బుల్లితెర నటి 'అవనీత్ కౌర్' కొత్త కార్.. చూస్తే మైండ్ బ్లోయింగ్
సాధారణంగా రాజకీయ నాయకులు, క్రికెటర్లు మరియు సినీ పరిశ్రమలోని వారు ఎక్కువగా ఖరీదైన మరియు విలాసవంతమైన లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల బుల్లితెర నటి 'అవనీత్ కౌర్' ఖరీదైన 'ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్' (Land Rover Range Rover Velar) కారును కొనుగోలు చేసింది. ఈ ఎస్‌యూవీ ధర అక్షరాలా రూ. 86.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

అవనీత్ కౌర్ కొనుగోలు చేసిన ఈ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్ కి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా కొత్త కారుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఇది నా కల నెరవేరిన సంవత్సరం అని చెప్పుకొచ్చింది. లగ్జరీ కారు కొన్న అవనీత్‌కు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అవనీత్ కౌర్ ఎనిమిదేళ్ల వయసులో 2012లో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె డ్యాన్స్ రియాలిటీ షోలో, ఆ తర్వాత అనేక టీవీ షోలలో పాల్గొని ఎక్కువ పాపులర్ అయ్యింది. ఈమె ఇటీవల కాలంలోనే హీరోయిన్ గా కూడా అరంగేట్రం చేసింది. కంగనా రనౌత్ నిర్మించిన టికు వెడ్స్ షెరు సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ సరసన కౌర్ నటించింది. మొత్తానికి ఇప్పుడు నీ కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది.

అవనీత్ కౌర్ కొనుగోలు చేసిన వైట్ కలర్ ల్యాండ్ రోవర్ వెలార్ లగ్జరీ ఎస్‌యూవీని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎస్‌యూవీ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి చాలా లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. కావున దీనిని ఎక్కువమంది ఇష్టపడతారు.

ల్యాండ్ రోవర్ వెలార్ భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. కానీ అవనీత్ కౌర్ కొనుగోలు చేసిన ఈ వైట్ కలర్ ల్యాండ్ రోవర్ వెలార్ ఈ ఇంజిన్ ఆప్సన్ పొందుతుంది అనే విషయం స్పష్టంగా తెలియదు.

కొత్త ల్యాండ్ రోవర్ వెలార్ 3డి సరౌండ్ కెమెరా, ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్, పిఎమ్ 2.5 ఫిల్టర్‌తో క్యాబిన్ ఎయిర్ వంటి అనేక కొత్త ఫీచర్లను పొందుతుంది. అంతే కాకుండా ఈ ఎస్‌యూవీ 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది.

అవనీత్ కౌర్ కొనుగోలు చేసిన ఈ ఎస్‌యూవీ ఫుజి వైట్ కలర్ లో ఉంది. ఇది ఫుజి వైట్ కలర్ లో మాత్రమే కాకుండా పోర్టోఫినో బ్లూ, శాంటోరిని బ్లాక్ మరియు సిలికాన్ సిల్వర్ వంటి కలర్స్ లో కూడా అందుబటులో ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

రేంజ్ రోవర్ వెలార్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.0-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ల ఎంపికతో అందుబాటులో ఉంది. ఇందులోని పెట్రోల్ ఇంజిన్ 247 బిహెచ్‌పి పవర్ మరియు 365 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 177 బిహెచ్‌పి పవర్ మరియు 430 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజన్లు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

ల్యాండ్ రోవర్ వెలార్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది కంపెనీ యొక్క అత్యంత దూకుడుగా కనిపించే వాహనాలలో ఒకటి. కంపెనీ ప్రధానంగా దాని విజువల్స్ మరియు డిజైన్ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. వెలార్ యొక్క హెడ్‌లైట్‌లు లేజర్ టెక్నాలజీని పొందుతాయి. అంతే కాకూండా ఇది ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లను కూడా పొందుతాయి. ఫ్రంట్ గ్రిల్ ముందు నుండి చాలా పెద్దదిగా కనిపిస్తుంది.

ల్యాండ్ రోవర్ వెలార్ భారతీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ ఎక్స్5 (BMW X5), ఆడి క్యూ7 (Audi Q7), వోల్వో ఎక్స్సి90 (Volvo XC90), జాగ్వార్ ఎఫ్-పేస్ (Jaguar F-Pace) మరియు పోర్స్చే మకాన్ (Porsche Macan) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే దేశీయ మార్కెట్లో ల్యాండ్ రోవర్ వెలార్ వంటి లగ్జరీ కార్లు ఎక్కువ ధర కలిగిన కారణంగా ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయరు.


Click it and Unblock the Notifications








