అయోధ్య వాటర్ మెట్రో.. ప్రత్యేకతలు ఏంటి.. ఎప్పుడు ప్రారంభం కానుంది?
అయోధ్యలో రామమందిర నిర్మాణం (Ayodhya Ram Mandir) తుదిదశకు చేరుకుంది. మిగిలిన పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. మందిరం ప్రారంభం దృష్ట్యా రద్దీ నేపథ్యంలో ప్రజా రవాణాను మెరుగు పరుస్తున్నారు. ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. నూతన విమానాశ్రయాలు, వాటర్ మెట్రో వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు.
అయోధ్య విమానాశ్రయం డిసెంబర్ 25 ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్ నుంచి డిసెంబర్ 30న తొలి విమానం టేకాఫ్ కానుందని సమాచారం. త్వరలో అయోధ్యలోని సరయూ నదిపై వాటర్ మెట్రో (Ayodhya Water Metro) నడవనుంది. ఈ తరహా వాటర్ మెట్రోను దేశంలోనే తొలిసారిగా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో కొచ్చిలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇది తీర ప్రాంతాల ప్రజా రవాణా వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

నదీ తీర ప్రాంతాలను కలుపుతూ.. : వాటర్ మెట్రో (Water Metro) నది లేదా సముద్రంలో ప్రయాణం చేస్తుంది. తీర ప్రాంతాలు లేదా నదీ తీర పట్టణాలను కలుపుతూ ప్రయాణిస్తుంది. సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఈ వాటర్ మెట్రో కారణంగా ట్రాఫిక్ రద్దీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
విగ్రహ ప్రతిష్ఠ రోజునే ప్రారంభం : జనవరి 22 న అయోధ్య రామమందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఈ వేడుక అనంతరం ప్రధాని మోడీ వాటర్ మెట్రోను ప్రారంభించనున్నారు. గుప్తర్ ఘాట్ మరియు నరయు నదిపై రామ్‌కి పైడ్ మధ్య వాటప్ మెట్రో నడవనుంది. ఈ వాటర్ మెట్రోలో ఒకేసారి 50 మంది ప్రయాణం చేయవచ్చు. ఈ వాటర్ మెట్రో సోలార్ పవర్‌తో నడుస్తాయి.
వందే భారత్ సర్వీసులు కూడా ప్రారంభం : త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా అయోధ్య నుంచి లక్నో మీదుగా ఆనంద్ విహార్ ఢిల్లీ వరకు నడవనుంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయనుందని తెలుస్తోంది. డిసెంబర్ 16లోగా కొత్త రైలుకు సంబంధించి బోగీలు కేటాయింపు జరుగుతుందని సమాచారం.
ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కేవలం 8 గంటల్లో అయోధ్య నుంచి లక్నో మీదుగా ఆనంద్ విహార్ చేరుకుంటుంది. అయోధ్యలో ఈ రైలును నిలిపేందుకు ఎటువంటి ఏర్పాట్లు లేవు. కాబట్టి దీనిని ఆనంద్ విహార్ వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా ఏసీ, ఆటోమేటిక్ డోర్‌లతో సహా అత్యాధునిక సౌకర్యాలతో అమర్చబడి ఉంటాయి.
అయోధ్యలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. అందుబాటులో భాగం గానే వాటర్ మెట్రోను అందుబాటులోకి తీసుకొస్తు్న్నట్లు తెలుస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








