కార్లు, బైక్‌ల అమ్మకాలు లేకపోతే దేశం దివాలా తీస్తుందా? దీని వెనక ఉన్న అసలు నిజాలు ఇవే!

భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో ఆటోమొబైల్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది దేశ జీడీపీకి మరియు గణనీయమైన ఉపాధి అవకాశాల కోసం దోహదం చేస్తుంది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, వివిధ అనుబంధ పరిశ్రమలకు ఆసరాగా నిలుస్తూ పారిశ్రామికాభివృద్ధికి ఈ రంగం ప్రధాన చోదకశక్తిగా ఉంది. దేశ జీడీపీకి ఆటోమొబైల్ రంగం పరోక్షంగా, ప్రత్యక్షంగా దోహదపడుతుంది. ఈ రంగం మొత్తం జీడీపీలో 7% వాటాను కలిగి ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థలో దాని ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ పరిశ్రమ భారతదేశ విదేశీ మారక నిల్వలను పెంచుతుంది. అంతే కాకుండా భారీ ఎగుమతుల ద్వారా రెట్టింపు ఆదాయాన్ని సృష్టిస్తుంది.

భారత ఆటోమోటివ్ పరిశ్రమ: ఆటోమొబైల్ రంగం భారతదేశ వృద్ధికి ప్రత్యక్షంగా పనిచేస్తుంది. ఇది స్టీల్‌, రబ్బరు, గాజు మరియు ఎలక్ట్రానిక్స్ వంటి సంబంధిత పరిశ్రమలతో కలిసి దేశీయంగా భారీ వృద్ధిని నమోదు చేస్తుంది. ఆటోమొబైల్ రంగం కారణంగా ఇతర రంగాలు కూడా గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ఈ పరస్పర అనుసంధానం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది.

భారతదేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలోనే ఆటోమోటివ్ పరిశ్రమ మంచి ఉపాధి వనరుగా ఉంది. ఈ రంగం ద్వారా 3.5 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురికి సంబంధిత రంగాల ద్వారా ఉపాధి దక్కుతోంది. ఉద్యోగాల కల్పన భారత దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి మరియు దేశవ్యాప్తంగా కుటుంబాల ఆదాయాన్ని పెంచడానికి ఈ రంగం సహాయపడుతుంది.

Automotive-Industry-Is-The-Key-For-The-GDP Growth

వీటితో పాటు నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం పరిశ్రమ విద్య, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ కార్యక్రమాలు అవసరమైన నైపుణ్యాలతో కార్మికులను అభివృద్ధి చేయడానికి మరియు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని గుర్తించడానికి సహాయపడనున్నాయి. ఫలితంగా ఆటోమొబైల్ పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్‌తో సమానంగా ఎదుగుతోంది. దీంతో ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది.

ఆటోమొబైల్ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు, ఇతర సాంకేతిక టెక్నాలజీ ఈ రంగం అభివృద్ధికి కారణమయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక వాహనాలను అభివృద్ధి చేసేందుకు కంపెనీలు రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (R&D)లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీని ద్వారా సృజనాత్మకతపై దృష్టి పెడుతూనే.. నాణ్యతను మెరుగుపరచిదేంకు నూతన ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి.

Automotive-Industry-GDP Growth

ఈ ప్రయత్నాల్లో అనేక విజయాలు సాధించినప్పటికీ ఆటోమొబైల్ రంగం ఇంకా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. రెగ్యులేటరీ మార్పులు, అస్థిర ఇంధన ధరలు మరియు పర్యావరణ ఆందోళనలు, ఇతర అంతరాయాలను ఈ రంగాన్ని వెనక్కి లాగుతున్నాయి. అయితే దేశంలో పర్యావరణ నిబంధనలు కఠినతరం కావడంతో ఇప్పుడు వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఫలితంగా ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి.

ఈ కొత్త మార్పుల వల్ల భారత ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగాల్లో నిరంతర పెట్టుబడులతో ఈ రంగం సుస్థిర వృద్ధి సాధించనుంది. 'మేక్ ఇన్ ఇండియా' వంటి ప్రభుత్వ కార్యక్రమాలు దేశీయ తయారీని ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ మార్గాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.

భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఆటోమొబైల్ రంగం ఓ ప్రధాన వనరుగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఉద్యోగాల కల్పన, సాంకేతిక టెక్నాలజీతో ఉత్పత్తులను అందించడం, ఎగుమతుల ద్వారా భారీ ఆదాయాలను రప్పించడంలో ఈ రంగం మూలస్తంభంగా ఉంది. అయితే ఈ సారి బడ్జెట్‌లో ఈ రంగానికి సంబంధించి ఎటువంటి కేటాయింపులు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 3, 2024, 11:21 [IST]
English summary
Automotive industry is the one of the main asset in the indias gdp growth after independence
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+