'బాబా రాందేవ్' మనసుదోచిన కారు.. ఇదే: వీడియో చూడండి

హిందూ ఆధ్యాత్మిక గురువు మరియు సుప్రసిద్ద యోగా గురువు మాత్రమే కాకుండా.. పతంజలి ఆశ్రమం స్థాపించి అత్యంత ప్రసిద్ధి చెందిన 'బాబా రాందేవ్' (Baba Ramdev) గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే యితడు అనేక మత, సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికి సుపరిచితుడుగా ఉన్నారు. అయితే బాబా రాందేవ్ ఇటీవల 'మహీంద్రా' (Mahindra) కంపెనీ యొక్క 'ఎక్స్​యూవీ700' (XUV700) కొనుగోలు చేశారు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి

నిజానికి కార్లంటే అందరికి ఏ విధంగా ఇష్టమో హిందూ ఆధ్యాత్మిక గురువు 'బాబా రాందేవ్' కి కూడా ఇష్టం. ఈ కారణంగానే ఇటీవల మహీంద్రా యొక్క XUV700 కొనుగోలు చేసి దానిని డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి

బాబా రాందేవ్ కార్లు మరియు బైకులు నడుపుతూ కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా బైకులు మరియు కార్లు నడుపుతూ చాలా సార్లు కనిపించారు. అయితే ఇప్పుడు రాందేవ్ బాబా డ్రైవ్ చేసిన XUV700 ఏ వేరియంట్ కి సంబంధించింది అనే విషయం స్పష్టంగా తెలియదు. అయితే దీనికి పనోరమిక్ సన్‌రూఫ్‌ ఉంది, కాబట్టి టాప్-ఎండ్ మోడల్ అయి ఉంటుంది.

'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి

బాబా రామ్‌దేవ్‌ వద్ద ఎలాంటి లగ్జరీ కాలర్లు లేవని నివేదికలు చెబుతున్నాయి, కానీ గతంలో జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ లో కనిపించాడు, అంతే కాకుండా అతని సన్నిహితుడు బాలకృష్ణకు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కూడా ఉంది. ఇందులో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. గతంలో కూడా బాబా సద్గురుతో కలిసి డుకాటీ స్క్రాంబ్లర్ లో కనిపించారు.

'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి

మహీంద్రా యొక్క XUV700 కి దేశీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ కారణంగా ఈ SUV బుక్ చేసుకున్న కస్టమర్లు డెలివరీ చేసుకోవడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. అయితే బుక్ చేసుకున్న వేరియంట్ ని బట్టి వెయిటింగ్ పీరియడ్ వివిధ రకాలుగా ఉంది.

'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి

మహీంద్రా ఎక్స్‌యూవీ700 బ్రాండ్ యొక్క అధునాతన ఉత్పత్తి. కావున ఇది మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో 7-ఎయిర్‌బ్యాగులు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్ బూస్టర్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, లేన్-కీప్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది.దీని ముందుభాగంలో కొత్త డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు క్రోమ్ ఫినిష్‌ కలిగిన వర్టికల్ స్లాట్‌లతో సరికొత్త గ్రిల్ కలిగి ఉంది. కొత్త లోగోను కూడా ఈ గ్రిల్ లో చూడవచ్చు. ఫ్రంట్ బంపర్ యొక్క దిగువ భాగంలో ఫాగ్ ల్యాంప్స్ మరియు రేడియేటర్ గ్రిల్ ఉన్నాయి. వీటికి దిగువన సిల్వర్ ఫినిష్డ్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఉంది. ఫ్రంట్ ఫాసియాలో సి-షేప్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో విలీనం చేయబడిన కొత్త ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్ యూనిట్‌లు ఉన్నాయి.

ఎక్స్‌యూవీ700 యొక్క సైడ్ ప్రొఫైల్ యొక్క హైలైట్ కొత్త డ్యూయల్-టోన్ మల్టీ-స్పోక్ 18 ఇంచెస్ అల్లాయ్ వీల్. వెనుక భాగంలో పెద్ద టెయిల్ లైట్లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, రిఫ్లెక్టర్లు కనిపిస్తాయి. ఇది కాకుండా, రూప్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫ్లష్ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ బాహ్య భాగంలో ఇవ్వబడ్డాయి.

'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి

మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. ఇందులో సౌండ్ కోసం సోనీ సౌండ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడింది. ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా ఎనేబుల్, 60 కి పైగా కనెక్ట్ ఫీచర్లు, ఇ-సిమ్ బేస్డ్ కనెక్ట్ టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 2 వ మరియు 3 వ వరుస ఎసి వెంట్‌లు, మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. మొత్తం మీద మహీంద్రా XUV700 ఆధునిక కాలంలో వినియోగదారులపాలిట అద్భుతమైన SUV గా నిలిచింది.

Most Read Articles

English summary
Baba ramdev buys new mahindra xuv700 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X