సమ్మర్‌లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఈ సారి ఓ నెల ముందుగానే వచ్చాడు. మార్చి నెల మొదటి నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో(Car Precautions For Summer) ఉష్ణోగ్రతలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇక ఈ సమయాల్లో వాహనాల్లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉంటాయి.

ఈ సారి వానలు తక్కువగా పడటంతో పొడి వాతావరణం కారణంగా ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయాల్లో కార్లలో ప్రయాణించేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో కార్లలో ఉంచకూడని వస్తువులు ఉంచినట్లయితే వాహనాలు పేలిపోయే ప్రమాదం ఉంది. రోడ్డుపై ప్రయాణిస్తుండగానే సడెన్‌గా కారు ఇంజిన్‌లో మంటలు ఎగిసిపడటం, అద్దాలు పగిలిపోవడం లాంటి సంఘటనలు చూస్తుంటాం.

Things-Should-Not-Be-In-Car-In-Summer

ఇలా జరగడానికి కొన్ని సార్లు ఇంజిన్‌లో సమస్యలు కారణమైనా.. మరి కొన్ని సందర్భాల్లో మానవ తప్పిదాలు కూడా కారణమవుతుంటాయి. మీరు పట్టించుకోకుండా వదిలేసే చిన్న చిన్న విషయాల కారణంగానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే(Tips To Car Owners In Summer) కొన్ని ముందు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు ఆటో నిపుణులు. అవేంటంటే...

వీటిని కారులో ఉంచకండి: సమ్మర్‌లో ఎక్కువగా చాలా మంది సన్‌ గ్లాసెస్‌ ధరిస్తుంటారు. వీటి ద్వారా సూర్యరశ్మి నుంచి కళ్లను కాపాడుకుంటారు. అయితే కారు నడిపేవారు కూడా ఎక్కువగా వీటిని ధరిస్తుంటారు. జర్నీ చేస్తుండగా లేదా విరామం సమయంలో ఒక్కోసారి సన్‌గ్లాసెస్‌ను డ్యాష్‌బోర్డ్‌పై పెడుతుంటారు. దీని ద్వారా మీరు కారును ఎండలో పార్క్‌ చేసినప్పుడు అవి భూతద్దంలా పనిచేసి కాలిపోతాయి.

Things-Should-Not-Be-In-Car-In-Summer

సెంట్లు, స్ప్రే క్యాన్లు: ప్లాస్టిక్‌ ఫ్రేమ్‌ కళ్లజోడు అయితే ఎండతాపానికి కరిగిపోతుంది. తద్వారా కారు లోపలి భాగంలో ప్రమాదాలు జరుగుతాయి. కావున మీరు సమ్మర్‌లో కూలింగ్ గ్లాసెస్‌ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా సెంట్లు, స్ప్రే క్యాన్ల లాంటివి కూడా కారు క్యాబిన్‌లో ఉంచకూడదు. వీటిలోని స్పిరిట్‌ కారణంగా వేడి తాపానికి ఇవి పేలే ప్రమాదం ఉంటుంది.

లైటర్స్‌, బ్యాటరీలు: సిగరెట్‌ తాగే అలవాటు ఉన్నవారు ఎక్కువగా తమ పాకెట్లలో లైటర్‌లను ఉంచుకుంటారు. కారులో ప్రయాణించేటప్పుడు ఒక్కోసారి మరిచిపోయి డ్యాష్‌బోర్డ్‌పై పెట్టేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం ద్వారా ఎండ తాపం ఎక్కువైనప్పుడు లైటర్‌ నుంచి మంటలు వెలువడే అవకాశం ఉంటుంది.

Things-Should-Not-Be-In-Car-In-Summer

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సమ్మర్‌లో మీరు కారులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించిన లేదా కొత్త బ్యాటరీలను పెట్టకూడదు. వేడి ఉష్ణోగ్రతలు ఎక్కువైతే బ్యాటరీలు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. వీటిలోని పాయిజనస్‌ యాసిడ్ల కారణంగా కారు ఇంటీరియర్‌ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.

వీటితో పాటు మేకప్‌ సామగ్రి, కొవ్వొత్తులు, మద్యం, హ్యాండ్‌ శానిటైజర్ల లాంటి వాటిని ఎండ వేడి తగిలే చోట ఎట్టి పరిస్థితిలో కూడా ఉంచకూడదు. మద్యం, హ్యాండ్‌ శానిటైజర్లలోని ఆల్కహాల్‌.. వేడి ఉష్ణోగ్రతలకు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అధిక టెంపరేచర్ల వద్ద కొవ్వొత్తులు, మేకప్‌ సామగ్రికి మండే స్వభావం ఉంటుంది. కావున వీటికి దూరంగా ఉండాలి.

Things-Should-Not-Be-In-Car-In-Summer

చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు: ఈ జాగ్రత్తలతో పాటు వాహనదారులు మరికొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. వేసవిలో చాలామంది బీచ్‌ లాంటి సముద్ర తీర ప్రాంతాలకు ఫ్యామిలీతో కలిసి లాంగ్‌ టూర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో తమ వెంట చిన్న పిల్లలు ఇంకా పెంపుడు కుక్క పిల్లలను కూడా తీసుకువెళ్తుంటారు. దీంతో వారు పిల్లలను కారులో వదిలేసి వెళ్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం.

అధిక టెంపరేచర్ల కారణంగా.. చిన్న పిల్లలను, ఇంకా పెంపుడు జంతువులను కార్లలో వదిలేయకుండా ఉండటం మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా సన్‌స్క్రీన్‌లు, మెడిసిన్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఉంచకూడదు. సముద్ర స్నానాలు చేసిన తర్వాత తడిసిన టవల్స్‌ను కారులో వదిలేయకండి. దీని ద్వారా ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తుంది. ఇలాంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా మీరు సమ్మర్‌ జర్నీని జాలీగా ఆస్వాదించవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, March 28, 2024, 15:53 [IST]
English summary
Avoid these things in your car during summer to protect from fire accidents
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+