బడ్జెట్‌లో EVల తయారీకి బూస్టింగ్‌ ఇస్తారా.. అసలు ఆటోమొబైల్‌ పరిశ్రమ ఏం కోరుకుంటోంది..??

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏటా కూడా బడ్జెట్‌ను (Union Budget 2024) ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే అన్నిరంగాలతోపాటు ఆటోమొబైల్‌ రంగం కూడా ఈ బడ్జెట్‌లో ఎన్నో ఆశలు పెట్టుకుంది.

ఆటోమొబైల్‌ రంగంపై వరాలు కురిపిస్తారా? : ఎలక్షన్లకు ముందు వచ్చే బడ్జెట్‌ కనుక సంక్షేమంతోపాటు ప్రాధాన్య రంగాలు సహా ఆటోమొబైల్‌ పరిశ్రమపై (Automobile Wishlist)
ప్రత్యేక శద్ర చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహన రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల తయారీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.

expectations on union Budget 2024

ఫేమ్ సబ్సిడిలో మార్పులు చేస్తారా? : ఫలితంగా ఈ రంగాలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత లభిస్తుందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు FAME కింద సబ్సిడి అందిస్తోంది. అయితే కొన్నినెలల క్రిందట ఈ సబ్సిడీలో కొంతమేర కొత విధించింది. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.2000 కోట్లలో రూ.1600 కోట్లను ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల కోసం కేటాయించినట్లు తెలుస్తోంది.

ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలు : అయితే పెద్ద ఎత్తున ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడం ప్రస్తుతం సవాల్‌గా మారింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలు ఒక అడుగు ముందుకు వేసి ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే బడ్జెట్ కేటాయింపులు ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలపై ప్రభావం చూపించనున్నాయి.

effect of union Budget 2024 on EV sector

GST శ్లాబును మార్చాలని డిమాండ్లు : దీంతోపాటు ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలపై GST అధికంగా ఉందని GST శ్లాబును మార్చాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు పెరిగే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. అయితే దీనిపై బడ్జెట్‌ సందర్భంగా అనుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.

బ్యాటరీ తయారీని ప్రోత్సహించే ప్రకటనలు? : దీంతోపాటు భారత్‌లో బ్యాటరీల తయారీ ప్లాంట్‌లను ప్రోత్సహించే విధంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరియు ఎలక్ట్రిక్‌ వాహనాల లైసెన్స్‌, భద్రతా ఫీచర్లు, భీమా వంటి అంశాలపై సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు.

automobile industry wish list on union Budget 2024

భారత్‌లో గత కొంత కాలంగా ఎలక్ట్రిక్‌ వాహనాల రంగం అభివృద్ధి చెందుతోంది. ప్రతి సంవత్సరం విక్రయాలు పెరుగుతున్నాయి. కార్లు కంటే ద్విచక్ర వాహనాల విక్రయాలు అత్యధికంగా ఉన్నాయి. అయితే కార్ల విక్రయాలు కూడా వృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. బడ్జెట్‌లో సానుకూల ప్రకటన కోసం ఆటోమొబైల్‌ రంగం ఎదురుచూస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Saturday, January 27, 2024, 16:55 [IST]
English summary
Automobile industry wish list on union budget 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+