తప్పిన భారీ రైలు ప్రమాదం.. ఆ టెక్నాలజీ అలర్ట్ చేయకపోతే వందల ప్రాణాలు పోయేవి!
ఢిల్లీ సమీపంలో సీమాంచల్ ఎక్స్ ప్రెస్ (Seemanchal Express)కి భారీ ప్రమాదం తప్పింది. ప్రత్యేక ఆటోమేటెడ్ టెక్నాలజీతో అప్రమత్తం చేయడంతో ఈ ప్రమాదం తప్పింది. దీని వల్ల ఎంతో మంది ప్రాణాలను అధికారులు కాపాడగలిగారు. ఈ సంఘటన ఎలా జరిగింది. ప్రమాదాన్ని నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
శనివారం ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి బిహార్ లోని జోగ్‌బనీకి సీమాంచల్ ఎక్స్ ప్రెస్ వెళ్తోంది. సరిగ్గా ఈ ఎక్స్‌ప్రెస్ రైలు యూపీలోని మీర్జాపూర్ వైపుగా వెళ్తుండగా.. రైలులోని ఎస్ 3 బోగీలో సమస్య ఏర్పడింది. కానీ రైల్వే అధికారులకు ఈ విషయం తెలియదు.

దీంతో ఎస్ 3 కంపార్ట్‌మెంట్ కింద చక్రాలు పూర్తిగా వేడెక్కాయి. అయితే రైలు చక్రాలు ఓవర్ హీటింగ్‌ని పర్యవేక్షించడానికి హీట్ మానిటరింగ్ డివైజెస్ ఉంటాయి.
ఈ మానిటరింగ్ పరికరాలు ఆటోమెటెడ్ టెక్నాలజీ ద్వారా రైళ్ల చక్రాలు వేడెక్కినట్లు గమనిస్తే వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తాయి. ఈ కేసులోనూ రైలు చునార్ రైల్వే స్టేషన్‌కి చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేసిన మానిటరింగ్ డివైజ్ దానిని గుర్తించి వెంటనే అలర్ట్ జారీ చేసింది. దీంతో షాక్‌కి గురైన అధికారులు వెంటనే రైలును పక్కనే ఉన్న రైల్వేస్టేషన్‌లో ఆపేందుకు ఏర్పాట్లు చేశారు.

దీంతో రైలును జిగినా రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. అనంతరం ప్రమాదానికి గురైన బోగీని గుర్తించి రైలు నుంచి తొలగించారు. మిగిలిన బోగీలను రైలుకు జతచేసి ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్‌కి తరలించారు. కోచ్ స్థానంలో కొత్త బోగీని ఏర్పాటు చేసి రైలు తన ప్రయాణాన్ని కొనసాగించింది. దీంతో రైలు సుమారు 5 గంటలు ఆలస్యంగా నడిచింది.
రైల్వే ట్రాక్‌ల సమీపంలో హీట్ యాక్సిల్ బాక్స్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. రైలు పట్టాలపై వెళుతున్నప్పుడు యాక్సిల్ ప్రాంతంలో ఎక్కువ వేడి ఉంటే రియల్ టైమ్‌లో రైలును అప్రమత్తం చేయడానికి ఈ ట్రాక్ మానిటరింగ్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. సాధారణంగా, రైలు యాక్సిల్ ప్రాంతం వేడిని పర్యవేక్షించడానికి ఇతర పరికరాలు లేవు. ఈ రకమైన సమస్య కొన్నిసార్లు మాత్రమే సంభవిస్తుంది.
ముఖ్యంగా రైల్ ఓవర్ లోడ్ అయినప్పుడు, వీల్ బేరింగ్‌లో లోపం ఉన్నట్లయితే లేదా మరేదైనా మెకానికల్ సమస్య ఉన్నట్లయితే ఇది జరగవచ్చు. సాధారణంగా వీల్ బేరింగ్ మరియు చక్రం మధ్య సరైన ఘర్షణ లేకపోతే కూడా ఇటువంటి సమస్యలు సంభవించవచ్చు. ఈ ఓవర్ హీటింగ్ మొత్తం రైల్ యాక్సిల్ ప్రాంతం వేడెక్కడం ద్వారా అవి కాస్త మంటలుగా మారి పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు.
ఇలా జరిగినప్పుడు రైలు పట్టాలు తప్పే అవకాశం కూడా ఉంది. ఈ కేసులో ఆ పరికరం వెంటనే ఈ హెచ్చరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ హెచ్చరిక రాకపోతే రైలు ప్రయాణం కొనసాగించి ఓవర్ హీట్ అయి రైలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండేంది. దీని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.
రైలు యాక్సిల్స్ విపరీతమైన వేడిమి ద్వారా వేడెక్కడం ఇదే మొదటిసారి కాదు. 2020-21లో భారతదేశం అంతటా ఇలాంటి సంఘటనలు ఏడు జరిగాయి. గూడ్స్ రైళ్లు ఎక్కువగా ఇలాంటి ప్రమాదలకు గురవుతున్నాయి. 2021-22లో 9 ఘటనలు జరిగాయి. 2022-23లో 14 ఘటనలు జరిగాయి. 2023-24లో ఒకే ఒక్క ఘటన జరిగింది. 2024-25లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.
భారతదేశంలో రైలు సేవలు ప్రధానమైనవిగా ఉన్నాయి. అదే సమయంలో, సురక్షితమైన సేవలను అందించడానికి ఇటువంటి సాంకేతిక అవసరం. రైల్వే శాఖ ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. భారతదేశం అంతటా ఈ సాంకేతికత ద్వారా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. తాజా ఘటన ఈ సంవత్సరంలో ఓ కేస్ స్టడీగా అధికారులు భావిస్తున్నారు. ప్రమాదల నివారణ కోసం ఇలాంటి మరెన్నో సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తామని అంటున్నారు.


Click it and Unblock the Notifications








