రిమోట్ కంట్రోల్‌తో నడిచే కార్ కమ్ క్వాడ్‌కాప్టర్ 'బి'
ఈ ఫొటోలో కనిపిస్తున్న వాహనం పేరు 'బి' (B). రోడ్డుపై వెళ్లటమే కాకుండా గాలిలోను విహరించగలగటం ఈ కారు ప్రత్యేకత. బ్రిటన్‌కు చెందిన ప్రోడక్ట్ డిజైనర్ విటోల్డ్ మీల్నిక్‌జెక్ ఈ కారును సృష్టించాడు. అయితే, ఈ కారులో మనుషులు ప్రయాణించలేదు. ఇది కేవలం కాన్సెప్ట్ మాత్రం. రిమోట్ కంట్రోల్ సాయంతో ఇది పనిచేస్తుంది. ఇదొక మంచి ఆఫ్-రోడర్ కారు మాదిరిగాను అలాగే క్వాడ్‌కాప్టర్ (నాలుగు రెక్కలు కలిగి ఉండే హెలికాఫ్టర్ లాంటిది) మాదిరిగాను పనిచేస్తుంది.
దీని బరువును అత్యంత తేలికగా ఉంచేందుకుగాను దీని నిర్మాణంలో పాలీ కార్బోనేట్ పదార్థాన్ని ఉపయోగించారు. బి వాహనంలోని నాలుగు చక్రాలలో నాలుగు ప్రొపెల్లర్లు, రెక్కలు ఉంటాయి. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఇది రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ వాహనం లిథియం అయాన్ బ్యాటరీల సాయంతో నడుస్తుంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా అవాతరం ఎదురొస్తే, ప్రొపెల్లర్లను ఆన్ చేసిన హెలికాఫ్ట్ మాదిరిగా గాలిలలో ఎగిరించి అవాంతరాలను అధిగమించవచ్చు.
దీని రెక్కలు, చక్రాలు పూర్తి ఫ్లెక్సిబిల్‌గా ఉండి విరగకుండా ఉంటాయి. కాబట్టి ఇది ఎత్తు నుంచి క్రిందకు పడిపోయానప్పటికీ ఇందులో విడిభాగాలు విరిగిపోవు. ప్రతి చక్రంలో అమర్చిన ప్రొపెల్లర్లు బ్రష్‌లెస్ మోటార్ల సాయంతో పనిచేస్తాయి. ఈ కారుకు ముందువైపు అమర్చిన హెడెఫినెషన్ కెమెరా 720 ఫ్రేమ్ సైజ్‌తో మంచి స్పష్టత కలిగిన వీడియోను రికార్డ్ చేయగలదు. ఇది 32జిబి డేటాను స్టోర్ చేసుకోగలదు. ఇది 11.1 వోల్ట్ 2200మి.ఆంప్ లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. పూర్తి ఛార్జ్‌పై 15 నిమిషాలు పనిచేస్తుంది. మరి ఈ 'బి' విశిష్టతలను మనం కూడా తిలకిద్దాం రండి..!

రిమోట్ కంట్రోల్‌తో నడిచే కార్ కమ్ క్వాడ్‌కాప్టర్

వీడియో
రిమోట్ కంట్రోల్‌తో నడిచే కార్ కమ్ క్వాడ్‌కాప్టర్
వీడియో
రిమోట్ కంట్రోల్‌తో నడిచే కార్ కమ్ క్వాడ్‌కాప్టర్
వీడియో

Click it and Unblock the Notifications