులెన్సులుగా మారిన ఆటో రిక్షాలు.. ఎక్కడనుకుంటున్నారా..!

అయితే ఇటీవల కాలంలో మహారాష్ట్రలోని పూణేలో కొంతమంది వాహనదారులు తమ ఆటోరిక్షాలకు ఆక్సిజన్ సిలిండర్లు అమర్చి కరోనా రోగులకు అనుకూలంగా ఉండేవిధంగా మార్చారు. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండటంతో, చాలా మంది వాహనదారులు తమవంతు సాయంగా ముందుకు వస్తున్నారు.

MOST READ:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

కరోనా రోగులకోసం అంబులెన్సులుగా మారిన ఆటో రిక్షాలు.. ఎక్కడనుకుంటున్నారా..!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. పూణేలో కూడా బెడ్లు, మెడికల్ పరికరాలు, ఆక్సిజన్ వంటి సదుపాయాలకు కొరత ఉంది. కావున పూణేలోని ఆటో డ్రైవర్లు తమ ఆటోరిక్షాలను తాత్కాలిక ఆక్సిజన్ అంబులెన్స్‌లుగా మారుస్తున్నారు.

కరోనా రోగులకోసం అంబులెన్సులుగా మారిన ఆటో రిక్షాలు.. ఎక్కడనుకుంటున్నారా..!

అంబులెన్స్‌లుగా మారిన ఆటోల యజమానులు, వాటిలో ఉన్న ఆక్సిజన్, రోగులకు కనీసం 6 నుండి 7 గంటలు ఆక్సిజన్‌ను అందిస్తుందని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం మన బెంగళూరులో కూడా ఇటీవల ఆక్సిజన్ బస్సులను ప్రారంభించింది. మనకు సమీపంలో ఉన్న తమిళనాడులోని చెన్నై మెట్రోపాలిటన్ పోలీసుల కొత్త కమిషనర్ 250 కార్లను ప్రత్యేక కార్ అంబులెన్స్‌లుగా మార్చారు.

MOST READ:తోటి వ్యక్తి అంత్యక్రియలకు నిరాకరించిన గ్రామస్థులు.. పిఎఫ్‌ఐ టీమ్ రాకతో కథ సుఖాంతం

కరోనా రోగులకోసం అంబులెన్సులుగా మారిన ఆటో రిక్షాలు.. ఎక్కడనుకుంటున్నారా..!

భయంకరమైన మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తున్న కారణంగా దేశంలోని చాలామంది ప్రజలు తమవంతు సహాయం చేయడానికి నిస్వార్థంగా ముందుకు వస్తున్నారు. దీనికి సంబంధించిన చాలా విషయాలను ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కరోనా ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలు వీలైనంత వరకూ ఇంటినుంచి బయటకు రాకుండా ఉండాలి.

Most Read Articles

English summary
Auto Rickshaws Converted As Ambulance In Pune. Read in Telugu.
Story first published: Saturday, May 15, 2021, 17:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X