Video Viral అత్యంత ఖరీదైన ల్యాండ్‌ రోవర్‌ కారును డ్రైవింగ్‌ చేసిన బాబా రామ్‌దేవ్‌..!

ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టం. గత సంవత్సరం మహీంద్రా XUV700 కారును కొనుగోలు చేశారు. అయితే తాజాగా బాబా రామ్‌దేవ్‌ అత్యంత ఖరీదైన ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ కారును డ్రైవింగ్‌ చేస్తూ కనిపించారు. ఆ వీడియోను ఒకరు ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు.

అయితే బాబా రామ్‌దేవ్‌ ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ 130 కారును కొనుగోలు చేశారా లేదా అనే అంశంపై అధికారిక సమాచారం లేదు. వీడియోలో కనిపించిన కారు భారత మార్కెట్‌లో టాప్‌ ఎండ్‌ వేరియంట్‌గా తెలుస్తోంది. దాని ధర రూ.1.41 కోట్లు. ఈ SUV వివిధ రకాల సీట్ల ఎంపికలో కూడా అందుబాటులో ఉంది.

baba ramdev drives land rover

ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ 130 SUV 2998cc పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు గరిష్ఠంగా 394bhp శక్తి, 550Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ టెక్నాలజీని కలిగి ఉంది. ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ 130 SUV ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌లోనూ అందుబాటులో ఉంది.

ఈ కారు అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. 11.4 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, మల్టీ ఫంక్షన్‌ స్టీరింగ్‌ వీల్‌, ఇంజిన్ స్టార్ట్‌/ స్టాప్‌ బటన్‌, ABS, అల్లాయ్ వీల్స్‌, ఫాగ్‌ లైట్లు, 360 డిగ్రీల కెమెరా, 4 జోన్‌ ఆటోమేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌ సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

baba ramdev drives land rover

ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ 130 SUV అనేక రంగుల్లో అందుబాటులో ఉంటుంది. సెడోనా రెడ్‌, శాంటోరిని బ్లాక్‌, యులాంగ్‌ వైట్‌, సిలికాన్‌ సిల్వర్‌, ఈగర్‌ గ్రే, కపాతియన్‌ గ్రే, పుజి వైట్‌, గోండ్వానా స్టోన్‌, టాస్మాన్‌ బ్లూ, లాంటౌ బ్రోజ్‌, హుకుబా సిల్వర్‌, పాంగ్ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

2022 ఆగస్టులో బాబా రామ్‌దేవ్‌ మహీంద్రా XUV700 కారును కొనుగోలు చేశారు. అయితే కారు వేరియంట్ వివరాలు తెలియలేదు. అయితే సన్‌రూఫ్‌ ఆధారంగా టాప్‌ ఎండ్‌ మోడల్‌గా తెలుస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో రూ.14.01 లక్షల నుంచి రూ.26.18 లక్షల ఎక్స్‌షోరూం ధరకు మహీంద్రా XUV700 కారు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

యోగాగురు బాబా రామ్‌దేవ్‌కు లగ్జరీ కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టం. గతంలో కూడా జాగ్వార్‌ ఎక్స్‌జేఎల్‌లో కనిపించారు. అంతకు ముందు హీరో ఇంపల్స్‌ బైక్‌ను నడిపారు. బాబా రామ్‌దేవ్‌ గ్యారేజీలో ల్యాండ్‌ రోవర్ డిస్కవరి, రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా XUV700, జాగ్వార్‌ XJL ఉన్నాయి. బాబా రామ్‌దేవ్‌ ల్యాండ్ రోవర్‌ డిఫెండర్‌ 130 SUVను నడుపుతున్న వీడియో సోషల్‌ మీడియాలో తెర వైరల్‌ అవుతోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల‌్‌మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 25, 2023, 12:55 [IST]
English summary
Baba ramdev drives land rover defender 130 suv video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+